'సలార్' అరుదైన రికార్డ్, 'కలర్స్' స్వాతి విడాకులు - ఇంకా నేటి సినీ విశేషాలు
Tollywood Movie Updates In Telugu : ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
'సలార్' ఖాతాలో మరో రికార్డ్ - తొలి భారతీయ చిత్రంగా అరుదైన ఘనత!
పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ప్రభాస్ నుంచి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'సలార్'. 'కేజిఎఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ పై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ సోషల్ మీడియాలో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. యూట్యూబ్ లో సుమారు 100 మిలియన్లకి పైగా వ్యూస్ ని సొంతం చేసుకున్న ఈ టీజర్ తో సినిమాపై క్యూరియాసిటీ నెక్స్ట్ లెవెల్ కి చేరుకుంది. ఇలాంటి తరుణంలో 'సలార్' ఇప్పుడు మరో సంచలన రికార్డు క్రియేట్ చేసింది. తాజాగా నార్త్ అమెరికాలో ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమాకు సాధ్యం కానీ రికార్డ్ ప్రభాస్ 'సలార్' సినిమాకి సొంతమైంది (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి).
మాల్దీవుల్లో రజినీకాంత్ - బిచ్‌లో ఎంజాయ్ చేస్తున్న తలైవా, ఫొటో వైరల్!
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ త్వరలోనే 'జైలర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి తాజాగా రెండవ పాటను విడుదల చేశారు మేకర్స్. 'హుకుమ్' అంటూ సాగే ఈ పాటతో ఓ వైపు రజినీకాంత్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటూ ఉండగా.. మరోవైపు అదే సమయంలో సూపర్ స్టార్ రజినీకాంత్ మాల్దీవ్స్ లోని ఓ బీచ్ ఒడ్డున నడుచుకుంటూ వెళ్తున్న ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా అంతటా తెగ వైరల్ అవుతుంది. గత కొన్ని నెలలుగా 'జైలర్', :లాల్ సలామ్' సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్న రజనీకాంత్.. రీసెంట్ గానే ఈ రెండు సినిమాల షూట్స్ పూర్తిచేసి చిల్ అవ్వడానికి మాల్దీవ్స్ కి పయనమయ్యారు. ఇటీవలే తన కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న 'లాల్ సలామ్' సినిమా షూటింగ్ పూర్తి చేశారు (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి).
సమంత, నిహారిక బాటలో కలర్స్ స్వాతి? మళ్లీ తెరపైకి విడాకుల వ్యవహారం?
సినిమా ఇండస్ట్రీలో సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాలపై రోజుకోరకం పుకార్లు వస్తూనే ఉంటాయి. అయితే వాటిల్లో కొన్ని నిజం కూడా అవుతుంటాయి. మరికొన్ని ఫేక్ వార్తలుగా మిగులుతుంటాయి. తాజాగా నటి కలర్స్ స్వాతికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆమె త్వరలో విడాకులు తీసుకోబోతుంది అనేది ఆ వార్తలోని సారాంశం. గతంలో కూడా ఇలాగే స్వాతి విడాకులు తీసుకోబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. దానికి స్వాతి వివరణ కూడా ఇచ్చింది. మళ్లీ ఇప్పుడు ఆమె తన భర్తతో విడాకులు తీసుకుంటుంది అని వార్తలు రావడంతో నెట్టింట దీనిపై చర్చ మొదలైంది (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి).
ఇలియానా ప్రియుడు, ఆ బాలీవుడ్ హీరోయిన్ తమ్ముడా?
ఇలియానా.. ఒకప్పుడు కుర్రకారును ఉర్రూతలూగించిన పేరు అది. ఈ పేరు తెలియని తెలుగు సినిమా ప్రేక్షకుడు ఉండకపోవచ్చు. అంతలా తన అందం, అభినయంతో కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకుందీ బ్యూటీ. ఇలియానా గత కొన్నేళ్లుగా ఓ వ్యక్తితో డేటింగ్ చేస్తోంది. ఇటీవలే ఆమె గర్భవతి కూడా అయింది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన బేబీ బంప్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. అయితే ఇప్పటి వరకూ తన బాయ్ ఫ్రెండ్ ఎవరి అనేది వెల్లడించలేదు. తాజాగా తన ప్రియుడి ఫోటోలను రివీల్ చేసింది. ‘డేట్ నైట్ విత్ లవ్’ అంటూ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తన ప్రియుడ్ని పరిచయం చేసిందీ గోవా బ్యూటీ. ఇప్పుడీ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి).
ప్రేమలో జాన్వీ కపూర్? ఏకంగా అతడిని అన్న ఇంటికే తీసుకెళ్లింది!
అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది అందాల తార జాన్వీ కపూర్. బాలీవుడ్ లో పలు సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ ఫర్వాలేదు అనిపించింది. రీసెంట్ గా తెలుగులోనూ ఓ సినిమా చేస్తోంది. ఎన్టీఆర్ తో కలిసి ‘దేవర’ అనే సినిమా చేస్తోంది. అయితే, ఈ ముద్దుగుమ్మ శిఖర్ పహారియాతో ప్రేమాయణం నడుపుతున్నట్లు కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆ వార్తలు నిజమేనని తేలిపోయింది. ఏకంగా శిఖర్ ను తన అన్న అర్జున్ కపూర్ ఇంటికే తీసుకెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచింది (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి).
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial