అన్వేషించండి

Cable Reddy First Look: సుహాస్ మూవీ నుంచి క్రేజీ అప్ డేట్, ఫస్ట్ లుక్ రీలీజ్ ఎప్పుడంటే?

‘కలర్ ఫోటో’తో అద్భుత గుర్తింపు తెచ్చుకున్న సుహాన్, ప్రస్తుతం ‘కేబుల్‌ రెడ్డి’ అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చారు.

యూట్యూబ్ వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరీర్ మొదలు పెట్టిన నటుడు సుహాన్. సోషల్ మీడియా ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఆయన టాలీవుడ్ లోకి అడుగు పెట్టాడు. చిన్ని చిన్న పాత్రలు పోషించాడు. ‘కలర్ ఫోటో’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే సాలిడ్ హిట్ అందుకున్నాడు. కరోనా సమయంలో నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ సినిమా, ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. పలువురు సినీ ప్రముఖులు ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు.   

‘కేబుల్ రెడ్డి’ మూవీ నుంచి కీలక అప్ డేట్

రీసెంట్ గా ‘రైటర్ పద్మభూషన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫిబ్రవరిలో విడుదలైన సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ‘హిట్ 2’ సినిమాలో విలన్ పాత్రలో నటించి మెప్పించాడు. అమాయకుడిగా కనిపిస్తూనే క్రూరంగా హత్యలు చేసే వ్యక్తి పాత్ర పోషించాడు. పాత్ర ఏదైనా ఇట్టే ఒదిగిపోయిన నటిస్తాడు సుహాన్. ప్రస్తుతం ఆయన పలు సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో ఒకటి ‘కేబుల్ రెడ్డి’. శ్రీధర్‌ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ తాజాగా కీలక అప్ డేట్ ఇచ్చారు.  

రేపు ‘కేబుల్ రెడ్డి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

‘కేబుల్ రెడ్డి’ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రేపు(సెప్టెంబర్ 21) విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఉదయం 11.43 నిమిషాలకు ఈ పోస్టర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. “కేబుల్ రెడ్డి ఫస్ట్ లుక్ రేపు ఉదయం 11.43కు విడుదల. అందరూ చూస్తూనే ఉండండి” అంటూ రాసుకొచ్చారు.  ఇక ఈ సినిమా ఓ పట్ణణంలో జరిగే కథ నేపథ్యంలో కొనసాగుతుందని దర్శకుడు ఇప్పటికే వెల్లడించారు. ఆసక్తికర స్క్రీన్‌ ప్లేతో, ఆద్యంతం హాస్యరస భరితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు.

శరవేగంగా కొనసాగుతున్న షూటింగ్

‘కేబుల్ రెడ్డి’ సినిమాలో సుహాస్‌ సరసన  షాలిని కొండేపూడి హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీధర్‌ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. డైరెక్టర్ గా ఆయనకు ఇదే తొలి చిత్రం. ఈ సినిమాను ఫ్యాన్‌ మేడ్‌ ఫిల్మ్స్‌  పతాకంపై బాలు వల్లు, ఫణి ఆచార్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. త్వరలోనే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్టు ప్రొడక్షన్ పనులు మొదలయ్యే అవకాశం ఉంది. సినిమా రిలీజ్ పైనా మేకర్స్ త్వరలోనే ప్రకటన చేసే అవకాశం ఉంది.   ఈ చిత్రానికి మహిరెడ్డి పండుగల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సంగీత దర్శకుడిగా స్మరణ్‌ సాయి, ఆర్ట్‌ డైరెక్టర్ గా క్రాంతి ప్రియం వ్యవహరిస్తున్నారు.

Read Also: 49 లక్షల బడ్జెట్, 2 వేల కోట్ల వసూళ్లు - బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ మూవీ గురించి మీకు తెలుసా?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sabarimala Makara Jyothi 2025: శబరిమల మకరజ్యోతి కనిపించే ప్రదేశం ఇదే .. ఆ జ్యోతి నిజమా కాదా .. దాని వెనుకున్న సైన్స్ గురించి తెలుసా!
శబరిమల మకరజ్యోతి కనిపించే ప్రదేశం ఇదే .. ఆ జ్యోతి నిజమా కాదా .. దాని వెనుకున్న సైన్స్ గురించి తెలుసా!
Sankranthiki Vasthunam Twitter Review - 'సంక్రాంతికి వస్తున్నాం' ట్విట్టర్ రివ్యూ: ఎఫ్ 2 రేంజ్‌లో వెంకీ మార్క్ అనిల్ రావిపూడి సినిమా - జనాలు ఏమంటున్నారంటే?
'సంక్రాంతికి వస్తున్నాం' ట్విట్టర్ రివ్యూ: ఎఫ్ 2 రేంజ్‌లో వెంకీ మార్క్ అనిల్ రావిపూడి సినిమా - జనాలు ఏమంటున్నారంటే?
Viral News: కోడలు కావాల్సిన అమ్మాయితో తండ్రి ప్రేమ వివాహం - పెళ్లి దుస్తుల్లో కొత్త జంటను చూసిన యువకుడు ఏం చేశాడంటే?
కోడలు కావాల్సిన అమ్మాయితో తండ్రి ప్రేమ వివాహం - పెళ్లి దుస్తుల్లో కొత్త జంటను చూసిన యువకుడు ఏం చేశాడంటే?
Ration Cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్ డేట్ - మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్ డేట్ - మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mahakumbh 2025 | 144ఏళ్లకు ఓసారి వచ్చే ముహూర్తంలో మహాకుంభమేళా | ABP DesamDanthapuri Fort | బుద్ధుడి దంతం దొరికిన ప్రాంతం..అశోకుడు నడయాడిన ప్రదేశం | ABP DesamNara Devansh Sack Run | నారావారిపల్లెలో గోనెసంచి పరుగుపందెంలో దేవాన్ష్ | ABP DesamNara Devansh Lost Lokesh No Cheating | మ్యూజికల్ ఛైర్ లో ఓడిన దేవాన్ష్, ఆర్యవీర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sabarimala Makara Jyothi 2025: శబరిమల మకరజ్యోతి కనిపించే ప్రదేశం ఇదే .. ఆ జ్యోతి నిజమా కాదా .. దాని వెనుకున్న సైన్స్ గురించి తెలుసా!
శబరిమల మకరజ్యోతి కనిపించే ప్రదేశం ఇదే .. ఆ జ్యోతి నిజమా కాదా .. దాని వెనుకున్న సైన్స్ గురించి తెలుసా!
Sankranthiki Vasthunam Twitter Review - 'సంక్రాంతికి వస్తున్నాం' ట్విట్టర్ రివ్యూ: ఎఫ్ 2 రేంజ్‌లో వెంకీ మార్క్ అనిల్ రావిపూడి సినిమా - జనాలు ఏమంటున్నారంటే?
'సంక్రాంతికి వస్తున్నాం' ట్విట్టర్ రివ్యూ: ఎఫ్ 2 రేంజ్‌లో వెంకీ మార్క్ అనిల్ రావిపూడి సినిమా - జనాలు ఏమంటున్నారంటే?
Viral News: కోడలు కావాల్సిన అమ్మాయితో తండ్రి ప్రేమ వివాహం - పెళ్లి దుస్తుల్లో కొత్త జంటను చూసిన యువకుడు ఏం చేశాడంటే?
కోడలు కావాల్సిన అమ్మాయితో తండ్రి ప్రేమ వివాహం - పెళ్లి దుస్తుల్లో కొత్త జంటను చూసిన యువకుడు ఏం చేశాడంటే?
Ration Cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్ డేట్ - మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్ డేట్ - మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
Tirumala News: తిరుమల పరకామణిలో చోరీ - వెలుగులోకి సంచలన విషయాలు, బంగారం బిస్కెట్ మాత్రమే కాదు
తిరుమల పరకామణిలో చోరీ - వెలుగులోకి సంచలన విషయాలు, బంగారం బిస్కెట్ మాత్రమే కాదు
Crime News: కన్న కూతురికే లైంగిక వేధింపులు - ఇద్దరు భార్యల ముద్దుల భర్త, చివరకు వారి చేతుల్లోనే..
కన్న కూతురికే లైంగిక వేధింపులు - ఇద్దరు భార్యల ముద్దుల భర్త, చివరకు వారి చేతుల్లోనే..
Andhra News: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - సంక్రాంతి సెలవులు పొడిగింపు, ఎవరికంటే?
ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - సంక్రాంతి సెలవులు పొడిగింపు, ఎవరికంటే?
Cyber Fraud: సైబర్ మోసంతో రూ.2.42 కోట్లు కొట్టేశారు - బాధితుల్లో శాస్త్రవేత్త, వాట్సార్ గ్రూపులో చేర్చి మరీ..
సైబర్ మోసంతో రూ.2.42 కోట్లు కొట్టేశారు - బాధితుల్లో శాస్త్రవేత్త, వాట్సార్ గ్రూపులో చేర్చి మరీ..
Embed widget