Peddi Collection : సోషల్ మీడియా ట్రెండింగ్ పెద్ది - రికార్డు స్థాయిలో టికెట్ సేల్స్... తెలంగాణలో బుకింగ్స్ ఎప్పుడంటే?
Peddi Tickets : ఏపీలో పెద్ది టికెట్ బుకింగ్స్ రికార్డు క్రియేట్ చేశాయి. రిలీజ్ చేసిన 24 గంటల్లోనే దాదాపు 80 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది.

Ram Charan's Peddi Tickets Advance Bookings Record : దేశవ్యాప్తంగా పెద్ది మేనియా స్టార్ట్ అయ్యింది. అటు సోషల్ మీడియా ఇటు బాక్సాఫీస్ వద్ద ఎక్కడ చూసిన పెద్ది పేరే వినిపిస్తోంది. ఇప్పటికే ఓవర్సీస్‌లో టికెట్ సేల్స్ రికార్డు క్రియేట్ చేయగా... ఏపీలో టికెట్ బుకింగ్స్ ట్రెండ్ అవుతున్నాయి.
గంటకు వెయ్యి టికెట్స్
ఏపీలో సోమవారం మధ్యాహ్నం టికెట్ బుకింగ్స్ ప్రారంభం కాగా... కొద్దిసేపటికే హాట్ కేకుల్లా సేల్ అయ్యాయి. కేవలం 24 గంటల్లోనే దాదాపు 80 వేలకు పైగా టికెట్స్ సేల్ అయినట్లు ఫేమస్ టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షో వెల్లడించింది. ఈ ప్లాట్ ఫామ్ గంట వారీ ట్రెండ్స్‌లో టాప్ ప్లేస్‌లో ఉంది. అటు డిస్ట్రిక్ట్ యాప్‌లోనూ టికెట్స్ సేల్ అవుతున్నాయి.
ఏపీలో బుధవారం రాత్రి 8 గంటలకు ప్రీమియర్ షోకు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వగా... రూ.600గా టికెట్ కాస్ట్ నిర్ణయించారు. అలాగే, జూన్ 4 నుంచి 10 రోజుల పాటు రోజుకు 5 షోస్ వేసుకోవచ్చు. సింగిల్ స్క్రీన్లలో రూ.100, మల్టీప్లెక్సుల్లో రూ.125 చొప్పున పెంచుకునేందుకు ప్రభుత్వం జీవో జారీ చేసింది.
Also Read : Lingam Series OTT : ఓటీటీలోకి స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ లింగం - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓవర్సీస్‌లో...
ఓవర్సీస్‌లో టికెట్ సేల్స్ ఎప్పుడో ప్రారంభం కాగా... నార్క్ అమెరికాలో $850K (దాదాపు రూ.8 కోట్లు) పైగా ప్రీ సేల్స్ అయ్యాయి. త్వరలోనే 1 మిలియన్ మార్క్ దాటేస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం థియేట్రికల్ బిజినెస్ రూ.135.25 కోట్లు జరిగింది. రిలీజ్‌కు ముందే రికార్డులు క్రియేట్ చేయగా... ప్రీమియర్స్, రిలీజ్ తర్వాత సరికొత్త రికార్డులు కన్ఫర్మ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
తెలంగాణలో బుకింగ్స్
తెలంగాణలో ప్రీమియర్ షోస్‌పై ఇంకా సస్పెన్స్ కంటిన్యూ అవుతుండగా... బుధవారం సాయంత్రం అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవుతాయని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. అయితే, టికెట్ ధరల పెంపుపై మేకర్స్ ప్రభుత్వ అధికారులను సంప్రదించినా ఎలాంటి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. దీంతో టికెట్ ధరల పెంపు లేనట్లేనని తెలుస్తోంది.
విజయవాడలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో రామ్ చరణ్, హీరోయిన్ జాన్వీ కపూర్‌లతో పాటు డైరెక్టర్ బుచ్చిబాబు మూవీ టీం పాల్గొన్నారు. జీవితంలో పెద్ది లాంటి కథ ఒకేసారి వస్తుందని... ఇది తన కెరీర్‌లోనే బెస్ట్ మూవీ అవుతుందని అన్నారు చరణ్. ఆడియన్స్ కోసం రక్తం చిందిస్తానని చెప్పారు. ఈ ఈవెంట్‌లో జాన్వీ ట్రెడిషనల్ లుక్‌తో తెలుగులో స్పీచ్ ఇచ్చారు. సంప్రదాయ చీరకట్టులో జాన్వీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.
Before You Go
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
ట్రెండింగ్ వార్తలు






















