Mowgli Release Date: థియేటర్లలోకి 'మోగ్లీ' వచ్చేస్తున్నాడు - తవైలా బర్త్ డే To క్రిస్మస్ వరకూ మనదే అంతా
Mowgli Movie: టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ కనకాల న్యూ మూవీ 'మోగ్లీ' నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. ఇప్పటికే గ్లింప్స్ రిలీజ్ కాగా... తాజాగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్.

Roshan Kanakala's Mowgli Movie Release Date: ప్రముఖ యాంకర్ సుమ కొడుకు, టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ కనకాల మరో క్రేజీ ప్రాజెక్ట్ 'మోగ్లీ'తో ఆడియన్స్ ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. 'కలర్ ఫోటో' ఫేం సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ ఆకట్టుకుంటుండగా... రిలీజ్ డేట్ తాజాగా అనౌన్స్ చేశారు మేకర్స్. ఓ ఫన్నీ వీడియోతో రోషన్, సందీప్ రాజ్, వైవా హర్ష కలిసి డేట్ లాక్ చేశారు.
రిలీజ్ ఎప్పుడంటే?
ఈ మూవీని తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ బర్త్ డే రోజున రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. 'మాస్ కీ, క్లాస్ కీ, యూత్‌కు, ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఈ అద్వితీయమైన ప్రేమకథతో ప్రతీ బ్లాక్ బస్టర్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ హామీ ఇస్తున్నాం. వరల్డ్ వైడ్ డిసెంబర్ 12న మోగ్లీ రిలీజ్ అవుతుంది.' అంటూ ప్రకటించారు. 'తలైవా' బర్త్ డే నుంచి 'క్రిస్మస్' వరకూ మనదే అంతా అంటూ ఓ ఫన్ వీడియోతో డైరెక్టర్ సందీప్ రాజ్, రోషన్, వైవా హర్ష సందడి చేశారు.
Mass ki, Class ki…
— People Media Factory (@peoplemediafcy) October 11, 2025
Youth ki, Family audience ki…
Every section ki BLOCKBUSTER THEATRICAL EXPERIENCE GUARANTEED with this ONE-OF-ITS-KIND love story #MOWGLI ❤️🔥#Mowgli2025 GRAND RELEASE WORLDWIDE ON 12th DEC 2025 🐎💥
A @SandeepRaaaj directorial.
🌟ing @RoshanKanakala,… pic.twitter.com/FjVRbHdLWq
Also Read: రవితేజ బయోపిక్... మాస్ మహారాజా ఓపెన్ అయితే టిల్లు భాయ్ రెడీ!
ఫారెస్ట్‌లో క్యూట్ లవ్ స్టోరీ
అడవిలో సాగే ఓ అందమైన లవ్ స్టోరీ యాక్షన్ అంశాలు జోడించి మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ హైప్ క్రియేట్ చేస్తోంది. రోషన్ అడవిలో ఉండే వారియరా? లేక పోలీస్ ఆఫీసరా? అనేది తెలియాల్సి ఉంది. ఓ చిన్న లవ్ స్టోరీ, దాన్ని సాధించేందుకు సాగే ఓ యుద్ధం అనేలా స్టోరీ ఉండనుందని గ్లింప్స్ చూస్తేనే అర్థమవుతోంది. అసలు హీరో అడవిలో ఎందుకు ఉండాల్సి వచ్చింది? అతని దగ్గర పోలీస్ ఆఫీసర్ డ్రెస్ ఎందుకు ఉంది? ఆ గబ్బర్ సింగ్ ట్యాగ్ ఏంటి అనేది తెలియాలంటే మూవీ రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
ఈ మూవీలో రోషన్ సరసన సాక్షి సాగర్ మడోల్కర్ హీరోయిన్‌గా నటిస్తుండగా... ఆమెకు ఇదే ఫస్ట్ మూవీ. సందీప్ రాజ్ దర్శకత్వం వహించగా... పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వైవా హర్ష కీలక పాత్ర పోషించనున్నారు. కాల భైరవ మ్యూజిక్ అందించనున్నారు. ఫస్ట్ మూవీ 'బబుల్ గమ్' అంతగా ఆకట్టుకోకపోయినా తన నటనతో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు రోషన్. ఇప్పుడు డిఫరెంట్ రొమాంటిక్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ మూవీతో మంచి హిట్ కొట్టాలని మూవీ లవర్స్ ఆకాంక్షిస్తున్నారు.





















