అన్వేషించండి

ఏఎన్నార్ ఒక నట విశ్వ విద్యాలయం, ఆఖరి రోజు వరకు నటించిన ఏకైక నటుడు: వెంకయ్య నాయుడు

అక్కినేని నాగేశ్వరావు శతజయంతి ఉత్సవాల్లో భాగంగా అన్నపూర్ణ స్టూడియోస్ లో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఏఎన్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

తెలుగు చలనచిత్ర పరిశ్రమ దిగ్గజనటులు అక్కినేని నాగేశ్వరావు శత జయంతి ఉత్సవాలు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే అక్కినేని కుటుంబ సభ్యులు నేడు (సెప్టెంబర్ 20) అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏఎన్ఆర్ విగ్రహ ఆవిష్కరణతో శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరు కాగా ఆయన చేతుల మీదుగా ఏఎన్ఆర్ పంచలోహ విగ్రహావిష్కరణ జరిగింది. వెంకయ్య నాయుడు విగ్రహాన్ని ఆవిష్కరించిన సమయంలో నాగార్జున ఎంతో ఎమోషనల్ అవుతూ పూలతో తన తండ్రికి నివాళులు అర్పించారు.

ఏఎన్ఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా వెంకయ్య నాయుడు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. "నాకు నాగేశ్వరావు అంటే చాలా అభిమానం. ఈ విగ్రహం లో జీవ కళ ఉట్టిపడుతోంది. ఆయనే నిజంగా నిలబడ్డారా అనేలా ఉంది. ఏఎన్ఆర్ మహానటుడు. గొప్ప వ్యక్తిత్వం ఉన్న మహామనిషి. నేను, ఆయన అనేక విషయాలు పై మాట్లాడుకునే వాళ్ళం. ఆయన జీవితమంతా నటిస్తూనే ఉన్నారు. ఆఖరి రోజు వరకు నటించిన నటుడు నాకు తెలిసి చిత్ర పరిశ్రమలో మరొకరు లేరు. సినిమా రంగంలో విలువలు పాటించిన వ్యక్తి నాగేశ్వరరావు. ఆయన చూపిన మార్గంలో ప్రయాణించడం ఆయనకు మనం ఇచ్చే నివాళి. ఆయన భాష, వేషం, వ్యక్తిత్వం వీటిలో కొంతైనా మనం అందిపుచ్చుకోవాలి. వాళ్ల కుటుంబమంతా తెలుగులో మాట్లాడడం నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు భాష కనుమరుగవుతేందేమోనని భయం పుడుతోంది. పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. తెలుగు అంటే నాగేశ్వరరావు కు చాలా అభిమానం. భాష పోతే శ్వాస పోతుంది. శ్వాస పోతే అంతా పోతుంది. అందుకే మన భాషను ఎప్పటికీ మర్చిపోకూడదు. అందరూ తెలుగులో మాట్లాడాలి" అని అన్నారు.

"తెలుగు సినీ రంగానికి ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్ళ లాంటివారు. నాగేశ్వరరావు తన జీవితానికి ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుకునేవారు. ఎలాంటి సినిమాలో అయినా ఒదిగిపోయేవారు. ఆయన ఒక నట విశ్వవిద్యాలయం. తెలుగు ప్రజల హృదయాల్లో ఎప్పటికీ జీవించే ఉంటారు. ఆయన జీవితాన్ని చదివారు. జీవితంలో ఆయన ఎన్నో పోరాటాలు చేశారు. దాన్ని ప్రేమించారు. ఆస్వాదించారు. జీవితంలో తాను నేర్చుకున్న అంశాలను ఆచరణలో పెట్టి చూపించారు. దీన్ని మనం అలవాటు చేసుకుంటే అది ఆయనకు మనం ఇచ్చే నివాళి. ఆయన ఎప్పుడూ పోరాడి ఓడిపోలేదు. ఆత్మవిశ్వాసం, జీవిత విలువలు తెలుసుకున్నారు. నేటి యువత కూడా వీటిని తెలుసుకోవాలి’’ అన్నారు.

‘‘ఆయన్ని నటుడుగా ఆరాధించడమే కాదు ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొందాల్సింది చాలా ఉందని నా అభిప్రాయం. సాధారణ రైతు కుటుంబంలో పుట్టి ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకున్నారు. సాంఘిక చిత్రాల్లో ఆయనకు ఆయనే సాటి. ఆయన ప్రతి సినిమాలో ఓ సందేశం ఉండేది. ఈ మధ్య సినిమాల్లో వాడుతున్న భాష ఏమాత్రం బాగుండడం లేదు. డబుల్ మీనింగ్ వచ్చేలా పదాలు వాడుతున్నారు. రాజకీయం కన్నా సినిమా ప్రభావం ప్రజలపై ఎక్కువ ఉంటుంది. అక్కినేని స్ఫూర్తితో మంచి లక్షణాలను అలవర్చుకొని తర్వాత తరానికి కూడా నేర్పించాలి. ఈ విగ్రహాన్ని ఆవిష్కరించే గౌరవం నాకు కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను" అని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.

Also Read : సుహాస్ మూవీ నుంచి క్రేజీ అప్ డేట్, ఫస్ట్ లుక్ రీలీజ్ ఎప్పుడంటే?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Mammootty : మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
Anupama Parameswaran : కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
Bandla Ganesh : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
Newtons 3rd Law OTT : ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS SL Galle Day 2 Updates: గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tadipatri High Tension: తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
Embed widget