Trisha Krishnan : రిలేషన్ షిప్ రూమర్స్ - పెంపుడు కుక్క ఫోటోకు క్యాప్షన్... త్రిష స్ట్రాంగ్ కౌంటర్
Trisha Reaction : గత కొంతకాలంగా విజయ్, త్రిష రిలేషన్ షిప్ రూమర్స్ హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై ఇండైరెక్ట్ రియాక్ట్ అయ్యారు సౌత్ క్వీన్. ఆమె ఇన్ స్టా స్టోరీ వైరల్ అవుతోంది.

Trisha Reaction About Trollings Amid Dating Rumours : తమిళనాడు ఎన్నికల నుంచీ సీఎంగా విజయ్ బాధ్యతలు చేపట్టినంత వరకూ దళపతి, త్రిష ఇద్దరూ తరచూ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారంటూ కోలీవుడ్ ఇండస్ట్రీతో పాటు రాజకీయ వర్గాల్లోనూ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఎన్నికల్లో విజయ్‌కు త్రిష సపోర్ట్ చేయడం సహా సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సౌత్ క్వీన్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఈ వీడియోలు, ఫోటోలు వైరల్‌గా మారాయి.
పెంపుడు కుక్క ఫోటోతో...
జనరల్‌గా ఇలాంటి రూమర్స్, వ్యక్తిగత విషయాలపై ఎప్పుడూ స్పందించని త్రిష (Trisha Krishnan) ఫస్ట్ టైం ఈ రూమర్స్‌పై పరోక్షంగా రియాక్ట్ అయ్యారు. తాజాగా ఆమె ఇన్ స్టా స్టోరీలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. తన పెంపుడు కుక్క ఫోటో షేర్ చేసిన త్రిష... దానికి ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ పెట్టారు. 'నా పర్సనల్ విషయాల్లో తలదూర్చడానికి దీనికి తప్ప ఎవరికీ పర్మిషన్ లేదు.' అని అర్థం వచ్చేలా రాసుకొచ్చారు.
నేరుగా ఎవరి పేరు కూడా మెన్షన్ చేయకపోయినా... తనపై ట్రోలింగ్స్, రూమర్స్ క్రియేట్ చేసే వారికి ఇండైరెక్ట్ కౌంటర్ ఇచ్చారంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక రీసెంట్‌గానే త్రిష 'మ్యాజికల్ మే' అంటూ ఫోటోస్ షేర్ చేశారు. 'నాకు ఇష్టమైన మంత్ వచ్చేసింది. ఈ ఏడాది మే నెలను తలుచుకున్నప్పుడల్లా నా ముఖంపై చిరునవ్వు వస్తూనే ఉంటుంది.' అంటూ పోస్ట్ చేశారు. ఇందులో బర్త్ డే మూమెంట్స్ సహా, సెల్ఫీలు, పెట్ డాగ్ ఫోటోస్ ఉన్నాయి.
Before You Go
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
ట్రెండింగ్ వార్తలు























