Telusu Kada First Review: టిల్లు భాయ్ 'తెలుసు కదా' ఫస్ట్ రివ్యూ - రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్ మెప్పిస్తుందా?
Telusu Kada Censor Review: యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ లేటెస్ట్ మూవీ 'తెలుసు కదా' సెన్సార్ పనులు పూర్తయ్యాయి. ఈ మూవీ ఫస్ట్ రివ్యూ ఎలా ఉందో ఓసారి చూస్తే...

Siddu Jonnalagadda Telusu Kada Censor Review: యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ లేటెస్ట్ లవ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'తెలుసు కదా' ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫేమస్ స్టైలిస్ట్ నీరజ్ కోన డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్న ఈ మూవీలో సిద్ధు సరసన రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా సెన్సార్ పనులు పూర్తి చేసుకోగా... ఫస్ట్ రివ్యూ టాక్ బయటకు వచ్చేసింది. మూవీ ఎలా ఉందో చూస్తే...
U/A సర్టిఫికెట్... ఫస్ట్ రివ్యూ
ఈ మూవీ ముగ్గురి మధ్య జరిగే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని టీజర్‌ను బట్టి తెలుస్తోంది. ఈ మూవీకి సెన్సార్ బోర్డ్ క్లీన్ 'U/A' సర్టిఫికెట్ ఇచ్చినట్లు మేకర్స్ తెలిపారు. మూవీ చూసి బోర్డు సభ్యులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేసినట్లు చెప్పాారు. రన్ టైం 2 గంటల 16 నిమిషాలు అని తెలుస్తోంది. లవ్, రొమాంటిక్, కామెడీ ఎంటర్‌టైనింగ్‌గా ఉందని తెలుస్తోంది. సెన్సిబుల్ రొమాంటిక్ ఎలిమెంట్స్‌ను చక్కగా డీల్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. సిద్ధు జొన్నలగడ్డ పంచ్ డైలాగ్స్, హర్ష కామెడీ టైమింగ్ ఫుల్ ఎంటర్‌టైనింగ్ అనిపిస్తుందని బోర్డు సభ్యులు తెలిపారు.
ఫ్యామిలీ, యూత్ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యే అంశాలు చాలా ఉన్నాయని అంటున్నారు. సిద్ధు జొన్నలగడ్డ యాక్టింగ్‌కు తమన్ మ్యూజిక్ వేరే లెవల్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ మూవీని ఎంజాయ్ చెయ్యొచ్చని సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చింది.
#TelusuKada censored with U/A ❤️
— People Media Factory (@peoplemediafcy) October 12, 2025
A Beautiful Unapologetic Entertainer coming for you all on October 17th ✨
Watch it with your family and friends on the big screens 😍#LoveU2#TelusuKada in cinemas worldwide from October 17th!
STAR BOY @Siddubuoyoffl @NeerajaKona… pic.twitter.com/1Xrt99dn5l
Also Read: 'OG' నైజాం కలెక్షన్స్... దిల్ రాజు ఫుల్ హ్యాపీ - పవన్ కల్యాణ్‌తో నెక్స్ట్ మూవీపై బిగ్ అప్డేట్
ఈ మూవీలో సిద్ధు సరసన శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. వైవా హర్ష కీలక పాత్ర పోషించారు. మ్యూజిక్ లెజెండ్ తమన్ మ్యూజిక్ అందించగా... పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. దీపావళి సందర్భంగా తెలుగు, తమిళంతో పాటు కన్నడ భాషలోనూ ఈ నెల 17న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
గత కొంతకాలంగా సిద్ధు జొన్నలగడ్డ సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. రీసెంట్‌గా వచ్చిన 'జాక్' అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. టిల్లు, టిల్లు స్క్వేర్ మూవీస్‌తో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఆయన... ఇప్పుడు లవ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నారు. 'తెలుసు కదా'తో సరైన హిట్ కొట్టాలని ఆయన ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.





















