Sabari First Review: శబరి ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - తల్లి పాత్రలో వరలక్ష్మి నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Varalaxmi Sarathkumar Interview: వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన 'శబరి' మే 3న విడుదల కానుంది. ఈ సినిమా ఫస్ట్ రివ్యూ ఆల్రెడీ వచ్చేసింది. వరలక్ష్మి నుంచి. సినిమా గురించి ఆవిడ ఏమన్నారంటే...
జీవితం అంటేనే రిస్క్ అని, వెండితెరపై తల్లి పాత్రలో నటించడం రిస్క్ అని తాను అసలు భావించడం లేదని విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar) చెప్పారు. నటిగా తన తొలి సినిమా 'పోడా పొడి'లో తల్లి పాత్రలో నటించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. 'క్రాక్', 'నాంది', 'యశోద', 'వీర సింహా రెడ్డి', 'హనుమాన్'తో తెలుగులో వరుస విజయాలు అందుకున్నారు. మే 3న 'శబరి' సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
తెలుగులో వరలక్ష్మీ శరత్ కుమార్ నటించిన తొలి మహిళా ప్రాధాన్య చిత్రం 'శబరి'. తన కుమార్తెను కాపాడుకోవడం కోసం తల్లి ఎటువంటి సాహసం చేసిందనేది చిత్ర కథ. ఈ సినిమాకు ఫస్ట్ రివ్యూ వరలక్ష్మి నుంచి వచ్చింది. తన సినిమా గురించి ఆవిడ ఏమన్నారంటే?
నో ల్యాగ్... క్లియర్ కట్ థ్రిల్లర్
Sabari Movie First Review: 'శబరి' స్క్రీన్ ప్లే చాలా బావుంటుందని, స్పీడుగా కథ ముందుకు వెళుతుందని వరలక్ష్మీ శరత్ కుమార్ చెప్పారు. ఇంకా సినిమా గురించి ఆవిడ మాట్లాడుతూ... ''సినిమా ప్రారంభమైన వెంటనే కథలోకి వెంటనే వెళతారు. ల్యాగ్ ఉండదు. లెంగ్త్ అసలే లేదు. ఇదొక క్లియర్ కట్ స్ట్రెయిట్ థ్రిల్లర్ ఫిల్మ్. నేను డబ్బింగ్ చెప్పిన తర్వాత సినిమా చూశా. కొన్ని కరెక్షన్స్ ఉంటే చేశాం. ఫైనల్ కాపీ చాలా బావుంది'' అని చెప్పారు.
సెటిల్డ్ పెర్ఫార్మన్స్ చేసే ఛాన్స్ వచ్చింది
Sabari Movie Story: 'శబరి'లో సెటిల్డ్ పెర్ఫార్మన్స్ చేసే అవకాశం లభించిందని వరలక్ష్మీ శరత్ కుమార్ చెప్పుకొచ్చారు. టైటిల్, కథ గురించి ఆవిడ మాట్లాడుతూ... ''శబరి ఎవరి క్యారెక్టర్ పేరు కాదు. నా క్యారెక్టర్ విషయానికి వస్తే... సాధారణ మహిళ పాత్ర చేశా. వైవాహిక జీవితంలో సమస్యల కారణంగా భర్త నుంచి వేరు పడుతుంది. కూతుర్ని ఒంటరిగా పెంచుతుంది. ఆమె జీవితంలో ఏమైంది? కుమార్తె కోసం ఎలా పోరాడింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి'' అని చెప్పారు. తల్లీ కూతుళ్ల అనుబంధం సినిమాకు హైలైట్ అవుతుందని, సైకలాజికల్ థ్రిల్లర్ (Sabari Movie Genre)గా తెరకెక్కిన ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
'క్రాక్'కు ముందు విన్న కథ... జెన్యూన్ ప్రొడ్యూసర్
నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల గురించి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రత్యేకంగా మాట్లాడారు. ''మా నిర్మాత ఖర్చు విషయంలో రాజీ పడకుండా సినిమా తీశారు. ఆయన జెన్యూన్ పర్సన్. మీరు ఆ మధ్య జరిగిన ప్రెస్‌మీట్ చూస్తే అందరూ ఆయన గురించి మాట్లాడారు. మంచి మనిషి కాబట్టే అలా చెప్పారంతా. ఎవరినీ చీట్ చేసే మెంటాలిటీ ఆయనకు లేదు. ఆర్టిస్టులు అడగకముందే పేమెంట్ వస్తుంది. ముందు అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు అయినా సినిమా పూర్తి చేశారు'' అని చెప్పారు. ఆయన మంచి కథతో వస్తే మరో సినిమా చేయడానికి రెడీగా ఉన్నట్లు తెలిపారు.
రవితేజ 'క్రాక్' చిత్రానికి సంతకం చేయడానికి ముందు 'శబరి' కథ విన్నానని వరలక్ష్మీ శరత్ కుమార్ తెలిపారు. ఇంకా సినిమా గురించి ఆవిడ మాట్లాడుతూ... ''కథ ముందు విన్నా చిత్రీకరణ చాలా రోజుల తర్వాత ప్రారంభించాం. నేను చేసే స్టీరియో టైపు టిపికల్ నెగిటివ్ షేడ్ రోల్ కాకుండా కొత్తగా ఉండటంతో పాటు కథ బావుండటంతో ఓకే చేశా. తల్లి పాత్రలో నేను నటించి మెప్పించగలనని దర్శక నిర్మాతలు నమ్మారు. ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా చేయడానికి ధైర్యంగా వచ్చిన వాళ్లను ముందుగా అభినందించాలి'' అని చెప్పారు.
Also Read: రెమ్యూనరేషన్ తీసుకోవట్లేదు... ప్రాఫిట్ షేరింగ్ బేసిస్ మీద సినిమా చేస్తున్న రామ్!