అన్వేషించండి

This Week Theatre Release Telugu: థియేటర్లలో ఈ వారం సందడి... పవన్ 'వకీల్ సాబ్' to నరేశ్ 'ఆ ఒక్కటీ అడక్కు', వరలక్ష్మీ 'శబరి'

Upcoming Telugu Movies In May 2024: మే మొదటి వారంలో రిలీజ్ కానున్న తెలుగు సినిమాలేవో చూడండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' నుంచి 'అల్లరి' నరేశ్ 'ఆ ఒక్కటీ అడక్కు' వరకు బోలెడు ఆప్షన్స్ ఉన్నాయి.

వేసవి తాపం మొదలైంది. బయట ఎండలు ఓ రేంజిలో వున్నాయ్. ఈ తరుణంలో సినిమా ప్రేమికులు కాసేపు థియేటర్లలో కాలక్షేపం చేయాలని కోరుకోవడం సహజం. మరి, ప్రేక్షకులకు వేసవిలో... మే మొదటి వారంలో వినోదం అందించడానికి వచ్చే సినిమాలు ఏవో ఒక్కసారి చూడండి. ఈ వారం రెండు రీ రిలీజ్ ఫిలిమ్స్, ఐదారు స్ట్రెయిట్ ఫిలిమ్స్ ఉన్నాయి.

'వకీల్ సాబ్' మళ్లీ వస్తున్నాడోచ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ న్యాయవాదిగా నటించిన సినిమా 'వకీల్ సాబ్'. బాలీవుడ్ హిట్ 'పింక్'కు తెలుగు రీమేక్ ఇది. హిందీలో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రను తెలుగులో పవన్ చేశారు. అయితే... కథ, కథనం, క్యారెక్టర్ పరంగా చాలా మార్పులు చేశారనుకోండి. అంజలి, నివేదా థామస్, అనన్యా నాగళ్ల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఏప్రిల్ 9, 2021లో విడుదలైంది. ఇప్పుడు మే 1న తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ బుక్ మై షో, పేటీఎం వంటి టికెట్ బుకింగ్ సైట్లలో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. 

పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్'తో పాటు మే 1న రీ రిలీజ్ అవుతున్న మరో సినిమా 'ప్రేమికుడు'. ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా, నగ్మా జంటగా నటించిన ఈ సినిమాను సైతం తెలుగు రాష్ట్రాల్లో మే 1న రీ రిలీజ్ చేస్తున్నారు.

'ఆ ఒక్కటీ అడక్కు'తో అల్లరోడు ఈజ్ బ్యాక్
మే మొదటి వారంలో విడుదలవుతున్న స్ట్రెయిట్ తెలుగు సినిమాల్లో ముందుగా చెప్పుకోవాల్సింది 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku 2024 Movie) గురించి! 'నాంది', 'ఉగ్రం', 'మారేడుమిల్లి ప్రజానీకం' వంటి సీరియస్ సినిమాల తర్వాత 'అల్లరి' నరేశ్ నటించిన కామెడీ ఫిల్మ్ ఇది.  మే 3న విడుదల అవుతోంది. బ్యాక్ టు హోమ్ గ్రౌండ్ అన్నట్టు అల్లరోడు ఈజ్ బ్యాక్ విత్ కామెడీ అన్నమాట. అబ్బాయిల పెళ్లి కష్టాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి.

Also Readశృతి హాసన్ మళ్లీ ఒంటరే... బాయ్‌ ఫ్రెండ్‌ తో బ్రేకప్, ఇన్‌స్టాలో అన్‌ ఫాలో!

పాన్ ఇండియా ఫిల్మ్ 'శబరి'తో వరలక్ష్మీ శరత్ కుమార్
మే 3న వస్తున్న మరో సినిమా 'శబరి'. వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా ఫిల్మ్ ఇది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. తల్లి కుమార్తెల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కింది. కుమార్తెను రక్షించుకోవడం కోసం ఓ తల్లి ఎంత దూరం వెళ్లింది? అనేది సినిమా మెయిన్ కాన్సెప్ట్. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో శశాంక్, గణేష్ వెంకట్రామన్, సునైనా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

తమన్నా, రాశీ ఖన్నా నటించిన హారర్ సినిమా 'బాక్'
మే మొదటి వారంలో ఓ హారర్ ఎంటర్‌టైనర్ కూడా థియేటర్లలోకి వస్తోంది. మే 3న 'బాక్' విడుదల కానుంది. సుందర్ సి హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన తమిళ సినిమా 'అరణ్మణై 4'కు తెలుగు డబ్బింగ్ ఇది. తమన్నా, రాశీ ఖన్నా ఈ సినిమాలో హీరోయిన్లు. శ్రీనివాస రెడ్డి, 'వెన్నెల' కిశోర్, కోవై సరళ ప్రధాన పాత్రల్లో నటించారు.

Also Read: కాజల్‌ తో నవీన్ చంద్ర లవ్లీ రొమాంటిక్ సాంగ్ - సత్యభామ సరసం చూశారా?


'ప్రసన్నవదనం'తో పాటు 'జితేందర్ రెడ్డి'!?
సుహాస్ కథానాయకుడిగా సుకుమార్ శిష్యుడు అర్జున్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ప్రసన్నవదనం'. ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా సైతం మే 3న థియేటర్లలోకి వస్తోంది. దీంతో పాటు మరో చిన్న సినిమా 'ది ఇండియన్ స్టోరీ' సైతం వస్తోంది. 'బాహుబలి'లో నటుడిగా, 'ఎవ్వరికీ చెప్పొద్దు'లో హీరోగా తనదైన నటనతో ఆకట్టుకున్న రాకేష్ వర్రె టైటిల్ రోల్ పోషించిన సినిమా 'జితేందర్ రెడ్డి'. మే 3న థియేటర్లలోకి తీసుకు రావాలని ప్లాన్ చేశారు. మరి, ఆ సినిమా ఈ వారం వస్తుందో? వాయిదా పడుతుందో? వెయిట్ అండ్ సి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget