Urvashi Rautela: తనకు గుడి కట్టాలన్న నటి ఊర్వశీ రౌతేలా - ఆ కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చిన టీం.. ఏం చెప్పారంటే?
Urvashi Rautela Temple Comments: ప్రముఖ బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా ఆలయం కామెంట్స్‌పై విమర్శలు రాగా.. తాజాగా ఆమె టీం క్లారిటీ ఇచ్చింది. ప్రజలు ఆమె కామెంట్స్ తప్పుగా అర్థం చేసుకున్నారని వివరించింది.

Urvashi Rautela Team Clairty On Her Temple Comments: బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా (Urvashi Rautela).. తన పేరు మీద ఓ ఆలయం ఉందంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర విమర్శలు రాగా.. ఆ కామెంట్స్‌పై తాజాగా ఆమె టీమ్ క్లారిటీ ఇచ్చింది. ప్రజలు ఆమె వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొంటూ.. ఇన్ స్టా పోస్ట్‌లో వివరణ ఇచ్చింది.
'ఊర్వశీ అలా అనలేదు'
ఆ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఊర్వశీ రౌతేలా.. తన పేరు మీద ఆలయం ఉందని చెప్పారని.. అది తన ఆలయం అని చెప్పలేదని ఆమె టీమ్ క్లారిటీ ఇచ్చింది. 'ఊర్వశీ వ్యాఖ్యలను అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. దయచేసి ఆ వీడియో మరోసారి విని అర్థం చేసుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక ఢిల్లీ యూనివర్శిటీలో నిజంగానే ఆమె ఫోటోకు దండలు వేసి పూజిస్తారు. దీనిపై గతంలోనూ కథనాలు వచ్చాయి. అవి ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. నిరాధారమైన ఆరోపణలు, అవమానకరమైన వ్యాఖ్యలు చేసే ముందు వాస్తవాలను తెలుసుకొని మాట్లాడాలి. ప్రతి ఒక్కరినీ గౌరవించాలి. వారి మాటలను సరిగ్గా అర్థం చేసుకోవాలి.' అంటూ టీం వివరణ ఇచ్చింది.
ఊర్వశీ ఏమన్నారంటే?
ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి ఊర్వశీ రౌతేలా.. ఉత్తరాఖండ్‌లో తన పేరు మీద ఓ ఆలయం ఉందని.. బద్రీనాథ్‌కు ఎవరైనా వెళ్తే పక్కన ఉన్న తన ఆలయాన్ని సందర్శించాలని చెప్పారు. ఢిల్లీ యూనివర్శిటీలోనూ తన ఫోటోకు పూలమాలలు వేసి నన్ను 'దండమమాయి' అని పిలుస్తారని.. ఈ విషయం తెలిసి తాను ఆశ్చర్యపోయినట్లు చెప్పారు. దీనిపై వార్తా కథనాలు కూడా ఉన్నాయని.. వాటిని మీరు చదవొచ్చని అన్నారు. టాలీవుడ్ టాప్ హీరోస్ చిరంజీవి, పవన్ కల్యాణ్, బాలకృష్ణలతో కలిసి నటించానని.. అక్కడ కూడా తనకు ఎంతోమంది అభిమానులు ఉన్నారని పేర్కొన్నారు. దక్షిణ భారతదేశంలో కూడా నాకు రెండో ఆలయాన్ని నిర్మించాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.
ఆ ఆలయాల అర్చకుల ఆగ్రహం
అయితే, ఊర్వశీ చేసిన వ్యాఖ్యలపై బద్రీనాథ్ సమీపంలోని ఆలయాల అర్చకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బద్రినాథ్ సమీపంలోని బామ్నిలో ఊర్వశీ పేరుతో ఆలయం ఉన్న మాట వాస్తవమేనని.. అయితే, ఆలయానికి, ఆ నటికి సంబంధం లేదని తెలిపారు. పురాణాలు, స్థానికుల విశ్వాసం ప్రకారం శ్రీమహావిష్ణువు తొడ నుంచి ఉద్భవించడం లేదా సతీదేవి శరీర భాగం పడిన ప్రదేశం ఊర్వశీ దేవి ఆలయంగా మారిందని చెబుతారని చెప్పారు. నటి ఊర్వశీ అది తన పేరు మీద ఉన్న ఆలయం అంటూ తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. 'ఇది ఆమె గుడి కాదు. ఇలాంటి కామెంట్స్ ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఆమె వ్యాఖ్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇది మత విశ్వాసాలను అగౌరవపరచడమే.' అని బ్రహ్మకపాల్ తీర్థ్ పురోహిత్ సొసైటీ అధ్యక్షుడు అమిత్ పేర్కొన్నారు.





















