News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

పెళ్లి పీటలేక్కతున్న టాలీవుడ్ యంగ్ హీరో!

టాలీవుడ్ యంగ్ హీరో త్రిగున్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. నివేదిత అనే అమ్మాయిని కుటుంబ సభ్యులు, పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోబోతున్నాడు. సెప్టెంబర్ 3న వీరి పెళ్లి వేడుక జరగనుంది.

FOLLOW US: 
Share:

ఈమధ్య చిత్ర పరిశ్రమలో ఉన్న యంగ్ హీరోలు తమ బ్యాచిలర్ లైఫ్ కి ఫుల్ స్టాప్ పెట్టి పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మన టాలీవుడ్ లో యంగ్ హీరో శర్వానంద్ ఇప్పటికే ఎంగేజ్మెంట్ చేసుకొని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇక రీసెంట్ గా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ భై చెప్పి ఓ ఇంటివాడు కాబోతున్నాడు. టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ని ఏడేళ్లు ప్రేమించి రీసెంట్ గానే ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. పెద్దల అంగీకారంతోనే త్వరలోనే చాలా గ్రాండ్ గా పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇక ఈ లిస్టులో మరో యంగ్ హీరో కూడా చేరిపోయాడు.

అతను మరెవరో కాదు టాలీవుడ్ లో విభిన్న తరహా సినిమాలు చేసి నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో త్రిగున్. చాలామందికి ఈ హీరో పేరు తెలియకపోవచ్చు. కానీ ఈ హీరో నటించిన సినిమాలు ప్రేక్షకులకు సుపరిచితమే. జెనీలియాతో కలిసి ఈ హీరో 'కథ' అనే సినిమాతో చిత్ర పరిశ్రమలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక తర్వాత కొన్ని సినిమాలు చేసినప్పటికీ అవి అతనికి అంతగా గుర్తింపును తేలేకపోయాయి. కానీ ఆ తర్వాత టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో సీనియర్ హీరో రాజశేఖర్ నటించిన 'గరుడవేగ' సినిమాలో కీ రోల్ ప్లే చేసి మంచి నటనను కనబరిచాడు. ఆ తర్వాత 'డియర్ మేఘ', 'డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ' వంటి సినిమాల్లో హీరోగా మెప్పించాడు.

అలాగే ఈ మధ్యకాలంలో మన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన 'కొండా' చిత్రంలో టైటిల్ రోల్ పోషించి మంచి పేరు తెచ్చుకొని తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. ఇక రీసెంట్ గా 'ప్రేమ దేశం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా థియేటర్లో అంతగా ఆకట్టుకోకపోయినా ఓటీటీలో మంచి రెస్పాన్స్ని అందుకుంది. ప్రస్తుతం ఈ హీరో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. నివేదిత అనే అమ్మాయితో పెద్దలు కుదిర్చిన వివాహాన్ని కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోబోతున్నాడు. సెప్టెంబర్ 3 ఆదివారం రోజున  త్రిగున్, నివేదితల పెళ్లి జరగనుంది. శనివారం సాయంత్రం ఫ్రీ వెడ్డింగ్ ఫంక్షన్.

ఆదివారం ఉదయం వెడ్డింగ్ వేడుక జరగనుంది. వీరి వివాహ వేడుక శ్రీ సెంటర్ మహల్ అవినాశి, తిరుపూర్ తమిళనాడులో జరుగుతుంది. ఈ పెళ్లి వేడుకకు సినీ పరిశ్రమ ప్రముఖులు, రాజకీయ నాయకులు మరియు సెలబ్రిటీలు హాజరుకానున్నట్లు సమాచారం. కాగా త్రిగున్ అసలు పేరు అరుణ్ ఆదిత్. ఇదే పేరుతో తెలుగు, తమిళ్లో హీరోగా కొన్ని సినిమాలు తీసి, ఆ తర్వాత 2022లో తన పేరును త్రిగున్ గా మార్చుకున్నాడు.

న్యూమరాలజీ ప్రకారం 'త్రిగున్' అనే అయితే బాగుంటుందనే ఉద్దేశంతోనే ఈ హీరో పేరు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం హీరోగా తెలుగుతోపాటు తమిళ్లో పలు సినిమాల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం తెలుగులో 'తాగితే తందనా' అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది. శ్రీనాథ్ బడినేని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

Also Read : మాస్ మానియా మొదలు - ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండి అదిరిపోయే అప్డేట్!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 03 Sep 2023 08:33 AM (IST) Tags: Actor Thrigun Actor Thrigun Marriage Young Hero Thrigun Young Actot Trigun Marrige

ఇవి కూడా చూడండి

'డబుల్ ఇస్మార్ట్' కి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ - మరో మాస్ ఆల్బమ్ పక్కా!

'డబుల్ ఇస్మార్ట్' కి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ - మరో మాస్ ఆల్బమ్ పక్కా!

అల్లు అయాన్ ఆవిష్కరించిన అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహం - హాజరైన కుటుంబ సభ్యులు, కనిపించని ఐకాన్ స్టార్!

అల్లు అయాన్ ఆవిష్కరించిన అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహం - హాజరైన కుటుంబ సభ్యులు, కనిపించని ఐకాన్ స్టార్!

‘ఘోస్ట్’ ట్రైలర్ రిలీజ్, ‘భగవంత్ కేసరి’ సింగిల్ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

‘ఘోస్ట్’ ట్రైలర్ రిలీజ్, ‘భగవంత్ కేసరి’ సింగిల్ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

Raveena Tandon : పిల్లల దగ్గర ఏదీ దాచను, నా ఎఫైర్స్ గురించి కూడా చెప్పేశా - రవీనా టాండన్

Raveena Tandon : పిల్లల దగ్గర ఏదీ దాచను, నా ఎఫైర్స్ గురించి కూడా చెప్పేశా - రవీనా టాండన్

Actor Nagabhushana: కన్నడ హీరో కార్ యాక్సిడెంట్ - పుట్‌పాత్ మీద భార్య మృతి, భర్త పరిస్థితి విషమం 

Actor Nagabhushana: కన్నడ హీరో కార్ యాక్సిడెంట్ - పుట్‌పాత్ మీద భార్య మృతి, భర్త పరిస్థితి విషమం 

టాప్ స్టోరీస్

Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు

Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు

PM Modi In Mahabubnagar: తెలంగాణలో పసుపు బోర్టు ఏర్పాటు చేస్తాం: ప్రధాని మోదీ కీలక ప్రకటన

PM Modi In Mahabubnagar:  తెలంగాణలో పసుపు బోర్టు ఏర్పాటు చేస్తాం: ప్రధాని మోదీ కీలక ప్రకటన

Drugs Seized: 300 కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్‌ చేసిన జమ్మూకశ్మీర్ పోలీసులు

Drugs Seized: 300 కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్‌ చేసిన జమ్మూకశ్మీర్ పోలీసులు

Lal Salaam Release : సంక్రాంతి బరిలో రజనీకాంత్ సినిమా - రేసులో 'లాల్ సలాం'

Lal Salaam Release : సంక్రాంతి బరిలో రజనీకాంత్ సినిమా - రేసులో 'లాల్ సలాం'