అన్వేషించండి

తలపతి ఫ్యాన్స్ కి బిగ్ షాక్ - 'లియో' ఆడియో లాంచ్ రద్దు, కారణం అదేనా?

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తలపతి విజయ్ నటిస్తున్న 'లియో' మూవీ ఆడియో లాంచ్ సెప్టెంబర్ 30న చెన్నై వేదికగా జరగాల్సి ఉంది. అయితే ఈ ఆడియో లాంచ్ ని రద్దు చేస్తున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'లియో'(Leo) దసరా కానుకగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా మూవీ టీం గ్రాండ్ ఫ్రీ రిలీజ్ వేడుకను ప్లాన్ చేశారు. సెప్టెంబర్ 30న చెన్నై వేదికగా ఆడియో లాంచ్ జరగాల్సి ఉంది. ఫ్యాన్స్ ఈ వేడుక కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో లియో నిర్మాతలు ఆడియో వేడుకను రద్దు చేస్తున్నామని ప్రకటించి షాక్ ఇచ్చారు. అందుకు పలు కారణాలను కూడా వివరించారు.

అంచనాలకు మించి అభిమానుల నుండి స్పందన రావడం, ఆడియో లాంచ్ పాసుల కోసం విపరీతమైన రిక్వెస్ట్ లు రావడంతో, భద్రత కారణాలు, ట్రాఫిక్ ఆంక్షల దృష్ట్యా లియో ఆడియో ఈవెంట్ నువ్వు రద్దు చేస్తున్నామని ఈ సందర్భంగా నిర్మాతలు వివరణ ఇచ్చారు. అయితే ఈ విషయంలో అభిమానులు మాత్రం ఈ ఈవెంట్ రద్దు చేయడం వెనుక రాజకీయ కోణం ఉందని అంటున్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ఉద్దేశపూర్వకంగానే 'లియో' ఆడియో రద్దు అయ్యేలా చేశాడని, విజయ్ సినిమాను తమిళనాడు ప్రభుత్వం తొక్కేస్తుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

గత కొన్నాళ్లుగా విజయ్ రాజకీయం చేసేందుకు పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అప్పుడప్పుడు అభిమానులతో సమావేశం అవుతున్నారు విజయ్. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ బరిలోకి దిగడం ఖాయమని చెబుతున్నారు. ఇందులో భాగంగానే 'లియో' సినిమాపై ఆంక్షలు విధించడం వెనక అసలు కారణం ఇదే అని ఫ్యాన్స్ చెబుతున్నారు. మరికొందరేమో సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కి చెందిన రెడ్ జాయింట్ సంస్థకు లియో మూవీ డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఇవ్వకపోవడంతో, అతనే ఉద్దేశపూర్వకంగా 'లియో' ఆడియో లాంచ్ లేదు రద్దు చేయించారని, ఒకవేళ లియో హక్కులను వాళ్లకే ఇచ్చి ఉంటే ఆడియో లాంచ్ కి రూట్ క్లియర్ చేసేవారని కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : 'జాతి రత్నాలు' కంటే ఒక్కసారైనా తక్కువ నవ్వితే టికెట్ డబ్బులు వాపస్ - నిర్మాత ఆఫర్

మరి వీటిల్లో ఏది వాస్తవమో తెలియదు కానీ చిత్ర నిర్మాతలు మాత్రం వేరే కారణాలతో 'లియో' ఆడియో లాంచ్ ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం దళపతి ఫ్యాన్స్ లో తీవ్ర నిరాశను నింపింది. ఇక 'లియో' విషయానికొస్తే.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో విజయ్ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. విక్రమ్ వంటి ఇండస్ట్రీ హిట్, 'మాస్టర్' తర్వాత విజయ్ - లోకేష్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విజయ్ కి తండ్రి పాత్రలో కనిపించనున్నారు. అలాగే యాక్షన్ కింగ్ అర్జున్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 19న తమిళం తో పాటు తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

Also Read : 'స్కంద' కోసం రామ్ ఎన్ని కిలోల బరువు పెరిగారో తెలుసా?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

TV Actor Arrested: మైనర్ బాలికపై వేధింపులు... పోక్సో కేసులో టీవీ యాక్టర్‌ అరెస్ట్
మైనర్ బాలికపై వేధింపులు... పోక్సో కేసులో టీవీ యాక్టర్‌ అరెస్ట్
Hrudayam Murali Review: 'హృదయం మురళి' రివ్యూ... నటుడిగా తమన్ రీ ఎంట్రీ
'హృదయం మురళి' రివ్యూ... నటుడిగా తమన్ రీ ఎంట్రీ
Nagarjuna : తిరుమల శ్రీవారిని హిట్ ఇవ్వాలని కోరా - నాగచైతన్య, అఖిల్ నాకు రెండు కళ్లు... సక్సెస్ ఈవెంట్‌లో నాగార్జున
తిరుమల శ్రీవారిని హిట్ ఇవ్వాలని కోరా - నాగచైతన్య, అఖిల్ నాకు రెండు కళ్లు... సక్సెస్ ఈవెంట్‌లో నాగార్జున
Bhagyashri Borse : ఫ్యాన్స్ సపోర్ట్ వల్లే ఇక్కడున్నా - హైదరాబాద్ నాకు కర్మభూమి... కన్నీళ్లు పెట్టుకున్న భాగ్యశ్రీ
ఫ్యాన్స్ సపోర్ట్ వల్లే ఇక్కడున్నా - హైదరాబాద్ నాకు కర్మభూమి... కన్నీళ్లు పెట్టుకున్న భాగ్యశ్రీ

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indian Tourists Boat Tragedy: వియత్నాంలో బోటు విషాదం.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Indian Tourists Boat Tragedy: వియత్నాంలో బోటు విషాదం.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
INS Mahendragiri:భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Ramayana Trailer : విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
Breaking News: వియత్నాంలో బోటు ప్రమాదం.. తెలుగు టూరిస్టులు సహా 18 మంది మృతి
వియత్నాంలో బోటు ప్రమాదం.. తెలుగు టూరిస్టులు సహా 18 మంది మృతి
Embed widget