అన్వేషించండి

RC16 : రామ్ చరణ్ - బుచ్చిబాబు సినిమా కోసం 'దేవర' సినిమాటోగ్రఫర్!

RC16 : రామ్ చరణ్ - బుచ్చిబాబు ప్రాజెక్ట్ కి టాలెంటెడ్ టెక్నీషియన్ రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని మూవీ టీం అధికారికంగా వెల్లడించింది.

'RC16' Movie : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన మూవీ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. వచ్చే నెలలోనే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం కాబోతోంది. 'RC16' అనే వర్కింగ్ టైటిల్ తో ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకున్న ఈ ప్రాజెక్ట్ పై అనౌన్స్మెంట్ నుంచి అంచనాలు మొదలయ్యాయి. నిజానికి చరణ్ నటిస్తున్న 'గేమ్ చేంజర్' కంటే 'RC16' పైనే ఫ్యాన్స్ ఫోకస్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి మూవీ టీం ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. RC16 కి సంబంధించి సినిమాటోగ్రాఫర్ ఎవరనే విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. 

'RC16' సినిమాటోగ్రఫర్ గా రత్నవేలు

రామ్ చరణ్ - బుచ్చిబాబు సినిమాకి రత్నవేలు(ISC) సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. శనివారం ఆయన బర్త్డే కావడంతో ఈ సందర్భంగా 'RC16' టీమ్ రత్న వేలుకి ఓ పోస్టర్ ద్వారా బర్త్డే విషెస్ అందజేస్తూ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. బుచ్చిబాబుతో రత్నవేలుకి మంచి బాండింగ్ ఉంది. గతంలో వీరిద్దరూ కలిసి 'రంగస్థలం' సినిమాకి పనిచేశారు. ఈ సినిమాకి సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా బుచ్చిబాబు వర్క్ చేయగా.. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు. 'రంగస్థలం' టైమ్ నుంచి రత్నవేలు పనితనానికి ఫిదా అయిన బుచ్చిబాబు ఇప్పుడు తాను రామ్ చరణ్ తో చేస్తున్న ప్రాజెక్టుకి సినిమాటోగ్రాఫర్ గా ఎంచుకున్నారు.

టాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోల సినిమాలకి తన సినిమాటోగ్రఫీతో ఆడియన్స్ కి విజువల్ ట్రీట్ ఇచ్చిన రత్నవేలు లాంటి టాలెంట్ టెక్నీషియన్ 'RC16' సినిమా కోసం పనిచేస్తున్నారనే విషయం బయటకు రావడంతో కచ్చితంగా ఈ ప్రాజెక్టు కూడా విజువల్ వండర్ గా ఉండబోతుందని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బుచ్చిబాబు, రత్నవేలు ఇద్దరూ కలిసి ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా ప్రాంతంలో సరైన లొకేషన్స్ వెతికే పనిలో ఉన్నట్లు తెలిసింది.

ఎన్టీఆర్ 'దేవర' కి మేజర్ హైలైట్ గా రత్నవేలు సినిమాటోగ్రఫీ

రత్న వేలు ప్రస్తుతం ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'దేవర' మూవీకి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాకి రత్న వేలు సినిమాటోగ్రఫీ మేజర్ హైలెట్ గా ఉండబోతుంది. దేవరతో ఆడియన్స్ కి సరికొత్త విజువల్ ఫీస్ట్ ఇచ్చేందుకు రత్నవేలు అత్యాధునిక టెక్నాలజీని వినియోగించారు. 'దేవర' విజువల్లీ ఎంతో గ్రాండియర్ గా ఉండబోతుందని ఇటీవల మూవీ టీం చెబుతూ వస్తోంది. దీన్నిబట్టి సినిమాలో రత్నవేలు సినిమాటోగ్రఫీ ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్థమవుతుంది.

'RC16' టైటిల్ అనౌన్స్మెంట్ అప్పుడే

రామ్ చరణ్ కోసం బుచ్చిబాబు ఓ రూరల్ స్పోర్ట్స్ డ్రామాని ప్రిపేర్ చేశాడు. ఈ స్క్రిప్టు మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్న డైరెక్టర్.. పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఈ ప్రాజెక్ట్ ను కంప్లీట్ చేయడానికి రెడీ అవుతున్నారు. 'RC 16' చిత్రాన్ని మార్చిలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించనున్నారని సమాచారం. మే నెలలో రెగ్యులర్ షూట్ కి వెళ్ళే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు 8నెలల్లో షూటింగ్ అంతా పూర్తి చెయ్యాలని భావిస్తున్నారట. అంతేకాదు 2025 మార్చి లాస్ట్ వీక్ లో రిలీజ్ చేసే విధంగా బుచ్చిబాబు అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారట. ఈ నెల 27న రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్ గా ఫస్ట్ లుక్ లేదా టైటిల్ అనౌన్స్ మెంట్ ఇచ్చే అవకాశం ఉంది.

Also Read : ఎన్‌‌టీఆర్, అల్లు అర్జున్‌తో తలపడాలని ఉంది - బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ వింత కోరిక

టాప్ హెడ్ లైన్స్

NTR: బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
Kadiri Movie: చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
Rukmini Vasanth: మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Embed widget