Swathi: సమంత, నిహారిక బాటలో కలర్స్ స్వాతి? మళ్లీ తెరపైకి విడాకుల వ్యవహారం?
నటి కలర్స్ స్వాతి విడాకుల వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. త్వరలోనే ఆమె విడాకులు తీసుకోబోతుంది అంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Swathi: సినిమా ఇండస్ట్రీలో సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాలపై రోజుకోరకం పుకార్లు వస్తూనే ఉంటాయి. అయితే వాటిల్లో కొన్ని నిజం కూడా అవుతుంటాయి. మరికొన్ని ఫేక్ వార్తలుగా మిగులుతుంటాయి. తాజాగా నటి కలర్స్ స్వాతికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆమె త్వరలో విడాకులు తీసుకోబోతుంది అనేది ఆ వార్తలోని సారాంశం. గతంలో కూడా ఇలాగే స్వాతి విడాకులు తీసుకోబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. దానికి స్వాతి వివరణ కూడా ఇచ్చింది. మళ్లీ ఇప్పుడు ఆమె తన భర్తతో విడాకులు తీసుకుంటుంది అని వార్తలు రావడంతో నెట్టింట దీనిపై చర్చ మొదలైంది.
ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఫోటోలు తొలగించిన స్వాతి?
‘కలర్స్’ ప్రోగ్రాంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది స్వాతి. తర్వాత అదే ప్రోగ్రామ్ ను ఇంటి పేరుగా మార్చుకుంది. ఆ క్రేజ్ తో ఆమెకు వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. తర్వాత పెళ్లి చేసుకొని సెటిల్ అయింది. అయితే ఈ మధ్య కలర్స్ స్వాతి తన భర్తతో విడాకులు తీసుకుంటుంది అనే వార్తలు జోరుగా వస్తున్నాయి. దీని వెనుక ఓ లాజిక్ ను కూడా చూపిస్తున్నారు నెటిజన్స్. స్వాతి ఇటీవల తన ఇన్స్టా అకౌంట్ నుంచి తన భర్త ఫోటోలను తొలగించేసిందని, విడాకుల దిశగా ఇది ఆమె మొదటి స్టెప్ అని కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే గతంలో సమంత, నిహారికలు కూడా ఇలాగే కొన్ని నెలల మందు సోషల్ మీడియాలో ఫోటోలను తొలగించారని, ఇప్పుడు అదే దారిలో స్వాతి కూడా వెళ్తుంది అని గుర్తు చేస్తున్నారు. వారు కూడా ఇలాగే విడాకులకు రెండు నెలల ముందు తమ భర్తలను అన్ ఫాలో చేసి విడాకుల హిట్ ఇచ్చారు. ఇప్పుడు స్వాతి కూడా అలాగే చేయడంతో నిజంగానే విడాకులు తీసుకోబోతుందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి.
గతంలోనూ ఇలాగే జరిగింది..
కలర్స్ స్వాతి సినిమాల్లో నటిస్తున్నప్పుడే వికాస్ వాసు అనే వ్యక్తి ని ప్రేమించింది. కొన్నేళ్లు రిలేషన్షిప్ లో ఉన్న ఈ జంట 2018 లో వివాహం చేసుకున్నారు. అయితే దాదాపు రెండు సంవత్సరాల క్రితం స్వాతీ విడాకులు తీసుకుంటున్నట్టు ఇదే తరహాలో పుకార్లు వచ్చాయి. అప్పుడు స్వాతి తన భర్త ఫోటోలను ఇలాగే ఇన్స్టా నుంచి తొలగించింది. అప్పట్లో దీనిపై విపరీతంగా వార్తలు వచ్చాయి. స్వాతి తన భర్తతో విడాకులు తీసుకుంటుంది అంటూ పుకార్లు షికారు చేశాయి. తర్వాత స్వాతి ఆ వార్తలపై స్పందించింది. సోషల్ మీడియాలోని తన భర్త ఫోటోలను ఆర్కైవ్స్ లో పెట్టుకున్నట్టు చెప్పింది. తాము విడిపోలేదు అని ప్రూవ్ చేసుకోడానికి తన ఫోన్ లో ఉన్న భర్త ఫోటోలను చూపించుకోవాల్సి వచ్చింది స్వాతి. మళ్లీ ఇప్పుడు స్వాతి తన భర్త ఫోటోలను తొలగించడంతో స్వాతి కూడా సమంత, నిహారిక లాగానే విడాకులకు కొన్ని నెలల ముందు ఫోటోలు డిలీట్ చేసి హింట్ ఇచ్చిందని ఈమె కూడా త్వరలో విడాకులు తీసుకుంటుందనే చర్చ నడుస్తోంది. మరి ఈ వార్తలపై స్వాతి ఎలా స్పందిస్తుందో చూడాలి.
Also Read: ‘బేబీ’ సినిమాపై మాస్ మహారాజ్ రవితేజ్ ప్రశంసలు - ఏమన్నారంటే?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial