అన్వేషించండి

Rajinikanth: మాల్దీవుల్లో రజినీకాంత్ - బిచ్‌లో ఎంజాయ్ చేస్తున్న తలైవా, ఫొటో వైరల్!

'జైలర్' షూటింగ్ పూర్తి చేసిన రజినీకాంత్ ప్రస్తుతం మాల్దీవ్స్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసింది. తాజాగా ఆయన మాల్దీవ్స్ లోని ఓ బీచ్ లో నడుచుకుంటూ వెళ్తున్న ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది.

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ త్వరలోనే 'జైలర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి తాజాగా రెండవ పాటను విడుదల చేశారు మేకర్స్. 'హుకుమ్' అంటూ సాగే ఈ పాటతో ఓ వైపు రజినీకాంత్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటూ ఉండగా.. మరోవైపు అదే సమయంలో సూపర్ స్టార్ రజినీకాంత్ మాల్దీవ్స్ లోని ఓ బీచ్ ఒడ్డున నడుచుకుంటూ వెళ్తున్న ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా అంతటా తెగ వైరల్ అవుతుంది. గత కొన్ని నెలలుగా 'జైలర్', :లాల్ సలామ్' సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్న రజనీకాంత్.. రీసెంట్ గానే ఈ రెండు సినిమాల షూట్స్ పూర్తిచేసి చిల్ అవ్వడానికి మాల్దీవ్స్ కి పయనమయ్యారు. ఇటీవలే తన కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న 'లాల్ సలామ్' సినిమా షూటింగ్ పూర్తి చేశారు.

ఈ క్రమంలోనే గతవారం ఆయన విశ్రాంతి కోసం మాల్దీవ్స్ కి బయలుదేరారు. ఫ్లైట్ ఎక్కే సమయంలో రజినీకాంత్ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ప్రస్తుతం మాల్దీవ్స్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న రజినీకాంత్ కి సంబంధించి ఓ ఫోటో బయటకు వచ్చింది. మాల్దీవ్స్ లోని ఓ బీచ్ లో రెడ్ టీ షర్ట్, బ్లూ షార్ట్స్ ధరించి నడుచుకుంటూ వస్తున్న రజనీకాంత్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీంతో ఈ ఫోటో కింద నెటిజన్స్, ఫ్యాన్స్ తెగ కామెంట్స్ చేస్తూ ఈ ఫోటోను నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇందులో రజనీకాంత్ ఓ సాధారణ వ్యక్తి లాగా సింపుల్ లుక్ తో ఆకట్టుకుంటున్నారు. దీంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని ఈ ఫోటో తెగ ఆకట్టుకుంటుంది.

కాగా రజనీకాంత్ తాజాగా నటించిన 'జైలర్' సినిమా ఆగస్టు 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రజనీకాంత్ సరసన తమన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ అగ్ర నటుడు మోహన్లాల్, కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గెస్ట్ రోల్స్ చేస్తున్నారు. అలాగే సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ, జాకీ ష్రాఫ్, వినాయకన్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ 'కావాలయ్యా' యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

ఇప్పటికే ఈ పాట 40 మిలియన్లకు పైగా వ్యూస్ అందుకొని దూసుకుపోతోంది. స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నేతృత్వంలో తమన్నా, రజినీకాంత్ ఈ పాటలో తమదైన డాన్స్ స్టెప్స్ తో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా తమన్నా ఈ పాటలో డాన్స్ ఇరగదీసింది. దాంతో ఈ పాట ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. కాగా ఈ పాటకు సంబంధించి ఇంకా తెలుగు వర్షన్ ని రిలీజ్ చేయాల్సి ఉంది. ఇక 'జైలర్' సినిమా అనంతరం తన కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహించిన 'లాల్ సలామ్' అనే సినిమాలో రజనీకాంత్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ఇందులో ఆయన 'మోయిదీన్ భాయ్' అనే పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Embed widget