అన్వేషించండి

Varun Tej : ఫ్లాప్ ప్రొడ్యూసర్లకు వరుణ్ తేజ్ భరోసా - వాళ్ళకు అండగా నిలబడటం కోసం...

మాస్ కమర్షియల్ సినిమాల వెంట పరుగులు తీయకుండా ఎప్పటికప్పుడు కొత్త కథలు, వైవిధ్యమైన సినిమాలు చేసే హీరో వరుణ్ తేజ్. ఇప్పుడు ఆయన తీసుకున్న ఓ నిర్ణయంపై ఫ్యాన్స్ గ్రేట్ అంటున్నారు. 

మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో యువ కథానాయకుల్లో నాగబాబు తనయుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) రూటే సపరేటు! ఆయన ఎప్పుడూ మాస్, కమర్షియల్ కథల వెంట పరుగులు తీయలేదు. కంటెంట్ బేస్డ్ కొత్త తరహా కథలతో  ప్రేక్షకుల ముందుకు రావాలని చూశారు. తనను తాను ఓ ఇమేజ్ చట్రంలో బందీ చేసుకోకుండా వైవిధ్యమైన చిత్రాలు చేయాలని ప్రయత్నిస్తున్నారు. 

కథానాయకుడిగా వరుణ్ తేజ్ ప్రయాణంలో విజయాలు ఉన్నాయి. అలాగే, కొన్ని పరాజయాలు కూడా ఉన్నాయి. అయితే... తనతో సినిమాలు తీసిన నిర్మాతలు మేలు కోరుతూ ఆయన తీసుకున్న నిర్ణయం చిత్రసీమ ప్రముఖులు, ముఖ్యంగా మెగా అభిమానుల ప్రశంసలు అందుకుంటోంది. ఇంతకీ, వరుణ్ తేజ్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు? ఏం చేయబోతున్నారు? అనే వివరాల్లోకి వెళితే... 

ఫ్లాప్ నిర్మాతలకు వరుణ్ భరోసా!
వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించిన లాస్ట్ రెండు సినిమాలు బాక్సాఫీస్ బరిలో ఘోర పరాజయం పాలయ్యాయి. బాక్సింగ్ నేపథ్యంలో ఆ మధ్య వచ్చి 'గని'కి గానీ, అలాగే మెడికల్ వేస్టేజీ నేపథ్యంలో వచ్చిన 'గాండీవధారి అర్జున'కు గానీ ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. వసూళ్లు కూడా లేవు. ఈ తరుణంలో ఆయా సినిమాలు తీసిన నిర్మాతలకు మళ్ళీ సినిమాలు చేయాలని వరుణ్ తేజ్ డిసైడ్ అయ్యారు. 

'గాండీవధారి అర్జున'ను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై సీనియర్ నిర్మాత బీవీఎస్ఎస్ ప్రసాద్, ఆయన తనయుడు బాపినీడు బి నిర్మించారు. ఈ సినిమా కంటే ఆ సంస్థలో 'తొలి ప్రేమ' చేశారు వరుణ్ తేజ్. ఆ సినిమా హిట్. అయితే, రెండో సినిమా ఫ్లాప్ అయ్యింది. దాంతో వాళ్ళకు మరో సినిమా చేస్తానని వరుణ్ తేజ్ చెప్పారట. 

'గాండీవధారి అర్జున'కు ముందు వరుణ్ తేజ్ చేసిన సినిమా 'గని'. ఆ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ పెద్ద కుమారుడు బాబీ (వెంకటేష్), వరుణ్ తేజ్ స్నేహితుడు సిద్ధూ ముద్ద నిర్మించారు. వాళ్ళకు కూడా వరుణ్ తేజ్ ఓ సినిమా చేస్తానని మాట ఇచ్చారని ఫిల్మ్ నగర్ వర్గాలు తెలిపాయి. నిర్మాతలకు అండగా నిలబడాలని, వాళ్ళను ఆదుకోవాలని వరుణ్ తేజ్ తీసుకున్న నిర్ణయం పట్ల చిత్రసీమ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : విలన్‌ను హీరో చేస్తే బలిసింది - గోపీచంద్‌పై దర్శకుడి ఫైర్
 
'గాండీవధారి అర్జున' ఫలితాన్ని వరుణ్ తేజ్ ముందుగా ఊహించారో? లేదంటే ఇంకేదైనా జరిగిందో? ఆ సినిమాకు ఆయన హాఫ్ రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకున్నారు. హీరోతో పాటు దర్శకుడు ప్రవీణ్ సత్తారు కూడా తన పారితోషికంతో సగమే తీసుకున్నారు. అదీ సంగతి!

Also Read నితిన్ జోడీగా 'కాంతార' కథానాయిక సప్తమి, కీలక పాత్రలో లయ కూడా - ఏ సినిమాలోనో తెలుసా?

ఇప్పుడు వరుణ్ తేజ్ చేస్తున్న సినిమాలకు వస్తే... ఇప్పుడు ఆయన చేతిలో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో ఒకటి 'ఆపరేషన్ వాలెంటైన్'. అందులో మానుషీ చిల్లర్ హీరోయిన్. ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. షూటింగ్ ఫినిష్ అయ్యింది. వరుణ్ తేజ్ చేస్తున్న మరో సినిమా 'మట్కా'. దీనికి 'పలాస', 'శ్రీదేవి సోడా సెంటర్' సినిమాల ఫేమ్ కరుణ కుమార్ దర్శకుడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాలో మీనాక్షీ చౌదరి హీరోయిన్. నోరా ఫతేహి కీలక పాత్ర చేస్తున్నారు.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget