Shruti Haasan: శృతి హాసన్ మళ్లీ ఒంటరే... బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్, ఇన్‌స్టాలో అన్‌ఫాలో!
Shruti Haasan and Santanu Hazarika broken up: శృతి హాసన్, బాయ్ ఫ్రెండ్ శాంతను హజారికా మధ్య బ్రేకప్ అయ్యిందా? సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో ఎందుకు అయ్యారు?
Are Shruti Haasan and Santanu Hazarika not dating anymore?: స్టార్ హీరోయిన్, కమల్ హాసన్ పెద్ద కుమార్తె శృతి హాసన్, డూడుల్ ఆర్టిస్ట్ అండ్ ఇల్లుస్ట్రేటర్ శాంతను హజారికా డేటింగ్ విషయం ప్రేక్షకులకు తెలుసు. లవ్, రిలేషన్షిప్‌లో ఉన్న సంగతి ఎప్పుడూ రహస్యంగా ఉంచలేదు శ్రుతి హాసన్. శాంతనుతో కలిసి దిగిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేది. కానీ, ఇప్పుడు చెయ్యడం లేదు. ఆ మాటకు వస్తే కొన్నాళ్లుగా ఆవిడ యాక్టివ్‌గా ఉన్నది లేదు. మ్యాటర్ ఏంటని ఆరా తీస్తే... బ్రేకప్ అయ్యిందనేది ముంబై మూవీ జనాల గుసగుస.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఎందుకు అన్ ఫాలో అయ్యారు?
శృతి హాసన్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ చెక్ చేస్తే... ఓ విషయం షాక్ ఇచ్చింది. ఆవిడ శాంతను హజారికాను ఫాలో అవ్వడం లేదు. అతడు కూడా ఇన్‌స్టాలో శృతిని ఫాలో అవ్వడం లేదు. ఒకరినొకరు అన్ ఫాలో అయ్యారు. అంతే కాదు... శాంతనుతో దిగిన ఫోటోలను శృతి హాసన్ డిలీట్ చేసింది.
ఇంతకు ముందు బాలీవుడ్ ఇండస్ట్రీలో జరిగిన బ్రేకప్ కహానీలు గమనిస్తే... లవ్ చేసుకునేటప్పుడు ఒకరినొకరు ఫాలో అవ్వడంతో పాటు విపరీతంగా పోస్టులు చేసే జనాలు, బ్రేకప్ అయ్యాక అన్ ఫాలో అవ్వడం కామన్ థింగ్. విడాకుల విషయం అనౌన్స్ చెయ్యడానికి ముందు నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ సైతం ఒకరినొకరు అన్ ఫాలో అయ్యారు. నాగ చైతన్యను సమంత అన్ ఫాలో అయ్యింది. అదే విధంగా ఇప్పుడు శృతి, శాంతను అన్ ఫాలో అయ్యారని ముంబై ఇండస్ట్రీ జనాలు భావిస్తున్నారు.
ఇప్పుడు వేర్వేరు ఫ్లాట్స్‌లో శృతి, శాంతను!
ఏదైనా సినిమా వేడుకలకు శృతి హాసన్ వచ్చినప్పుడు శాంతను హజారికాను కూడా తీసుకు వచ్చేది. 'హీరామండీ' ప్రీమియర్ షోకి ఆమె ఒంటరిగా వచ్చింది. ముంబై టాక్ ఏమిటంటే... శృతి, శాంతను వేరుపడి నెల అయ్యిందట. ఇప్పుడు ఇద్దరూ వేర్వేరు ఫ్లాట్స్‌లో వుంటున్నారని బాలీవుడ్ టాక్. దాంతో కొన్నాళ్లుగా సాగిన శృతి, శాంతను రొమాంటిక్ రిలేషన్షిప్ ఎండ్ అయ్యిందని, ఆ ఇద్దరి ప్రేమకథకు శుభం కార్డు పడిందని భావించాల్సి వస్తోంది. అయితే, వాళ్లిద్దరి నుంచి ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు.
Also Read: హనుమాన్ నిర్మాతతో సాయి దుర్గా తేజ్ సినిమా - బ్యాక్ డ్రాప్, రెగ్యులర్ షూట్ డీటెయిల్స్
శృతి హాసన్ (Shruti Hassan Second Break Up)కు ఇది సెకండ్ బ్రేకప్. ఇంతకు ముందు ఇటాలియన్ యాక్టర్ మైఖేల్ కోర్స్ లేతో కొన్ని నెలలు డేటింగ్ చేశాక అతడితో విడిపోయింది. ఆ తర్వాత శాంతనుతో ప్రేమలో పడింది. ఇప్పుడు ఆ ప్రేమ కథకు కూడా ఎండ్ కార్డు పడింది.
శృతి హాసన్ సినిమాల విషయానికి వస్తే... 'సలార్ 1'తో గత ఏడాది భారీ బాక్సాఫీస్ సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు 'సలార్ 2' షూటింగ్ చెయ్యడానికి ఆమె రెడీ అవుతోంది. ఇది కాకుండా అడివి శేష్ జంటగా 'డెకాయిట్' సినిమా చేస్తోంది. కన్నడ స్టార్ యశ్ 'టాక్సిక్', సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న 'కూలి' సినిమాల్లోనూ శృతి నటిస్తుందని టాక్. అయితే, అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు.
Also Read: తమన్నాకు సైబర్ సెల్ నుంచి నోటీసులు - ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు రమ్మంటూ...