విజయ్ ఫ్యాన్స్‌కు ఊహించని షాకిచ్చిన శివ కార్తికేయన్!
తమిళ హీరో శివ కార్తికేయన్ నటించిన లేటెస్ట్ మూవీ 'మహావీరన్' , తలపతి విజయ్ 'వారిసు' మూవీ కలెక్షన్స్ ని బీట్ చేసింది.
కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి సక్సెస్ రేట్ తో ముందుకు వెళ్తున్నారు. ఇటీవల కాలంలో ఈ హీరో నటించిన 'డాక్టర్', 'డాన్' వంటి సినిమాలు భారీ విజయాలు అందుకున్నాయి. అంతేకాదు తమిళ బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్స్ అందుకున్న చిత్రాలుగా రికార్డు నెలకొల్పాయి. ఈ రెండు సినిమాలతో కోలీవుడ్ లో స్టార్ హీరో ఇమేజ్‌ను కైవసం చేసుకున్నాడు శివ కార్తికేయన్. ఈ సినిమాల తర్వాత నటించిన 'ప్రిన్స్' బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. టాలీవుడ్ ఇన్ డైరెక్టర్, జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. మంచి అంచనాలతో విడుదలైన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో పరాజయాన్ని అందుకుంది. శివ కార్తికేయన్ నటించిన తాజా చిత్రం 'మహావీరుడు' సూపర్ హిట్ టాక్ తో థియేటర్స్ లో సందడి చేస్తోంది.
మడోన్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శివ కార్తికేయన్ సరసన అతిథి శంకర హీరోయిన్‌గా నటించింది. జూలై 14న తమిళ, తెలుగు భాషల్లో విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే తమిళనాట రూ.50 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని దుమ్ములేపుతోంది. తాజాగా ఓవర్సీస్ లో ఈ సినిమా రెండో రోజు యూఎస్ బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ అందుకున్నట్టు తెలుస్తోంది. లేటెస్ట్ కోలీవుడ్ రిపోర్ట్స్ ప్రకారం శివ కార్తికేయన్ 'మహావీరుడు' సినిమా ఓవర్సీస్ కలెక్షన్స్ లో దళపతి విజయ్ 'వారిసు' కలెక్షన్స్ ని బీట్ చేసింది. విజయ్ నటించిన 'వారిసు' సినిమా యూఎస్ బాక్స్ ఆఫీస్ వద్ద సుమారు రూ.4 కోట్ల కలెక్షన్స్ అందుకోగా తాజాగా శివ కార్తికేయన్ మహావీరన్' అదే యూఎస్ బాక్స్ ఆఫీస్ వద్ద రెండు రోజులకు రూ.5 కోట్లు రాబట్టింది. దీంతో మహావీరన్ సినిమాతో విజయ్ ఫ్యాన్స్ కి శివ కార్తికేయన్ భారీ షాక్ ఇచ్చారు.
అటు తమిళనాట కూడా 'మహావీరన్' విజయ్ 'వారిసు' కలెక్షన్స్ ని అధిగమించింది. తమిళనాడు బాక్సాఫీస్ వద్ద విజయ్ 'వారిసు' 2వ రోజు రూ.8.75 కోట్ల కలెక్షన్స్ రాబట్టగా.. 'మహావీరన్' దాన్ని అధిగమించి 2వ రోజు తమిళ బాక్సాఫీస్ దగ్గర రూ.9.34 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాతో శివ కార్తికేయన్ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కడమే కాకుండా ఇండస్ట్రీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. అంతేకాదు తమిళంలో అజిత్, విజయ్ వంటి స్టార్ హీరోల తర్వాత భారీ ఓపెనింగ్స్ అందుకున్న హీరోగా శివ కార్తికేయన్ నిలిచారు. కాగా ఇటు తెలుగు రాష్ట్రాల్లో సైతం ఈ సినిమా డీసెంట్ కలెక్షన్స్ ని అందుకుంటుంది. విడుదలకు ముందు తెలుగులో ఈ సినిమాకి అంతగా బజ్ లేకపోయినప్పటికీ విడుదల తర్వాత మౌత్ టాక్ తో పాజిటివ్ రెస్పాన్స్ ని కనబరిచి రోజు రోజుకి కలెక్షన్స్ లో దూసుకుపోతోంది.
ఈ సినిమా మొదటి రోజు కంటే రెండో రోజు కలెక్షన్స్ ఎక్కువగా ఉండగా.. తాజాగా మూడవ రోజు మరింత ఎక్కువ వసూళ్లు రాబట్టినట్టు తెలుస్తోంది. రిలీజ్ కు ముందు మూవీ టీం తెలుగులో సాలిడ్ ప్రమోషన్స్ చేయనప్పటికీ కేవలం మౌత్ టాక్ తోనే తెలుగు రాష్ట్రాల్లో సినిమా కలెక్షన్స్ రోజు రోజుకి పెరుగుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమా తెలుగు రైట్స్ మంచి ధరకు అమ్ముడవ్వగా, ప్రస్తుతం కలెక్షన్స్ చూస్తుంటే ఈ సినిమాతో తెలుగు బయ్యర్స్ భారీ లాభాలను అందుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read : 'సామజవరగమన' ఓటీటీ స్ట్రీమింగ్ ఈ వారంలోనే!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial