‘మాయ మశ్చింద్ర’ ట్రైలర్ వచ్చేసింది, ‘ఈగల్’ వాలేది అప్పుడే - ఈ రోజు టాప్ 5 మూవీ న్యూస్ ఇదే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యంగా ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
మామా అల్లుళ్ళ రివేంజ్ డ్రామా - ట్రిపుల్ రోల్స్‌లో అదరగొట్టిన సుధీర్ బాబు, 'మామా మశ్చీంద్ర' ట్రైలర్ చూశారా?
టాలీవుడ్ లో మహేష్ బాబు బావగా 'SMS' సినిమాతో వెండితెరకు పరిచయమైన సుధీర్ బాబు విభిన్న తరహా కథలు ఎంచుకొని తన నటనతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ మధ్యకాలంలో వరుస అపజయాలు ఎదుర్కొంటున్నా ఈ హీరోకి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'మామా మశ్చీంద్ర'. ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా ఆకట్టుకున్న హర్షవర్ధన్ ఈ చిత్రంతో దర్శకుడిగా మారుతున్నారు. సుధీర్ బాబు సరసన ఈషా రెబ్బ, మృణాళిని రవి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకోగా కెరియర్ లో ఫస్ట్ టైం ఈ సినిమా కోసం సుధీర్ బాబు ఎంతో కష్టపడ్డాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
సంక్రాంతి బరిలో రవితేజ 'ఈగల్' - పండక్కి మొండోడు వస్తున్నాడు
మాస్ మహారాజా రవితేజ (Ravi Teja), తెలుగు చిత్రసీమలో వరుస సినిమాలు నిర్మిస్తూ అగ్ర నిర్మాణ సంస్థగా ఎదిగిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory)ది సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్! 'ధమాకా' ఈ కలయికలో వచ్చింది. ఇప్పుడు ఆ సంస్థలో రవితేజ మరో సినిమా చేస్తున్నారు. అది సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
బ్రేకింగ్ - ఆస్కార్స్‌కు మలయాళ సినిమా '2018'
ఇంతకు ముందు ఆస్కార్ మనకు అందని ద్రాక్ష. ఇప్పుడు మాత్రం కాదు. దర్శక ధీరుడు, మన జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి తీసిన 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' సినిమాలో 'నాటు నాటు...' పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో యావత్ దేశం అంతా సంబరాలు చేసుకుంది. వచ్చే ఏడాది ఆస్కార్ అవార్డుల (Oscar 2024)పై ఆసక్తి పెరిగింది. ఇండియా నుంచి ఏ సినిమాను పంపిస్తారా? అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులు ఉన్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
తలపతి ఫ్యాన్స్ కి బిగ్ షాక్ - 'లియో' ఆడియో లాంచ్ రద్దు, కారణం అదేనా?
కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'లియో'(Leo) దసరా కానుకగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా మూవీ టీం గ్రాండ్ ఫ్రీ రిలీజ్ వేడుకను ప్లాన్ చేశారు. సెప్టెంబర్ 30న చెన్నై వేదికగా ఆడియో లాంచ్ జరగాల్సి ఉంది. ఫ్యాన్స్ ఈ వేడుక కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో లియో నిర్మాతలు ఆడియో వేడుకను రద్దు చేస్తున్నామని ప్రకటించి షాక్ ఇచ్చారు. అందుకు పలు కారణాలను కూడా వివరించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
'స్కంద' కోసం రామ్ ఎన్ని కిలోల బరువు పెరిగారో తెలుసా?
క్యారెక్టర్ కోసం స్టైల్, బాడీ లాంగ్వేజ్ చేంజ్ చేసే యంగ్ హీరోల్లో ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni) ఒకరు. 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో ఉన్నట్టు ఆ తర్వాత సినిమాలో లేరు. 'స్కంద' సినిమాలో (Skanda Movie) ఉన్నట్లు ఇంతకు ముందు సినిమాలో లేరు. 'ది వారియర్'లో రామ్ రెండు లుక్కులో కనిపించారు. ఒకటి డాక్టర్ లుక్, మరొకటి పోలీస్ లుక్! ఆ రెండిటి మధ్య వేరియేషన్ చూపించారు. ఆ వెంటనే 'స్కంద'లో మరో లుక్కులో కనిపించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)