అన్వేషించండి

Allu Arjun: బసిల్ జోసెఫ్‌తో అల్లు అర్జున్ సినిమా కన్ఫర్మ్... హింట్ ఇచ్చిన దర్శకుడు

Allu Arjun Basil Joseph Movie: మలయాళ కథానాయకుడు, దర్శకుడు బసిల్ జోసెఫ్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ సినిమా చేయనున్నారు. ఆ వార్తను దర్శకుడు కన్ఫర్మ్ చేశారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అల్లు అర్జున్‌తో సినిమాపై దర్శకుడు బసిల్ జోసెఫ్ హింట్ ఇచ్చారు.
  • “ఐకాన్” క్యాప్ షేర్ చేస్తూ, అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.
  • బన్నీ 25వ చిత్రంగా తెరకెక్కే అవకాశముంది, ‘శక్తిమాన్’ కాదని స్పష్టం.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), మాలయాళ దర్శకుడు బసిల్ జోసెఫ్ (Basil Joseph) కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోంది. ఆ వార్తలు ఇటు టాలీవుడ్, అటు మాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలలో ఎప్పట్నుంచో పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఆ మధ్య జరిగిన అల్లు శిరీష్ పెళ్ళిలో బసిల్ జోసెఫ్ కనిపించడం వెనుక కారణం కూడా అదేనని తెలిసింది. అయితే... ఈ సినిమాను దర్శకుడు కన్ఫర్మ్ చేశారు. ఓ హింట్ ఇచ్చారు. 

ఇన్‌స్టాలో 'ఐకాన్' క్యాప్ షేర్ చేసిన బసిల్!
బసిల్ జోసెఫ్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఓ ఫోటో షేర్ చేశారు. అందులో ఓ క్యాప్ ఉంది. ఆ క్యాప్ మీద 'Icon' అని ఉంది. ఆ ఫోటోను ఆయన ఇన్‌స్టా స్టోరీలో కూడా షేర్ చేశారు. దాంతో అల్లు అర్జున్‌తో చేయబోయే సినిమా గురించి ఇన్ డైరెక్ట్ హింట్ ఇచ్చారని అర్థం అవుతోంది. 

ఇప్పటి వరకు ఇటు అల్లు అర్జున్ గానీ, అటు బసిల్ జోసెఫ్ గానీ తామిద్దరం కలిసి సినిమా చేస్తున్నామని అనౌన్స్ చేయలేదు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే... గత కొన్నాళ్లుగా దర్శకుడు, హీరో మధ్య చర్చలు అయితే జరుగుతున్నాయని తెలిసింది.

Also ReadNTR Office Statement On Ooru Vaada Political Entry - 'ఉరూ వాడ'తో పొలిటికల్ ఎంట్రీ, ఫేక్ వార్తలకు చెక్ పెట్టిన ఎన్టీఆర్ టీమ్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Basil ⚡Joseph (@ibasiljoseph)

బన్నీతో చేయబోయేది 'శక్తిమాన్' కాదు - బసిల్!
టోవినో థామస్ హీరోగా బసిల్ జోసెఫ్ దర్శకత్వం వహించిన సూపర్ హీరో సినిమా 'మిన్నల్ మురళి'కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆ తర్వాత ఆయన మరో సూపర్ హీరో కథ 'శక్తిమాన్' రెడీ చేశారు. బన్నీతో ఆ సినిమా చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే... అది కాదని బసిల్ జోసెఫ్ స్పష్టం చేశారు. కథ గురించి కాస్త కూడా క్లారిటీ ఇవ్వలేదు. అల్లు కుటుంబానికి చెందిన గీతా ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమా నిర్మించే అవకాశం ఉందని సమాచారం.

Also ReadJr NTR Political Buzz - ఎన్టీఆర్‌కు సంబంధం లేదు - 'ఊరూ వాడ' వెనుక ఫుల్ కహానీ

ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో కథానాయకుడిగా నటిస్తున్న 'రాకా' (Raaka) సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్. ఆ తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. ఆ కమిట్‌మెంట్లను పూర్తి చేసిన తర్వాత బసిల్ జోసెఫ్ సినిమా పట్టాలు ఎక్కే అవకాశం ఉంది. అట్లీతో చేస్తున్నది అల్లు అర్జున్ 22వ సినిమా. అప్పుడు లోకేష్ కనగరాజ్ మూవీ 23 అవుతుంది. బసిల్ జోసెఫ్ సినిమాను తన 25వ సినిమా చేయాలని బన్నీ భావిస్తున్నారట. మధ్యలో ఎవరితో సినిమా చేస్తారో చూడాలి.

Also ReadShruti Haasan New Chennai Home - శృతి హాసన్ ఫ్యామిలీ ఎక్కడ... చెన్నై గృహ ప్రవేశంలో ఎవరూ లేరేందుకు?

Frequently Asked Questions

అల్లు అర్జున్, బసిల్ జోసెఫ్ సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చిందా?

లేదు, అధికారిక ప్రకటన రాలేదు. అయితే, బసిల్ జోసెఫ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో 'Icon' క్యాప్‌తో ఫోటో షేర్ చేసి పరోక్షంగా హింట్ ఇచ్చారు.

అల్లు అర్జున్, బసిల్ జోసెఫ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా 'శక్తిమాన్' కథాంశంతోనా?

కాదు, బసిల్ జోసెఫ్ స్వయంగా ఇది 'శక్తిమాన్' కాదని స్పష్టం చేశారు. కథ గురించి మాత్రం ఆయన ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

బసిల్ జోసెఫ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా ఎప్పుడు మొదలవుతుంది?

అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ, లోకేష్ కనగరాజ్ సినిమాలను పూర్తి చేసిన తర్వాత బసిల్ జోసెఫ్ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. ఇది బన్నీకి 25వ సినిమా కావాలని ఆయన భావిస్తున్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Brahmanandam Brother Sri Vadan: అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
Bigg Boss Agnipariksha 2: 'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget