'సామజవరగమన' ఓటీటీ స్ట్రీమింగ్ ఈ వారంలోనే!
రామ్ అబ్బరాజు దర్శకత్వంలో యంగ్ హీరో శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ 'సామజవరగమన' ఓటీటీ స్ట్రీమింగ్ ఈ వారంలోనే ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ 'సామజవరగమన' ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైండర్ గా రూపొందిన ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ లో ఓ చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పటికీ ఈ సినిమా ఇంకా థియేటర్స్ లో డీసెంట్ కలెక్షన్స్ తో అదరగొడుతోంది. ఇలాంటి తరుణంలో 'సామజవరగమన' ఓటీటీ రిలీజ్ ఈ వారంలో ఉంటుందా? లేదా? అనే దానిపై చిన్న కన్ఫ్యూజన్ నెలకొంది. 'సామజవరగమన' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ సంస్థ 'ఆహా' వీడియో దక్కించుకుంది. అంతేకాదు ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయిన మూడు వారాల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ చేయడానికి ఆహా, నిర్మాతలతో తో ఒప్పందం కుదుర్చుకుంది.
సాధారణంగా ఏ చిన్న సినిమా అయినా మూడువారాల థియేట్రికల్ రిలీజ్ తర్వాతే ఓటిటిలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ క్రమంలోనే ఒప్పందం ప్రకారం 'సామజవరగమన' ఈ వారంలోనే ఓటీటీ లో ప్రసారం కావలసి ఉంది. కానీ దీనిపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. అయితే ఈ సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని మేకర్స్ ఊహించలేదు. సాధారణంగా చిన్న సినిమాలకి ఓటీటీ ప్లాట్ఫామ్స్ లోనే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. చిన్న సినిమాలకు థియేటర్ బిజినెస్ కంటే ఓటీటీ బిజినెస్ ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి థియేటర్స్ లో విడుదలైన మూడు నుంచి నాలుగు వారాల తర్వాతే ఓటిటిలో రిలీజ్ చేసేలా నిర్మాతలు సదరు ఓటీటీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంటారు.
ఇప్పటికే 'సామజవరగమన' సినిమా త్వరలోనే తమ ఓటీటీ ప్లాట్ఫామ్ లో ప్రసారం కాబోతున్నట్లు 'ఆహా' వీడియో అధికారికంగా ప్రకటించింది. కానీ థియేటర్స్ లో ఇప్పటికీ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇలాంటి సమయంలో ఈ వారంలో సినిమా ఓటీటీ రిలీజ్ ఉంటుందా? లేదా? అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. మరి ఈ పరిస్థితిని మేకర్స్ ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి.కాగా ఈ విషయంలో నిర్మాతలు సదరు ఓటీటీ సంస్థతో చర్చలు జరపాల్సి ఉంది. ఒకవేళ చర్చలు కనుక విఫలమైతే ఈ వారంలోనే సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇక 'సామజవరగమన' సినిమా విషయానికొస్తే.. 'వివాహ భోజనంబు' సినిమాని డైరెక్ట్ చేసిన రామ్ అబ్బరాజు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమాలో శ్రీ విష్ణు సరసన మౌనిక రెబ్బా హీరోయిన్గా నటించగా.. సీనియర్ నరుడు నరేష్ శ్రీ విష్ణుకి తండ్రిగా కనిపించారు. సినిమాలో శ్రీవిష్ణు - నరేష్ మధ్య వచ్చే కామెడీ సీన్స్ మెయిన్ హైలెట్ గా నిలవగా.. శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్, సుదర్శన్, రాజీవ్ కనకాల ఇతర కీలక పాత్రలు పోషించారు. AK ఎంటర్టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర సమర్పణలో హాస్యా మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా నిర్మించిన ఈ సినిమా జూన్ 29 న విడుదలై బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 45 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా హీరో శ్రీవిష్ణు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
Also Read : కలిసొచ్చిన డైరెక్టర్లతో ఒకేసారి రెండు సినిమాలు - నాగ చైతన్య ఈసారైనా కమ్ బ్యాక్ ఇస్తాడా?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial