అన్వేషించండి

Varun Tej Operation Valentine: 'ఆపరేషన్‌ వాలెంటైన్‌' షూటింగ్‌ టైంలో ఎయిర్‌ క్రాఫ్ట్స్‌ క్రాష్‌ అయ్యాయి - ఇద్దరు పైలెట్స్‌ చనిపోయారు

Varun Tej: ఆపరేషన్‌ వాలెంటైన్‌ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా వరుణ్‌ తేజ్‌ ఓ ఇంటర్య్వూలో మాట్లాడాడు. ఈ సందర్భంగా షూటింగ్‌ టైంలో జరిగిన రియల్‌ ఇన్సిడెంట్‌ గురించి ప్రస్తావించాడు

Operation Valentain movie: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం వాలంటైన్‌ సినిమాతో బిజీగా ఉన్నాడు. బాలీవుడ్‌ డైరెక్టర్‌ శక్తి ప్రతాప్ సింగ్‌ ఈ సినిమాను హిందీ, తెలుగులో భాషల్లో ఎకకాలంలో తెరకెక్కించాడు. ఈ చిత్రం వరుణ్‌ తేజ్‌ సరసన మాజీ మిస్‌ ఇండియా మానుషి చిల్లర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. మార్చి 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో మూవీ టీం ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. ఇక వరుణ్‌ తేజ్‌ అయితే వరుస ఇంటర్య్వూలతో బిజీ బిజీ అయిపోయాడు. తాజాగా ఓ చానల్‌తో ముచ్చటించిన వరుణ్‌ సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

ఈ సినిమాను 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో భారత జవాన్లపై జరిగిన దాడి, తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్థాన్, అక్కడి ఉగ్రవాదులపై తీర్చుకున్న ప్రతీకారం నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందని చెప్పాడు. ఫిబ్రవరి 14న ఈ ఇన్సిడెంట్‌ జరిగింది కాబట్టి 'వాలెంటైన్‌' అని పేరు పెట్టామన్నాడు. ఇక ఈ సినిమాలో కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారని అడగ్గా.. రియల్‌ ఎయిర్‌ఫోర్స్‌తో చేశామని, లోకేషన్స్‌ కూడా నిజమైనవే అని చెప్పాడు. గ్వాలియర్‌లోనే ఈ సినిమా షూటింగ్‌ మొత్తం జరిగిందన్నాడు. "ముందు సినిమా స్క్రిప్ట్‌ను MODకి పంపించాం. వాళ్లకు స్క్రిప్ట్‌ నచ్చడంతో షూటింగ్‌కి పర్మిషన్‌ ఇచ్చారు. రియల్‌ లోకేషన్స్‌‌, ఎయిర్‌ ఫోర్స్‌ బెసిస్‌ కూడా ఇచ్చారు. ఐఎఫ్‌,MOD కూడా ఈ సినిమాలో నటించారు. ఐఎఫ్‌ పర్సన్స్‌ని కూడా సెట్లోనే పెట్టారు" అంటూ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత  సినిమా షూటింగ్‌ ఎక్కువగా కశ్మీర్‌, గ్వాలియర్‌, హైదరాబాద్‌లో జరిగిందని పెర్కొన్నాడు.

Also Read: కొన్నిసార్లు నేను అబ్బాయిలా కూడా ఆలోచిస్తా - 'ఫెమినిజం' మహిళలకు మాత్రమే సంబంధించింది కాదు

ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న టైంలో రెండు రియల్‌ ఎయిర్‌క్రాప్ట్స్‌ క్రాష్‌ అయ్యాయని షాకింగ్‌ విషయం చెప్పాడు. "ఓ రోజు మూవీ షూటింగ్‌ జరుగుతుండగా అమ్రత్‌ సర్‌కు సమీపంలో రెండు ఎయిర్‌ క్రాప్ట్స్‌ క్రాష్‌ అయ్యాయని విన్నాను. ఈ ఘటనలో ఇద్దరు పైలెట్స్‌ చనిపోయారు. ఇది ఏదో స్మాల్‌ ఫంక్షన్‌ జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది" అని చెప్పాడు. అలాగే ఇదే ఇంటర్య్వూలో వరణ్‌ మరో ఆసక్తికర విషయం చెప్పాడు. తన అసలు పేరు వరుణ్‌ తేజ్‌ కాదని, ఫుల్‌ నేమ్‌ సాయి వరుణ్ తేజ్ అంటూ అసలు విషయం చెప్పాడు. అయితే స్క్రీన్‌పై పేరు పెద్దదిగా ఉందని తన పేరు నుంచి సాయి తీసేసరన్నాడు. అయితే తన స్టడీ సర్టిఫికేట్స్‌, పాస్‌పోర్ట్‌ అన్నింటిలో ‘సాయి వరుణ్ తేజ్’ అనే ఉంటుందని పేర్కొన్నాడు. 

మెగా ప్రిన్స్‌ ఈసారైన హిట్‌ కొడతాడా?

ఈ మధ్య కాలంలో వరుణ్‌ తేజ్‌ పెద్దగా కలసి రావడం లేదనే చెప్పాలి. వరుసగా సినిమాలు చేసుకుంటుపోతున్నాడు కానీ ఈ మెగా హీరోకు ఆశించిన విజయం దక్కడం లేదు. గత చిత్రాలు వరుసగా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఎన్నో అంచాల మధ్య వచ్చిన ‘గని’, ‘గాండీవధారి అర్జున’ సినిమాలు దారుణ ఫలితాలు ఇచ్చాయి. దీంతో ఈసారి ఎలాగైన ఆపరేషన్‌ వాలెంటైన్ తో మెగా రేంజ్‌లో భారీ హిట్‌ కొట్టాలని ఆశలు పెట్టుకున్నాడు. కానీ బాలీవుడ్‌ డైరెక్టర్ ఈ సినిమా చేయడం.. వరుణ్‌ తప్ప ఎవరూ తెలుగు వారు లేకపోవడంతో ఇక్కడ ఈ సినిమాకు పెద్దగా హైప్‌ కనిపించడం లేదు. దీంతో ఈ మూవీ రిజల్ట్‌పై మెగా ఫ్యాన్స్‌ వర్రీ అవుతున్నారు. మరి విడుదల తర్వాత ఈ సినిమా ఎలాంటి రిజల్ట్‌ ఇస్తుందో చూడాలి.

టాప్ హెడ్ లైన్స్

Isakapatnam Web Series Review - 'ఇసకపట్నం' రివ్యూ: ప్రైమ్ వీడియోలో సముద్రఖని, ఐశ్వర్య రాజేష్‌ల వెబ్ సిరీస్ - ఎలా ఉందంటే?
'ఇసకపట్నం' రివ్యూ: ప్రైమ్ వీడియోలో సముద్రఖని, ఐశ్వర్య రాజేష్‌ల వెబ్ సిరీస్ - ఎలా ఉందంటే?
Cocktail 2 OTT : ఓటీటీలోకి రష్మిక లేటెస్ట్ బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఓటీటీలోకి రష్మిక లేటెస్ట్ బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Vaazha 2 OTT : రెండు ఓటీటీల్లో మలయాళ బ్లాక్ బస్టర్ - 200 కోట్ల మూవీ ఎందులో చూడొచ్చంటే?
రెండు ఓటీటీల్లో మలయాళ బ్లాక్ బస్టర్ - 200 కోట్ల మూవీ ఎందులో చూడొచ్చంటే?
Aaruguru Pativratalu Re Release : ఆరుగురు పతివ్రతలు మళ్లీ వస్తున్నారా? - సోషల్ మీడియాలో అదే హాట్ టాపిక్
ఆరుగురు పతివ్రతలు మళ్లీ వస్తున్నారా? - సోషల్ మీడియాలో అదే హాట్ టాపిక్

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
WhatsApp Username Feature:భారత్‌లో వాట్సాప్ 'యూజర్‌నేమ్' ఫీచర్‌పై నిషేధం! 3 రోజుల్లోగా స్పందించాలని మెటాకు కేంద్రం నోటీసు!
భారత్‌లో వాట్సాప్ 'యూజర్‌నేమ్' ఫీచర్‌పై నిషేధం! 3 రోజుల్లోగా స్పందించాలని మెటాకు కేంద్రం నోటీసు!
Telangana Latest News: తెలంగాణ అప్పులపై చర్చకు ప్లేస్‌, టైం ఫిక్స్ చేయమని కేటీఆర్ సవాల్! తెలంగాణ భవన్‌లో పెడదామని మంత్రి జూపల్లి ప్రతిసవాల్! 
తెలంగాణ అప్పులపై చర్చకు ప్లేస్‌, టైం ఫిక్స్ చేయమని కేటీఆర్ సవాల్! తెలంగాణ భవన్‌లో పెడదామని మంత్రి జూపల్లి ప్రతిసవాల్! 
Serial Killer Book: దొరకకుండా మగవాళ్లను చంపేయడం ఎలా? - పుస్తకం మార్కెట్లోకి వచ్చేసింది - ఇక పురుషులకు రక్షణేది?
దొరకకుండా మగవాళ్లను చంపేయడం ఎలా? - పుస్తకం మార్కెట్లోకి వచ్చేసింది - ఇక పురుషులకు రక్షణేది?
Viral Video: 'హౌ టు కిల్ మెన్' బుక్ చదువుతున్న యువతి! సోనమ్, సియా, ముస్కాన్‌తో పోలుస్తున్న నెటిజన్లు!
'హౌ టు కిల్ మెన్' బుక్ చదువుతున్న యువతి! సోనమ్, సియా, ముస్కాన్‌తో పోలుస్తున్న నెటిజన్లు!
Plot To Topple CM Vijay Government: సీఎం విజయ్ ప్రభుత్వంపై రూ. 35 కోట్ల కుట్ర! టీవీకే ఎమ్మెల్యే కొనుగోలుకు డీఎంకే నేతల యత్నం.. ముగ్గురు అరెస్ట్!
సీఎం విజయ్ ప్రభుత్వంపై రూ. 35 కోట్ల కుట్ర! టీవీకే ఎమ్మెల్యే కొనుగోలుకు డీఎంకే నేతల యత్నం.. ముగ్గురు అరెస్ట్!
WhatsApp User ID:వాట్సాప్ యూజర్ ఐడీతో చిక్కుల్లో మెటా! నోటీసులు పంపేందుకు సిద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వం!
వాట్సాప్ యూజర్ ఐడీతో చిక్కుల్లో మెటా! నోటీసులు పంపేందుకు సిద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వం!
Chandrababu Naidu Reaction Cattle Death: కన్నీటి ఏరువాక.. తుంగభద్రలో కాడెద్దుల మృతి! చలించిపోయిన సీఎం చంద్రబాబు.. రైతు కుటుంబానికి తక్షణ సాయం!
కన్నీటి ఏరువాక.. తుంగభద్రలో కాడెద్దుల మృతి! చలించిపోయిన సీఎం చంద్రబాబు.. రైతు కుటుంబానికి తక్షణ సాయం!
Cocktail 2 OTT : ఓటీటీలోకి రష్మిక లేటెస్ట్ బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఓటీటీలోకి రష్మిక లేటెస్ట్ బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Embed widget