అన్వేషించండి

NTR Office Statement: ఎన్టీఆర్ పేరుతో కార్యక్రమాలు చేసే అధికారం Raw NTR 'సంస్థకు లేదు - అఫీషియల్ స్టేట్మెంట్

NTR Office On Raw NTR: ఎన్టీఆర్ పేరుతో కార్యక్రమాలు చేసే అధికారం 'రా ఎన్టీఆర్' సంస్థకు లేదని ఆయన ఆఫీసు నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. గత రెండు మూడు రోజులుగా జరుగుతున్న ఊహాగానాలకు చెక్ పెట్టింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • భవిష్యత్ కార్యక్రమాలు, ప్రకటనలు ఎన్టీఆర్ బృందం ద్వారానే వస్తాయని వెల్లడించింది.

RAW NTR పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓ సంస్థ, ఎన్టీఆర్ (Nandamuri Taraka Rama Rao Jr)తో సంబంధం ఉన్నట్టుగా ప్రజల్లో భావన కలిగించే విధంగా వ్యవహరిస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని ఎన్టీఆర్ ఆఫీసు పేర్కొంది. ఆ సంస్థకు, ఎన్టీఆర్‌కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.

'రా ఎన్టీఆర్' సంస్థ వల్ల రాజకీయ చర్చ
'ఊరూ వాడ' (Ooru Vaada Campaign) పేరుతో వంద కోట్ల రూపాయలతో సేవా యజ్ఞం మొదలు పెడుతున్నామని 'రా ఎన్టీఆర్' సంస్థ పేర్కొంది. దాని వెనుక ఎన్టీఆర్ ఉన్నారని భావన ప్రజల్లో కలిగేలా వ్యవహరించింది. దాంతో రాజకీయ రంగ ప్రవేశం కోసం ఎన్టీఆర్ ఆ సంస్థను తెరపైకి తీసుకు వచ్చారని పలువురు భావించారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఆఫీసు ఓ ప్రకటన విడుదల చేసింది.

Also Read: Jr NTR Political Buzz - ఎన్టీఆర్‌కు సంబంధం లేదు - 'ఊరూ వాడ' వెనుక ఫుల్ కహానీ

''ఎన్టీఆర్ గారికి గానీ, ఆయన కార్యాలయానికి గానీ, RAW NTR అనే సంస్థతో లేదా ఆ సంస్థ తలపెట్టిన కార్యకలాపాలతో ఎలాంటి సంబంధం, అనుబంధం, అనుమతి లేదా ప్రమేయం లేదు. ఆ సంస్థకు ఎన్టీఆర్ గారి తరఫున ప్రాతినిధ్యం వహించే హక్కు లేదు. అలాగే, ఆయన పేరుతో ఎలాంటి ప్రకటనలు చేయడానికి లేదా కార్యక్రమాలు నిర్వహించడానికి ఎలాంటి అధికారమూ లేదు'' అని ఎన్టీఆర్ ఆఫీసు స్పష్టం చేసింది. దీంతో ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశానికి సంబంధించిన ఊహాగానాలకు చెక్ పెట్టింది ఎన్టీఆర్ ఆఫీసు.

Also Read: Shruti Haasan New Chennai Home - శృతి హాసన్ ఫ్యామిలీ ఎక్కడ... చెన్నై గృహ ప్రవేశంలో ఎవరూ లేరేందుకు?

''ఎన్టీఆర్ గారికి సంబంధించిన ఏదైనా సేవా కార్యక్రమం లేదా ప్రజా సంక్షేమ కార్యక్రమం లేదా అధికారిక ప్రకటన లేదా ఇతర కార్యకలాపాల సమాచారం ఎన్టీఆర్ లేదా ఆయన అధికారిక బృందం మాత్రమే వెల్లడిస్తుంది'' అని ఎన్టీఆర్ ఆఫీసు తెలిపింది. అనధికారిక వ్యక్తులు లేదా సంస్థలు చేసే ప్రచారాన్ని పరిగణలోకి తీసుకోవద్దని విజ్ఞప్తి చేసింది. ఈ అంశం (రా ఎన్టీఆర్ లేదా ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం)పై ఇదే తమ తరఫున తుది వివరణ అని ఎన్టీఆర్ ఆఫీసు స్పష్టం చేసింది. ఈ విషయానికి సంబంధించిన అన్ని అపోహలు, వదంతులు, ఊహాగానాలకు పూర్తిగా ముగింపు పడుతుందని ఆశిస్తున్నట్టు పేర్కొంది. అన్ అఫీషియల్ న్యూస్ స్ప్రెడ్ చేయవద్దని కోరింది.

Also ReadKorean Kanakaraju Teaser Review - కొరియన్ కనకరాజు టీజర్ రివ్యూ: కొరియా దెయ్యం పెనుకొండకు వస్తే? సత్యతో వరుణ్ కామెడీ కుమ్మిందిగా

Frequently Asked Questions

ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం గురించి ఈ ప్రకటన ఏం చెబుతుంది?

ఈ ప్రకటనతో ఎన్టీఆర్ కార్యాలయం ఆయన రాజకీయ ప్రవేశానికి సంబంధించిన ఊహాగానాలకు చెక్ పెట్టింది. ఇది ఈ అంశంపై తమ తుది వివరణ అని స్పష్టం చేసింది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ajith Kumar Shankar : అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
Kiran Abbavaram : ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Advertisement

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Embed widget