Pawan Kalyan: 'OG' నైజాం కలెక్షన్స్... దిల్ రాజు ఫుల్ హ్యాపీ - పవన్ కల్యాణ్‌తో నెక్స్ట్ మూవీపై బిగ్ అప్డేట్
OG Movie Collections: నైజాం ఏరియాలో పవన్ కల్యాణ్ 'OG' రికార్డు కలెక్షన్స్ సాధించింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ దీనిపై ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

Producer Dil Raju Opens Up About Movie With Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గ్యాంగ్ స్టర్ డ్రామా 'OG' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా రూ.308 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినట్లు చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ రీసెంట్‌గా పోస్టర్ రిలీజ్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో అటు నైజాం నుంచి ఇటు సీడెడ్, ఆంధ్ర వరకూ రికార్డు వసూళ్లు సాధించింది.
నిర్మాత దిల్ రాజు ఫుల్ హ్యాపీ
నైజాంలో 'OG'కి అదిరే కలెక్షన్స్ వచ్చినట్లు నైజాం డిస్ట్రిబ్యూటర్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలిపారు. రీసెంట్‌గా ఓ థియేటర్‌కు వెళ్లిన ఆయన ఫ్యాన్స్ మధ్య ఈ సక్సెస్‌ను ఎంజాయ్ చేశారు. 'ఓజీ సినిమాతో మేము లాభాలతో ముందుకెళ్తున్నాం. చాలా రోజుల నుంచి నాకు కూడా ఓ ఎనర్జీ అవసరం ఉండే. మీ అభిమానులకు పవర్ స్టార్ స్క్రీన్‌పై ఎనర్జీ ఇస్తే పేపర్ మీద డబ్బుల రూపంలో నాకు ఎనర్జీ ఇచ్చింది OG. నైజాంకా బాద్ షా.' అంటూ ఫుల్ జోష్‌తో అనౌన్స్ చేయగా ఫ్యాన్స్ ఈలలు, కేకలతో సందడి చేశారు. ఈ మూవీ నైజాంలో రూ.55 కోట్లకు పైగా షేర్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. పవన్ కెరీర్‌లోనే ఆల్ టైం హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది.
#TheyCallHimOG continues strong with profits in Nizam.
— TheyCallHimOG (@TheOGBookings) October 11, 2025
Nizam Distributor Dil Raju says, “#OG gave us the boost we needed "
pic.twitter.com/Ma02CxcvV2
Also Read: ఈ ఫ్యాన్ ఉన్నాడని హీరోకు తెలుస్తుందా? - రామ్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' టీజర్
పవన్‌తో మరో మూవీ
ఇప్పటికే పవన్ కల్యాణ్‌తో 'వకీల్ సాబ్' వంటి మంచి హిట్ తీసిన దిల్ రాజు ఆయనతో మరో మూవీ తీసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. పవన్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మూవీకి స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తారనే టాక్ వినిపిస్తోంది. అయితే, అది ఏ జానర్ అనేది తెలియాల్సి ఉంది. రీసెంట్ 'OG'లో పవన్‌ను ఓ సగటు అభిమాని ఎలా అయితే చూడాలనుకున్నారో అలానే చూపించారు డైరెక్టర్ సుజీత్. ఇప్పుడు ఈ కొత్త ప్రాజెక్టు కూడా పవన్ మాస్ ఎలివేషన్‌కు తగ్గట్లుగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అనిల్... మెగాస్టార్ చిరంజీవితో 'మన శంకర వరప్రసాద్ గారు'తో బిజీగా ఉన్నారు. అది పూర్తైన తర్వాతే పవన్ సినిమాపై అడుగులు పడే అవకాశాలు ఉన్నాయి.
పవన్ ప్రస్తుతం హరీష్ శంకర్‌తో 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ చేస్తున్నారు. ఇక 'OG' ఈవెంట్లలో ప్రీక్వెల్, సీక్వెల్ అనౌన్స్ చేశారు. ఓ వైపు డిప్యూటీ సీఎంగా ప్రజా పాలన చేస్తూనే మరోవైపు సినిమాలకు కొంత సమయం కేటాయిస్తున్నారు. కనీసం రెండేళ్లకు ఒక మూవీ అయినా చేయాలంటూ దిల్ రాజు ఇటీవల ఈవెంట్‌లో పవన్‌ను రిక్వెస్ట్ చేశారు. అన్నీ కుదిరిన తర్వాతే దిల్ రాజుతో మూవీ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉంది.





















