News
News
వీడియోలు ఆటలు
X

Ustaad Bhagat Singh Update : పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' - హరీష్ శంకర్ స్పీడ్ ఏంటి సామి!

Pawan Kalyan : 'గబ్బర్ సింగ్' విడుదలైన పదకొండేళ్ళకు మళ్ళీ తన అభిమాన కథనాయకుడు పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే ఛాన్స్ హరీష్ శంకర్ కు వచ్చింది. దీని కోసమే ఆయన మూడేళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నారు.

FOLLOW US: 
Share:

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) కథానాయకుడిగా, ఆయన వీరాభిమాని హరీష్ శంకర్ (Harish Shankar) తెరకెక్కించిన సినిమా 'గబ్బర్ సింగ్'. మే 11, 2012లో ఆ సినిమా విడుదలైంది. ఆ తర్వాత పదకొండేళ్ళకు అభిమాన హీరోతో సినిమా చేసే ఛాన్స్ దర్శకుడికి వచ్చింది. దీని కోసమే ఆయన మూడేళ్ళ నుంచి ఎదురు చూశారు. 

'గద్దలకొండ గణేష్' తర్వాత వేరే అవకాశాలు వచ్చినా సరే... మరో సినిమాకు 'ఎస్' చెప్పకుండా పవన్ కళ్యాణ్ కోసం దర్శకుడు హరీష్ శంకర్ వెయిట్ చేశారు. ఆ ఎదురు చూపులకు కొన్ని రోజుల క్రితం తెర పడింది. సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది. ఫస్ట్ షెడ్యూల్ అలా కంప్లీట్ చేశారో, లేదో? అప్పుడే ఎడిటింగ్ వర్క్స్ స్టార్ట్ చేశారు. హరీష్ శంకర్ స్పీడ్ ఏంటి సామి అని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. వాళ్ళకు మరో గుడ్ న్యూస్ ఏంటంటే... 'గబ్బర్ సింగ్' విడుదల తేదీకి రాబోయే స్పెషల్ గిఫ్ట్!

మే 11న 'ఉస్తాద్ భగత్ సింగ్' గ్లింప్స్!
మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh Movie)ను నిర్మిస్తున్న నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ & డైరెక్టర్ హరీష్ శంకర్ అభిమానులకు కానుక ఇవ్వబోతున్నారు. 'గబ్బర్ సింగ్' విడుదలైన మే 11న ఈ సినిమా గ్లింప్స్ విడుదల చేయాలని యూనిట్ ప్లాన్ చేసింది. పవన్ కళ్యాణ్   అభిమానులకు, ప్రేక్షకులకు సూపర్ కిక్ ఇచ్చేలా ఆ గ్లింప్స్ ఉండబోతుందని టాక్.

Also Read : సుకుమార్ దర్శకత్వంలో ప్రభాస్ - అదీ తెలంగాణ నేపథ్యంలో?

పవన్... శ్రీలీల... ఫస్ట్ షెడ్యూల్!
ఇటీవల హైదరాబాదులో 'ఉస్తాద్ భగత్ సింగ్' ఫస్ట్ షెడ్యూల్ ముగిసింది. అందులో కథానాయిక శ్రీలీల (Sreeleela) కూడా పాల్గొన్నారు. హీరో హీరోయిన్లతో కీలకమైన సన్నివేశాలతో పాటు ఓ భారీ ఫైట్ తెరకెక్కించారు. 

స్టంట్ కొరియోగ్రాఫర్లు రామ్ - లక్ష్మణ్ (Ram Laxman Masters) నేతృత్వంలో భారీ యాక్షన్ ఎపిసోడ్ తీసినట్లు 'ఉస్తాద్ భగత్ సింగ్' యూనిట్ తెలియజేసింది. వెయ్యి మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనగా... హై వోల్టేజ్ భారీ యాక్షన్ సీన్లు తీశారు. అవి సినిమాలో హైలైట్ అవుతాయట! పవన్ కళ్యాణ్ అంటే ఆయన మేనరిజమ్స్ కూడా అభిమానులకు గుర్తుకు వస్తాయి. హరీష్ శంకర్ సైతం పవర్ స్టార్ ఫ్యాన్ కావడంతో 'ఉస్తాద్ భగత్ సింగ్'లో స్పెషల్ మేనరిజమ్స్ క్రియేట్ చేశారట. అదిరిపోయే డైలాగ్స్, స్పెల్ల్ బైండింగ్ మ్యానరిజంలతో పవన్ కళ్యాణ్‌ ను విభిన్న కోణంలో చూపించి ప్రేక్షకులకు విందు అందించడం గ్యారెంటీ అని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. 

Also Read 'సేవ్ ద టైగర్స్' రివ్యూ : భార్యల నుంచి భర్తలను కాపాడుకోక తప్పదా - సిరీస్ ఎలా ఉందంటే?

'ఉస్తాద్ భగత్ సింగ్' కోసం ప్రొడక్షన్ డిజైనర్ ఆనంద్ సాయి ప్రత్యేకంగా ఓ పోలీస్ స్టేషన్ సెట్ వేశారు. అందులో కొన్ని  సీన్లు తీశారు. కొంత మంది చిన్నారులతో వినోదభరిత సన్నివేశాలు సైతం తెరకెక్కించారు. పవన్ కళ్యాణ్, శ్రీలీల మధ్య కొన్ని రొమాంటిక్ సీన్లు తీసినట్లు చిత్ర బృందం పేర్కొంది. నర్రా శ్రీను, చమ్మక్ చంద్ర, గిరి, టెంపర్ వంశీ, నవాబ్ షా, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్ వంటి పలువురు నటీనటులు ఈ షెడ్యూల్‌లో పాల్గొన్నారు. 

Published at : 27 Apr 2023 09:03 AM (IST) Tags: Harish Shankar Pawan Kalyan Ustaad Bhagat Singh movie Ustaad Bhagat Singh First Glimpse

సంబంధిత కథనాలు

Dheekshith Shetty : ధరణి ఫ్రెండ్ సూరిగాడికి తెలుగులో ఇంకో వెబ్ సిరీస్ - ఈసారి కాలేజీ పోరగాడిగా!

Dheekshith Shetty : ధరణి ఫ్రెండ్ సూరిగాడికి తెలుగులో ఇంకో వెబ్ సిరీస్ - ఈసారి కాలేజీ పోరగాడిగా!

Daggubati Abhira: టాలెంట్ లేకే ఇన్నాళ్లు సినిమాల్లోకి రాలేదు: దగ్గుబాటి అభిరామ్

Daggubati Abhira: టాలెంట్ లేకే ఇన్నాళ్లు సినిమాల్లోకి రాలేదు: దగ్గుబాటి అభిరామ్

అప్పుడేం మాట్లాడలేదు, ఇప్పుడెలా నమ్మాలి : కమల్ హాసన్‌కు సింగర్ చిన్మయి కౌంటర్

అప్పుడేం మాట్లాడలేదు, ఇప్పుడెలా నమ్మాలి : కమల్ హాసన్‌కు సింగర్ చిన్మయి కౌంటర్

SSMB28 Mass Strike : మహేష్ బాబు 'మాస్ స్ట్రైక్'కు ముహూర్తం ఫిక్స్ - ఏ టైంకు అంటే?

SSMB28 Mass Strike : మహేష్ బాబు 'మాస్ స్ట్రైక్'కు ముహూర్తం ఫిక్స్ - ఏ టైంకు అంటే?

Balakrishna IQ Trailer : బాలకృష్ణ విడుదల చేసిన 'ఐక్యూ' ట్రైలర్‌ - అసలు కాన్సెప్ట్ ఏమిటంటే?

Balakrishna IQ Trailer : బాలకృష్ణ విడుదల చేసిన 'ఐక్యూ' ట్రైలర్‌ - అసలు కాన్సెప్ట్ ఏమిటంటే?

టాప్ స్టోరీస్

BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?

BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ -   జాతీయ వ్యూహం మారిపోయిందా ?

మెగాస్టార్‌ చిరంజీవితో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భేటీ

మెగాస్టార్‌ చిరంజీవితో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భేటీ

ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు మరికొన్ని సంవత్సరాల సమయం పడుతుంది: సజ్జల

ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు మరికొన్ని సంవత్సరాల సమయం పడుతుంది: సజ్జల

Hyderabad News: హైదరాబాద్‌లోని ఓ పబ్‌ వైల్డ్ ఆలోచనపై విమర్శలు- అధికారులు, నెటిజన్లు ఆగ్రహం

Hyderabad News: హైదరాబాద్‌లోని ఓ పబ్‌ వైల్డ్ ఆలోచనపై విమర్శలు- అధికారులు, నెటిజన్లు ఆగ్రహం