Kalki2898AD : 'కల్కి 2898 AD' టీజర్ రన్ టైం లాక్ - రిలీజ్ ఎప్పుడంటే?
Kalki2898AD : ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'కల్కి 2898AD' టీజర్ రన్ టైం ని తాజాగా మూవీ టీం లాక్ చేసినట్లు తెలుస్తోంది.
'Kalki2898AD' Teaser Run Time : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'కల్కి 2898AD'. ఈ ఏడాది టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాల్లో ఇది కూడా ఒకటి. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. హాలీవుడ్ స్టాండర్డ్స్ ని మించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఈ సినిమా సంబంధించి వస్తున్న అప్డేట్స్ మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి. సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా నెట్టింట క్షణాల్లో ట్రెండ్ అవుతుంది. ఇప్పటికే 'కల్కి' నుంచి పోస్టర్స్ తో పాటు గ్లింప్స్ వీడియోని రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు టీజర్ ని రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా 'కల్కి2898AD' టీజర్ రన్ టైం ని లాక్ చేశారట మేకర్స్.
'కల్కి2898AD' టీజర్ రన్ టైం ఎంతంటే
'కల్కి' టీజర్ తోనే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో చెప్పబోతున్నారట మూవీ టీం. ఇక తాజాగా కల్కి టీజర్ రన్ టైం ని లాక్ చేసినట్లు తెలుస్తోంది. సుమారు 1 నిమిషం 23 సెకన్ల నిడివితో 'కల్కి2898AD' టీజర్ ఉండబోతుందట. నాగ్ అశ్విన్ టీజర్ ని హాలీవుడ్ రేంజ్ లో డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక టీజర్ ని మార్చి మూడో వారంలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. టీజర్ రిలీజ్ తర్వాత సినిమాపై ఉన్న హైప్ పీక్స్ కి చేరడం గ్యారెంటీ అని చెబుతున్నారు.
'కల్కి2898AD' లో భారీ తారాగణం
హాలీవుడ్ స్టాండర్డ్స్ తో గ్రాండ్ స్కేల్ లో రూపొందుతున్న ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తున్నారు. ప్రభాస్ సరసన దీపికా పదుకొణె, దిశా పటానీ హీరోయిన్స్ గా నటిస్తుండగా.. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ విలన్ రోల్ చేస్తున్నారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ మరో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. వీళ్ళతో పాటూ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నాచురల్ స్టార్ నాని, జూనియర్ ఎన్టీఆర్, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ లాంటి స్టార్స్ క్యామియో రోల్స్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు వరల్డ్ సినిమా చూడనంత గ్రాండ్‌గా 'కల్కి 2898 AD' తెరకెక్కుతుందని మేకర్స్ ఇప్పటికే రివీల్ చేశారు. కాగా సినిమాలో నటిస్తున్న ప్రధాన తారాగణంతో డైరెక్టర్ నాగ్ అశ్విన్ 'కల్కి' క్లైమాక్స్ ని ఎంతో గ్రాండ్ గా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
రిలీజ్ డేట్ పై మరోసారి క్లారిటీ
మే 9న 'కల్కీ' విడుదల కష్టమేనంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఫ్యాన్స్, ఆడియన్స్ కన్‌ఫ్యూజన్‌లో పడిపోయారు. ఈ సందర్భంగా మూవీ టీమ్ ప్రభాస్‌కు సంబంధించిన గ్లింప్స్ వదిలి రూమర్స్‌కు చెక్ పెట్టింది. కల్కీ మే 9న ఆగయా అంటూ ఒక్క పోస్ట్‌తో మూవీ వాయిదాపై క్లారిటీ ఇచ్చారు. కల్కీ మే 9న రావడం పక్కా అని ఆ రోజు థియేటర్లో టా టక్కరా టక్కరే అంటూ ఆడియన్స్‌లో మరింత జోష్ నింపింది.
Also Read : రామ్ చరణ్ - బుచ్చిబాబు సినిమా కోసం 'దేవర' సినిమాటోగ్రఫర్!