NBK109 Title: బాలకృష్ణ సినిమాకు 'వీర మాస్' టైటిల్ - పల్స్ పట్టేసిన బాబీ!
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణను అభిమానులు ముద్దుగా 'నట సింహం' అనేవారు. ఇప్పుడు 'గాడ్ ఆఫ్ మాసెస్' అంటున్నారు. ఆ పల్స్ పట్టేసిన బాబీ కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారట.
Balakrishna New Movie Title: నందమూరి బాలకృష్ణ కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారా? అంటే... 'అవును' అని ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి, యూనిట్ సన్నిహితుల నుంచి సమాచారం అందుతోంది. అభిమానులు అందరికీ నచ్చే టైటిల్ ఫిక్స్ చేశారట దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర). ఆ వివరాల్లోకి వెళితే...
'వీర మాస్'గా ప్రేక్షకుల ముందుకు బాలకృష్ణ!
NBK109 Titled As Veera Mass?: బాలకృష్ణను ఆయన సన్నిహితులు 'బాల' అని పిలుస్తారు. నందమూరి నాయకుడికి ఆ పిలుపు ఇష్టం కూడా! అభిమానుల్లో కొంత మంది అయితే ముద్దుగా 'బాలయ్య బాబు' అంటుంటారు. ఇంతకు ముందు 'నట సింహం' అని బిరుదు ఇచ్చారు. ఇప్పుడు అయితే 'గాడ్ ఆఫ్ మాసెస్' అని గర్వంగా చెబుతున్నారు. ఆ పల్స్ పట్టేసిన బాబీ, కొత్త సినిమా టైటిల్ ఖరారు చేశారట.
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ కొల్లి దర్శకత్వంలో ఒక మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతోంది. హీరోగా బాలయ్య 109వ సినిమా కనుక NBK109ను వర్కింగ్ టైటిల్‌గా ఫిక్స్ చేశారు. ఈ చిత్రానికి 'వీర మాస్' టైటిల్ ఖరారు చేశారట. అదీ సంగతి! అభిమానులకు ఈ టైటిల్ నచ్చుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.
Also Read: 25 అమ్మాయితో 56 ఏళ్ల రవితేజ రొమాన్స్ - మిస్టర్ బచ్చన్ సాంగ్ ట్రోలర్‌కు ఇచ్చి పారేసిన హరీష్ శంకర్
'వీర మాస్' (Veera Mass Movie) టైటిల్ గురించి చిత్ర బృందం అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ, 'వీర' అనేది బాలకృష్ణతో పాటు బాబీకి కలిసి వచ్చిన పదం. సంక్రాంతికి 'వీర సింహా రెడ్డి'గా బాలకృష్ణ సందడి చేస్తే... చిరును 'వాల్తేరు వీరయ్య'గా చూపించి బాబీ విజయం అందుకున్నారు. ఇప్పుడు ఆ ఇద్దరు కలిసి చేస్తున్న టైటిల్‌లో 'వీర' ఉండటం విశేషమే.
NBK109 Movieను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలపై నాగవంశీ సూర్యదేవర, త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికి రెండు గ్లింప్స్ విడుదల చేయగా... ఆ రెండూ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఇటీవల బాలీవుడ్ బ్యూటీ, ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న ఊర్వశి రౌటేలాకు ప్రమాదం జరిగిందని సమాచారం. అయితే, దీని గురించి చిత్ర బృందం ఏమీ చెప్పలేదు.
Also Read: ప్రణీత్ హనుమంతు ఎవరు? అతని బ్యాగ్రౌండ్ ఏమిటి? ఏయే సినిమాల్లో నటించాడు?
NBK109 Movie Cast And Crew: బాలకృష్ణ, ఊర్వశి రౌటేలా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో, 'యానిమల్' ఫేమ్ బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులోనూ ఆయనది ప్రతినాయకుడి ఛాయలు ఉన్న పాత్ర అని టాక్. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.