అన్వేషించండి

Allu Arjun Fans Meet 2026: నచ్చకపోతే పట్టించుకోవద్దు - ఫ్యాన్స్‌కు అల్లు అర్జున్ ఇచ్చిన సలహా వెనుక అసలు కారణం ఇదే !

Allu Arjun Trolls Statement: ట్రోల్స్‌పై డబ్బు, ఎనర్జీ వేస్ట్ చేయకండి అంటూ అల్లు అర్జున్ అభిమానులకు చేసిన సూచన వైరల్‌గా మారింది. ఇటీవలి కాలంలో ఆయన చుట్టూ రాజకీయ ప్రచారం జరుగుతోంది. కౌంటర్ ఇచ్చారా?

Tollywood Political PR Wars:   "నీకు ఎవరైనా నచ్చకపోతే వదిలేయండి, అంతేకానీ వాళ్లను హేట్ చేయడం లేదా ట్రోల్ చేయడం సరికాదు. మనకు నచ్చని వారి కోసం మన డబ్బును, ఎనర్జీని ఎందుకు ఖర్చు పెట్టాలి?" అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మీట్‌లో  సందేశం ఇచ్చారు.  గత కొంతకాలంగా అల్లు అర్జున్ చుట్టూ తిరుగుతున్న రాజకీయ వివాదాలు, ఆయనను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కారణంగా  . ఈ వ్యాఖ్యలు కేవలం సామాన్య నెటిజన్లకు మాత్రమే కాకుండా, తెరవెనుక నడుస్తున్న డిజిటల్ రాజకీయంపై వేసిన నేరుగా చేసిన కామెంట్స్ గానే చూడవచ్చు. 

ఇతరులను ట్రోల్ చేసి సమయం వృధా చేసుకోవద్దని సలహా
 
నేడు సోషల్ మీడియాలో జరుగుతున్న సైబర్ దాడి లేదా ట్రోలింగ్ అనేది కేవలం వ్యక్తిగత ద్వేషంతో అప్పటికప్పుడు పుట్టుకొచ్చేది కాదు. రాజకీయ పార్టీలు, హీరోలు, వాటి అనుబంధ డిజిటల్ పిఆర్   ఏజెన్సీలు కోట్ల రూపాయలు ఖర్చు చేసి నడిపిస్తున్న ఒక పెద్ద వ్యూహాత్మక నెట్‌వర్క్ అన్న విమర్శలు ఉన్నాయి.  గత ఎన్నికల సమయం నుండి ఆంధ్రప్రదేశ్‌లో వ్యతిరేకులను మానసికంగా దెబ్బతీయడానికి  ట్రోల్ సైన్యాలను రంగంలోకి దించారు. మనకు నచ్చని వారి కోసం డబ్బు, ఎనర్జీ ఎందుకు ఖర్చు పెట్టడం  అని బన్నీ అనడం వెనుక.. రాజకీయ ప్రయోజనాల కోసం తనను టార్గెట్ చేస్తూ పెయిడ్ క్యాంపెయిన్లు నడుపుతున్న ఏజెన్సీలను, వాటికి నిధులు సమకూరుస్తున్న రాజకీయ శక్తులను ఎండగట్టే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోందని అనుకోవచ్చు. 
 
గత ఎన్నికలకు ముందు మిత్రుడి ఇంటికి వెళ్లినప్పటి నుండి ట్రోల్స్

అల్లు అర్జున్ తన వ్యక్తిగత నిర్ణయాల్లో సాంప్రదాయ  మెగా  చట్రాన్ని దాటి సొంత గుర్తింపును చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన వ్యక్తిగత స్నేహాలకు విలువ ఇస్తారు. గతంలో వైసీపీ నేత నంద్యాల నుంచి పోటీ చేస్తూంటే ఆయన తన మిత్రుడుకాబట్టి ఆయన ఇంటికి వెళ్లారు. అది వివాదాస్పదం అయిది.  త ఎన్నికల సమయంలో నంద్యాలలో తన స్నేహితుడికి మద్దతుగా వెళ్లిన ఉదంతం నుండి, తదనంతర పరిణామాల వరకు.. ఆయనను పొలిటికల్ రీజన్స్‌తో దెబ్బతీయడానికి  సోషల్మీడియాలో ప్రయత్నాలు జరిగాయి. సినిమా రంగాన్ని, రాజకీయ ప్రయోజనాలను ముడిపెట్టి, డిజిటల్ వేదికలపై  అల్లు అర్జున్ వ్యక్తిత్వ హననం చేయడానికి ప్రయత్నించిన రాజకీయ వర్గాలకు తన సైలెంట్ కౌంటర్ ద్వారా అల్లు అర్జున్ గట్టి సందేశాన్ని పంపారని అంటున్నారు. 

ఎనర్జీని కుటుంబం కోసం వెచ్చించాలని అల్లు అర్జున్ సలహా

సాధారణంగా ఫ్యాన్ వార్స్ లేదా పొలిటికల్ క్యాంపెయిన్లలో నష్టపోయేది నిరుద్యోగులైన యువత ,  అభిమానులే. పొలిటికల్ పార్టీలు తమ ప్రయోజనాల కోసం యువతలోని ఆవేశాన్ని వాడుకుంటూ, వారి సమయాన్ని, శక్తిని ద్వేషాన్ని పెంచడానికి ఉపయోగిస్తున్నాయి.  మనకున్న 100 శాతం ఛార్జింగ్‌ను మన ఎదుగుదల కోసం వాడుకుందాం  అని తన అభిమానులకు అర్జున్ చెప్పిన మాటలు..  ప్రచారాల వలలో చిక్కుకుని విలువైన సమయాన్ని పాడుచేసుకుంటున్న యువతకు ఒక హెచ్చరిక లాంటివి. రాజకీయ నాయకుల లేదా పార్టీల ప్రాపగండాకు బలై, సోషల్ మీడియాలో ద్వేషాన్ని వ్యాప్తి చేయవద్దని ఆయన చేసిన విజ్ఞప్తి ఒక   అవసరాన్ని ఎత్తిచూపుతోంది.
 
మొత్తంగా చూస్తే, అల్లు అర్జున్ చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం  ఫ్యాన్స్ మీట్ లో చెప్పిన పంచ్ డైలాగ్ మాత్రమే కాదు; అది నేటి సోషల్ మీడియా పొలిటికల్ కల్చర్ పై చేసిన తీవ్రమైన వ్యాఖ్య. డిజిటల్ మీడియాను వేదికగా చేసుకుని వ్యక్తిత్వ హననానికి పాల్పడే పొలిటికల్ ప్లాట్‌ఫామ్‌లకు, పిఆర్ నెట్‌వర్క్‌లకు ప్రజాదరణ పొందిన ఒక స్టార్ ఇచ్చిన బలమైన  పరోక్ష సమాధానం ఇది. అనుకోవచ్చు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ajay Arasada: పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
Shravan Reddy: శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Bigg Boss Winner Wedding: తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget