Uravasi Rautela: రిషబ్ పంత్‌ని పెళ్లి చేసుకుంటారా? - ఊర్వశి రౌతేలా షాకింగ్ రిప్లై, వీడియో వైరల్
Uravasi Rautela: టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్‌తో పెళ్లిపై బాలీవుడ్ ఊర్వశి రౌతెలా షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Urvashi Rautela Comments on Marriage With Rishabh Pant: బాలీవుడ్ బ్యూటీ, ఐటెం భామ ఊర్వశి రౌతేలా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అంతేకాదు సోషల్ మీడియాలోనూ హాట్ హాట్ ఫోటోలు, ఫోజులతో సెన్సేషన్ అవుతుంది. ఇటీవల తన బర్త్‌డేకి 24 క్యారెట్ గోల్డ్ కేక్ కట్ చేసి చర్చనీయాంశమైంది ఈ భామ. అలా సినిమాలతో కంటే కూడా తన కామెంట్స్, ఫోటోలతో తరచూ వార్తల్లో నిలిచే ఊర్వశి ఆ మధ్య టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్‌తో వివాదంతో హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఇద్దరి మధ్య సోషల్ మీడియాలో నెలకొన్న కోల్ట్ గురించి తెలిసిందే. ఇన్‌డైరెక్టర్‌గా ఒకరిపై ఒకరు కౌంటర్స్ వేసుకున్నారు. అలా ట్విటర్లో వీరి ఇన్‌డైరెక్ట్ పోస్ట్స్ పెద్ద దుమారమే లేపాయి.
అంత రచ్చ తర్వాత తాజాగా ఊర్వశి రౌతేలా చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఇటీవల ఓ చానల్‌కు ఇంటర్య్వూ ఇచ్చిన ఈ హాట్ బ్యూటీకి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఇంటర్య్వూలో భాగంగా యాంకర్ ఊర్వశీని నెటిజన్లు నుంచి వచ్చిన ట్వీట్స్‌పై ప్రశ్నలు అడిగారు. ఇందులో భాగంగా ఓ ఫ్యాన్ రిషబ్‌తో గొడవ, వారిద్దరి రిలేషన్ గురించి ప్రస్తావిస్తూ అతడినిపెళ్లి చేసుకోవాల్సి వస్తే చేసుకుంటారా? అని ప్రశ్నించారు. దీనికి ఆమె స్పందిస్తూ 'నో కామెంట్స్అం' అంటూ కూల్‌గా సమధానం ఇచ్చింది. ప్రస్తుతం ఆమె రియాక్షన్ నెటిజన్స్, ఇండస్ట్రీ వర్గాలను షాక్‌కు గురి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తుంది. దీనిపై ఊర్వశీ, రిషబ్‌పై ఏ రేంజ్ లో విరుచుకుపడుందో! ఎలాంటి కామెంట్స్ చేస్తుందో అని అనుకున్నారు.
Urvashi Rautela talking about comments on marrying Rishabh Pant in a latest podcast 😵
— Riseup Pant (@riseup_pant17) May 3, 2024
Video Credits @filmygyan #ipl pic.twitter.com/1Ps5s3xvk2
కానీ అందుకు విరుద్ధంగా కూల్‌గా నో కామెంట్స్ అంటూ రియాక్ట్ అవ్వడంతో అంతా అవాక్క్ అవుతున్నారు. ఇదేంటి ఇలా స్పందించింది. అంటే రిషబ్‌ను పెళ్లి చేసుకునే అవకాశం వస్తే చేసుకునేందుకు రెడీగా ఉందా? అంటూ నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. గతంతో ఓ ఇంటర్య్వూలో తన రిలేషన్‌షిప్ గురించి ప్రశ్న ఎదురవగా.. ప్రస్తుతం సింగిల్ అని అయితే గతంలో ఓ వ్యక్తి తన కోసం ఎయిర్‌పోర్టులో గంటల తరబడి వెయిట్ చేశారని.. అతడి పేరు RP అంటూ ఇన్‌డైరెక్ట్‌గా రిషబ్ పంత్ గురించి చెప్పింది. దీనికి రిషబ్ పంత్ ఊర్వశీ పేరు ప్రస్తావించకుండ షాకింగ్ పోస్ట్ చేశాడు. కొందరు పబ్లిసిటీ కోసం ఇలా చీప్ ట్రిక్స్ వాడతారని, అలాంటి వాళ్లని చూస్తే జాలేస్తుందని మండిపడ్డాడు. ఆ తర్వాత అతడికి కౌంటర్‌గా ఊర్వశీ మరో పోస్ట్ చేయడం, దానికి రిషబ్ ఇన్‌డైరెక్ట్‌గా స్పందించడం ఇలా సోషల్ మీడియాలో ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నెలకొంది. ఇది జరిగిన కొన్ని రోజులకే రిషబ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అప్పటి వరకు రిషబ్‌ను తిట్టిపోసిన ఊర్వశీ.. సడెన్‌గా అతడు త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ పోస్ట్ చేసింది. అప్పట్లోనూ ఇది హాట్‌టాపిక్‌గా నిలిచింది. తాజాగా రిషబ్‌తో పెళ్లి ప్రశ్నపై ఎవరూ ఊహించని సమాధానం ఇచ్చి మరోసారి వార్తల్లో నిలిచింది.
Also Read: 'వార్ 2' నుంచి క్రేజీ అప్‌డేట్ - ఎన్టీఆర్ ఫస్ట్‌లుక్ వచ్చేది అప్పుడేనట!