Andhra King Taluka Teaser: ఈ ఫ్యాన్ ఉన్నాడని హీరోకు తెలుస్తుందా? - రామ్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' టీజర్
Andhra King Taluka Movie: ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, ఉపేంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ 'ఆంధ్ర కింగ్ తాలూకా' టీజర్ వచ్చేసింది. లవ్, ఫ్యాన్, ఎమోషన్‌తో ఆసక్తికరంగా ఉంది.

Ram Pothineni's Andhra King Taluka Teaser Out: యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, కన్నడ స్టార్ ఉపేంద్ర ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ యునిక్ ఎంటర్‌టైనర్ 'ఆంధ్ర కింగ్ తాలూకా'. అందరి హీరోల ఫ్యాన్స్‌కు ఫుల్ జోష్ ఇచ్చేలా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, లుక్స్ వేరే లెవల్‌లో ఉండగా... టీజర్ హైప్ క్రియేట్ చేస్తోంది.
టీజర్ ఎలా ఉందంటే?
సినిమా పిచ్చి ఉన్న ఓ తండ్రి. తండ్రిని చూస్తూ పెరిగిన ఓ కొడుకు. స్టార్ హీరో అభిమాన సంఘానికి లీడర్. హీరో మూవీ వస్తే ఫ్రెండ్స్‌తో చేసే హడావుడి అంతా ఇంతా కాదు. అలాంటి ఓ కల్ట్ ఫ్యాన్ జీవితంలో ఏం జరిగింది? ఓ హీరోను ఎంతగానో అభిమానించే ఫ్యాన్స్‌కు కష్టం ఎదురైతే ఎవరు ఆదుకుంటారు? వంటి అంశాలన్నీ కలిపి మాస్, ఎమోషన్, కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా 'ఆంధ్ర కింగ్ తాలూకా'ను తెరకెక్కించినట్లు టీజర్‌ను బట్టి అర్థమవుతోంది.
'పిల్లాడిని సినిమాకు ఎందుకు తీసుకెళ్లావ్? పిల్లాడిని ఇలాగే పాడు చేసి పెట్టు' అంటూ ఓ భార్య భర్తకు చీవాట్లు పెడుతుండగా... 'సినిమాలు చూసి ఎవరు చెడిపోతారే?' అంటూ భర్త చెప్పే డైలాగ్‌తో టీజర్ ప్రారంభం అవుతుంది. మూవీలో ఉపేంద్ర హీరోగా చేస్తుండగా... 'ఆంధ్ర కింగ్ తాలూకా' ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా రామ్ కనిపించనున్నారు. తన హీరో మూవీ రిలీజ్ అయితే ఫ్రెండ్స్‌తో థియేటర్స్ వద్ద చేసే రచ్చ అంతా ఇంతా కాదు. హీరో కోసం ప్రాణాలు తీయడమా? లేక ప్రాణాలు ఇచ్చేయడమా? అనేంత రేంజ్‌లో ఉంటారు. ఆ హీరోకు ఈ హీరో సూపర్ ఫ్యాన్ అయితే ఆ ఫ్యాన్‌కు మన హీరోయిన్ ఫ్యాన్. 'బొమ్మ బ్లాక్ బస్టర్ అక్కడ. నైజాంలో కోసి గుంటూరులో కారం పెట్టి సీడెడ్‌లో ఫ్రై చేసి ఆంధ్రలో పలావ్ వండేస్తే మొత్తం దిగిపోద్ది.' అంటూ హీరో చెప్పిన డైలాగ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. 'ఫ్యాన్ ఫ్యాన్ అంటూ ఓ గుడ్డలు చింపేసుకోవడమే కానీ నువ్వు ఒకడివి ఉన్నావని ఆ హీరోకు కూడా తెలియదు. ఏం బతుకులురా మీవి?' అంటూ మురళీ శర్మ చెప్పే డైలాగ్ అందరినీ ఆలోచింపచేస్తుంది.
Also Read: బాలయ్య 'అఖండ 2' రుద్ర తాండవం - థియేటర్స్ దద్దరిల్లడం ఖాయం
రిలీజ్ ఎప్పుడంటే?
ఈ మూవీకి 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ఫేం పి.మహేష్ బాబు దర్శకత్వం వహిస్తుండగా... రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించారు. మూవీలో హీరోగా కన్నడ స్టార్ ఉపేంద్ర ప్రధాన పాత్రలో నటించారు. ఆయనకు బిగ్ ఫ్యాన్‌గా సాగర్ రోల్‌లో రామ్ నటించారు. వీరితో పాటే రావు రమేష్, తులసి రామ్, సత్య, రాహుల్ రామకృష్ణ, మురళీ శర్మ, వీటీవీ గణేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ మూవీని నిర్మించారు. నవంబర్ 28న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Life is all Fun & Games Until... 💥💥
— Mythri Movie Makers (@MythriOfficial) October 12, 2025
Presenting you all the energetic #AKTTeaser 🥁❤️🔥
▶️ https://t.co/Ew5lbxTYFX#AndhraKingTaluka GRAND RELEASE WORLDWIDE ON NOVEMBER 28th.#AKTonNOV28
Energetic Star @ramsayz @nimmaupendra #BhagyashriBorse @filmymahesh @MythriOfficial… pic.twitter.com/FcEandupAc






















