అన్వేషించండి

Varalaxmi Sarathkumar: పెళ్లి ఎప్పుడో చెప్పిన వరలక్ష్మి - కాబోయే భర్తకు ఆ ఛాన్స్ లేదంటోంది!

Varalaxmi Sarathkumar On Her Marriage: వరలక్ష్మీ శరత్ కుమార్ తన వ్యక్తిగత జీవితం గురించి వీలైనంత తక్కువగా మాట్లాడుతుంది. 'శబరి' సినిమా విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మ్యారేజ్ అప్డేట్ ఇచ్చింది.

వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar) కుటుంబ నేపథ్యం ప్రేక్షకులకు తెరిచిన పుస్తకమే. తెలుగు, తమిళ ప్రేక్షకులకు తెలిసిన కథానాయకుడు శరత్ కుమార్ కుమార్తె కావడం, కథానాయికగా ఆమె సైతం సినిమాలు చేస్తుండటంతో వ్యక్తిగత జీవితం సైతం ఎప్పుడూ వార్తల్లో ఉంటోంది. ఒక హీరోతో ఆమె ప్రేమ, బ్రేకప్ వ్యవహారాలపై చర్చలు జరిగిన రోజులు ఉన్నాయి. అయితే... ముంబైకు చెందిన  వ్యాపారవేత్త నికోలయ్ సచ్‌దేవ్‌ (Nicolai Sachdev) ప్రేమ విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. 

మార్చి 2న తనకు నిశ్చితార్థం జరిగిన విషయాన్ని వరలక్ష్మీ శరత్ కుమార్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఆ న్యూస్ చాలా మందికి షాక్ ఇచ్చింది. వెంటనే అతడు ఎవరు? అంటూ ఆరాలు తీశారు. ఆర్ట్ గ్యాలరీల నిర్వాహకుడు, ఆన్‌లైన్‌లో పెయింటింగ్ వంటివి అమ్మే వ్యాపారాలు నిర్వహిస్తాడని తెలుసుకుని... వరలక్ష్మికి, అతనికి ఎలా పరిచయం అయ్యింది? ఎప్పుడు ప్రేమలో పడింది? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మెడలో దండలు, చేతికి రింగులు మార్చుకున్నారు. మరి, పెళ్లి ఎప్పుడు? అని అడిగితే వరలక్ష్మీ శరత్ కుమార్ ఏం సమాధానం ఇచ్చారో తెలుసా?

2024లోనే ఏడు అడుగులు వేస్తాం!
వరలక్ష్మీ శరత్ కుమార్ నటించిన 'శబరి' సినిమా మే 3న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా తెలుగు మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఎంగేజ్మెంట్ చేసుకున్నందుకు కంగ్రాట్స్ చెబుతూ పెళ్లి ఎప్పుడు అని ప్రశ్నిస్తే... ''ఈ ఏడాదిలో పెళ్లి చేసుకుంటా'' అని సమాధానం ఇచ్చింది.

Also Read: శబరి ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - తల్లి పాత్రలో వరలక్ష్మి నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

''నా పెళ్లి భాజాభజంత్రీలు ఈ ఏడాది వినబడతాయి. వెడ్డింగ్ బెల్స్ గురించి ఆలోచిస్తే నా బుర్రలో గంటలు మోగుతున్నాయి'' అని వరలక్ష్మీ శరత్ కుమార్ సరదాగా వ్యాఖ్యానించారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar)

కాబోయే భర్తకు ఆ అవకాశం లేదుగా!
వరలక్ష్మీ శరత్ కుమార్ నటించిన సినిమాలను నికోలయ్ సచ్‌దేవ్‌ చూస్తారా? చూసి ఏమని చెబుతారు? అని అడిగితే... ''బావుందంటే బావుందని చెబుతారు. ఒకవేళ బాలేదనుకోండి, బాలేదంటారు. అయినా ఆయనకు ఆ అవకాశం లేదు. ఇప్పటి వరకు నటించిన సినిమాల్లో నా నటన బావుందని చెప్పారు'' అని ఆవిడ నవ్వేశారు.

Also Read'జాతి రత్నాలు' to 'టిల్లు స్క్వేర్'... కామెడీ కాదు, కోవిడ్ తర్వాత కోట్లు కొల్లగొట్టిన పైసా వసూల్ ఫార్ములా


ఐదారు సినిమాలతో వరలక్ష్మి ఫుల్ బిజీ!
Varalaxmi Sarathkumar Upcoming Movies: 'శబరి' తర్వాత 'కూర్మ నాయకి'తో వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తెలుగులో మరో రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. తమిళంలో ధనుష్ సినిమా ఒకటి చేస్తున్నారు. అది కాకుండా మరో రెండు సినిమాలు ఉన్నాయి. కన్నడలో కిచ్చా సుదీప్ 'మ్యాక్స్' చిత్రీకరణ పూర్తి చేసినట్లు వరలక్ష్మి తెలిపారు. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటించనున్నట్లు తెలిసింది.

Also Readరెమ్యూనరేషన్ తీసుకోవట్లేదు... ప్రాఫిట్ షేరింగ్ బేసిస్ మీద సినిమా చేస్తున్న రామ్!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CRDA Building: ఏడాది కిందట శిథిలం -నేడు వరల్డ్ క్లాస్ బిల్డింగ్ - 13న సీఆర్డీఏ భవనం ప్రారంభోత్సవం
ఏడాది కిందట శిథిలం -నేడు వరల్డ్ క్లాస్ బిల్డింగ్ - 13న సీఆర్డీఏ భవనం ప్రారంభోత్సవం
SSMB29 Title: అవును... మహేష్ - రాజమౌళి సినిమా టైటిల్ ఆప్షన్స్‌లో అదొకటి!
అవును... మహేష్ - రాజమౌళి సినిమా టైటిల్ ఆప్షన్స్‌లో అదొకటి!
Manchu Vishnu Statement: మోహన్ బాబు యూనివర్శిటీపై అదంతా దుష్ప్రచారమే, ఎవరూ ఆందోళన చెందొద్దు: మంచు విష్ణు
మోహన్ బాబు యూనివర్శిటీపై అదంతా దుష్ప్రచారమే: మంచు విష్ణు కీలక ప్రకటన
Director Jayashankarr Interview: ఏఐతో 'అరి' విఎఫ్ఎక్స్ చేశాం... జాక్వెలిన్‌తో నెక్స్ట్ సినిమా - 'అరి' దర్శకుడు జయశంకర్ ఇంటర్వ్యూ
ఏఐతో 'అరి' విఎఫ్ఎక్స్ చేశాం... జాక్వెలిన్‌తో నెక్స్ట్ సినిమా - 'అరి' దర్శకుడు జయశంకర్ ఇంటర్వ్యూ
Advertisement

వీడియోలు

TATA Group Power Struggle Explained | ఆధిపత్యం కోసం టాటా సంస్థల్లో అంతర్యుద్ధం | ABP Desam
ఆ క్రెడిట్ ద్రవిడ్‌దే..! గంభీర్‌కి షాకిచ్చిన రోహిత్
గ్రౌండ్‌‌లోనే ప్లేయర్‌ని బ్యాట్‌తో కొట్టబోయిన పృథ్వి షా
ప్యానిక్ మోడ్‌లో పీసీబీ అడుక్కుంటున్నా నో అంటున్న ఫ్యాన్స్!
ముంబై ఇండియన్స్ లోకి ధోనీ? CSK ఫ్యాన్స్ కి హార్ట్ బ్రేక్!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CRDA Building: ఏడాది కిందట శిథిలం -నేడు వరల్డ్ క్లాస్ బిల్డింగ్ - 13న సీఆర్డీఏ భవనం ప్రారంభోత్సవం
ఏడాది కిందట శిథిలం -నేడు వరల్డ్ క్లాస్ బిల్డింగ్ - 13న సీఆర్డీఏ భవనం ప్రారంభోత్సవం
SSMB29 Title: అవును... మహేష్ - రాజమౌళి సినిమా టైటిల్ ఆప్షన్స్‌లో అదొకటి!
అవును... మహేష్ - రాజమౌళి సినిమా టైటిల్ ఆప్షన్స్‌లో అదొకటి!
Manchu Vishnu Statement: మోహన్ బాబు యూనివర్శిటీపై అదంతా దుష్ప్రచారమే, ఎవరూ ఆందోళన చెందొద్దు: మంచు విష్ణు
మోహన్ బాబు యూనివర్శిటీపై అదంతా దుష్ప్రచారమే: మంచు విష్ణు కీలక ప్రకటన
Director Jayashankarr Interview: ఏఐతో 'అరి' విఎఫ్ఎక్స్ చేశాం... జాక్వెలిన్‌తో నెక్స్ట్ సినిమా - 'అరి' దర్శకుడు జయశంకర్ ఇంటర్వ్యూ
ఏఐతో 'అరి' విఎఫ్ఎక్స్ చేశాం... జాక్వెలిన్‌తో నెక్స్ట్ సినిమా - 'అరి' దర్శకుడు జయశంకర్ ఇంటర్వ్యూ
Telangana Local Elections: కోర్టు కేసులు తేలక ముందే నామినేషన్లు - తెలంగాణ స్థానిక ఎన్నికలు చెల్లుతాయా ?
కోర్టు కేసులు తేలక ముందే నామినేషన్లు - తెలంగాణ స్థానిక ఎన్నికలు చెల్లుతాయా ?
Donald Trump:
"భారత్‌తో సున్నం పెట్టుకోవద్దు, సంబందాలు త్వరగా మెరుగుపరచుకోండి" ట్రంప్‌కు అమెరికా చట్ట సభ్యులు హెచ్చరిస్తూ లేఖ  
WhatsAppతో ధనవంతులను చేస్తుంది! ఈ 5 మార్గాల్లో ప్రతి నెలా భారీ సంపాదించొచ్చు!
WhatsAppతో ధనవంతులను చేస్తుంది! ఈ 5 మార్గాల్లో ప్రతి నెలా భారీ సంపాదించొచ్చు!
Nobel Prize winners: క్వాంటమ్ శాస్త్రవేత్తలకు నోబెల్స్ - గూగుల్‌లో పని చేసిన వారే మేధావులు - సుందర్ పిచాయ్ సంతోషం !
క్వాంటమ్ శాస్త్రవేత్తలకు నోబెల్స్ - గూగుల్‌లో పని చేసిన వారే మేధావులు - సుందర్ పిచాయ్ సంతోషం !
Embed widget