అన్వేషించండి

Transfer Trimurthulu Teaser : కానిస్టేబుల్ త్రిమూర్తులు వెరీ స్ట్రిక్ట్ - పదేళ్ల తర్వాత హీరోగా వడ్డే నవీన్ రీఎంట్రీ

Vadde Naveen : దాదాపు పదేళ్ల తర్వాత హీరోగా రీఎంట్రీ ఇస్తున్నారు వడ్డే నవీన్. ఆయన కానిస్టేబుల్‌గా నటించిన మూవీ ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Vadde Naveen's Transfer Trimurthulu Teaser Out : అప్పట్లో పెళ్లి, బాగున్నారా, మనసిచ్చి చూడు, చాలా బాగుంది మూవీస్‌తో హీరోగా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు వడ్డే నవీన్. దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు' మూవీతో హీరోగా మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్‌గా రాబోతోన్న ఈ సినిమా టీజర్ తాజాగా రిలీజ్ చేశారు. 

టీజర్ ఎలా ఉందంటే?

డ్యూటీలో సిన్సియర్‌‌గా ఉండే కానిస్టేబుల్ స్టోరీ ఆధారంగా ఈ మూవీని రూపొందించినట్లు టీజర్‌ను బట్టి తెలుస్తోంది. ఎవరి మాట వినని ఓ రెబల్ కానిస్టేబుల్‌గా నవీన్ కనిపించారు. కానిస్టేబుల్‌కు పదేళ్లలో 55 ట్రాన్స్‌ఫర్స్ ఎందుకు వచ్చాయి? అతని కోసం పోలీసులు ఎందుకు వెతుకుతున్నారు? నేషనల్ మీడియా కూడా ఎందుకు ఫోకస్ చేసింది? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

మూవీకి కమల్ తేజ్ దర్శకత్వం వహించగా... వడ్డే నవీన్ సరసన రాశీ సింగ్ హీరోయిన్‌గా నటించారు. వీరితో పాటే శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశీ, రఘుబాబు, శివన్నారాయణ, వడ్లమాని శ్రీనివాస్, జ్వాలా కోటి, దేవి ప్రసాద్, సూర్య, బాబా బాస్కర్, ప్రమోదిని, సాథ్విక్ రాజు, అంజలి ప్రియ, గాయత్రి చాగంటి తదితరులు కీలకపాత్రలు పోషించారు. వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్‌పై వడ్డే నవీన్ నిర్మించారు.

Also Read : కాలేజీ కట్టి 25 పర్సెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ - తండ్రిపై మంచు మనోజ్ సెటైర్!

'స్క్రిప్ట్‌పై ఏడాది వర్క్ చేశాం'

తన తండ్రి చనిపోయిన తర్వాత తాను నటిస్తున్న, నిర్మిస్తున్న ఫస్ట్ మూవీ ఇదేనని చెప్పారు నవీన్. 'నేను ఎక్కువగా బయట కనిపించకపోయినా మీడియా, అభిమానులు ఎప్పుడూ గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. అందుకు థాంక్స్. నా వద్దకు వచ్చిన కథలు నచ్చలేదు, నచ్చిన కథలు నా వద్దకు రాలేదు. త్రిమూర్తులు పాత్ర గురించి మాత్రమే కమల్ చెప్పాడు. ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ అనే టైటిల్ కూడా చెప్పాడు.

అయితే కథ, స్క్రిప్ట్ మీద ఏడాది పాటు ఇద్దరం వర్క్ చేశాం. కథ మొత్తం రెడీ అయ్యాక షూటింగ్‌కి వెళ్లాం. హై క్వాలిటీ స్టాండర్డ్‌లో ఉంటుంది. కంటెంట్ కూడా కొత్తగా ఉంటుంది. అందరం కలిసి ఓ ఫ్యామిలీలా ఈ మూవీ కోసం పని చేశాం. మా చిత్రం అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా.' అని అన్నారు. వడ్డే నవీన్ కమ్ బ్యాక్ చాలా గట్టిగా ఉంటుందని చెప్పారు హీరోయిన్ రాశీ సింగ్. సినిమాలో లక్ష్మి అనే మంచి పాత్రను ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్ చెప్పారు. 

తన డెబ్యూ మూవీ ఇంత గొప్పగా ఉంటుందని అనుకోలేదని చెప్పారు డైరెక్టర్ కమల్ తేజ. 'వడ్డే నవీన్ గారి ఫ్యాన్స్ అందరూ కోరుకున్నట్టుగా ఆయన రీ ఎంట్రీ, కమ్ బ్యాక్ ఉంటుంది. జూన్ 19న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.' అని అన్నారు.

Also Read : ఫ్లాప్ టాక్‌తో 'దృశ్యం 3'కి భారీ ఓపెనింగ్... మోహన్ లాల్ స్టార్ పవర్ మహిమ?

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ తర్వాత ఫస్ట్ ఫోటో... హాస్పిటల్ బెడ్‌పై నుంచి
రామ్ చరణ్ సర్జరీ తర్వాత ఫస్ట్ ఫోటో... హాస్పిటల్ బెడ్‌పై నుంచి
Allu Arjun Fans Meet 2026: నచ్చకపోతే పట్టించుకోవద్దు - ఫ్యాన్స్‌కు అల్లు అర్జున్ ఇచ్చిన సలహా వెనుక అసలు కారణం ఇదే !
నచ్చకపోతే పట్టించుకోవద్దు - ఫ్యాన్స్‌కు అల్లు అర్జున్ ఇచ్చిన సలహా వెనుక అసలు కారణం ఇదే !
Allu Arjun: వదిలేయండి బ్రదర్... ట్రోల్స్‌పై అభిమానుల సమావేశంలో అల్లు అర్జున్
వదిలేయండి బ్రదర్... ట్రోల్స్‌పై అభిమానుల సమావేశంలో అల్లు అర్జున్
Rao Bahadur OTT: రావు బహదూర్ ఓటీటీ రిలీజ్... నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?
రావు బహదూర్ ఓటీటీ రిలీజ్... నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?
Advertisement

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget