News
News
వీడియోలు ఆటలు
X

Jiiva In YS Jagan Biopic - Yatra 2 : మహి ప్లాన్ ఏంటి - వైఎస్ జగన్ పాత్రలో ఆర్బీ చౌదరి తనయుడు జీవా!?

Mahi V Raghav's YS Jagan Biopic Update : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాత్రలో తమిళ హీరో జీవా నటించనున్నారా? అంటే... 'నటించవచ్చు' అనే సమాధానం వినబడుతోంది.

FOLLOW US: 
Share:

'సేవ్ ద టైగర్స్' వెబ్ సిరీస్ విజయంతో మహి వి రాఘవ్ (Mahi V Raghav) ఫుల్ హ్యాపీగా ఉన్నారు. నిర్మాతగా, క్రియేటర్ గా ఆయనకు ఆ సిరీస్ మంచి ప్రశంసలు తీసుకొచ్చింది. ఈ జోరు, హుషారులో దర్శకుడిగా తన కొత్త సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తున్నారు మహి. 'యాత్ర 2' స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి (YS RajaSekhara Reddy) అధికారంలోకి రావడానికి ముందు చేసిన పాదయాత్ర, ఆ తర్వాత సంఘటనల ఆధారంగా మహి వి రాఘవ్ 'యాత్ర' చేశారు. ఆ సినిమాలో వైఎస్సార్ పాత్రలో మలయాళ స్టార్ మమ్ముట్టి నటించారు.

'యాత్ర' విడుదలైన కొన్నాళ్లకు దానికి సీక్వెల్ 'యాత్ర 2' (Yatra 2 Movie) తీస్తారని వినిపించింది. ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) జీవితం ఆధారంగా సీక్వెల్ ఉంటుందని మహి వి రాఘవ్ తెలిపారు. 'సేవ్ ద టైగర్స్' వెబ్ సిరీస్ విడుదలకు ముందు మీడియాతో మాట్లాడినప్పుడు తప్పకుండా 'యాత్ర' ఉంటుందని కన్ఫర్మ్ చేశారు. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... 

'యాత్ర 2'లో వైఎస్ జగన్ పాత్రలో జీవా?
'యాత్ర 2'లో వైఎస్ జగన్ పాత్రను ఎవరు చేస్తారు? అంటే... ఒకానొక సమయంలో కోలీవుడ్ స్టార్ హీరో, తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడైన సూర్య పేరు ఆ మధ్య బలంగా వినబడింది. వైఎస్ ఫ్యామిలీతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కనుక 'యాత్ర'లో ఆయన నటించడం దాదాపుగా ఖాయమనే అందరూ భావించారు. 

ప్రస్తుతం సూర్య లైనప్ చూస్తుంటే ఇప్పట్లో ఖాళీ అయ్యేలా లేరు. పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. అందుకని, మహి వి రాఘవ్ వేరే హీరోల వైపు చూస్తున్నారు. ఇటీవల జీవాను కలిసి కథ చెప్పారట!

'రంగం' సినిమాతో తెలుగులోనూ జీవా (Jiiva) హిట్ అందుకున్నారు. తెలుగులో పలు హిట్ చిత్రాలు నిర్మించిన సూపర్ గుడ్ ఫిలిమ్స్ అధినేత ఆర్బీ చౌదరి కుమారుడే ఆయన. ఆల్రెడీ రియల్ లైఫ్ క్యారెక్టర్ చేసిన అనుభవం ఉంది. టీమ్ ఇండియా తొలి వరల్డ్ కప్ విజయంపై రూపొందిన '83' సినిమాలో కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రలో కనిపించారు. ఇప్పుడు జగన్ పాత్రలో కనిపిస్తారా? లేదా? అనేది కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది. 

Also Read : కోలుకోవడానికి కొంచెం టైమ్ పడుతుంది - శరత్ బాబు లేటెస్ట్ హెల్త్ అప్డేట్

ఇంతకు ముందు 'యాత్ర 2' గురించి మహి వి రాఘవ్ మాట్లాడుతూ ''ప్రస్తుతానికి 'యాత్ర 2' గురించి ఎక్కువగా నేను మాట్లాడలేను. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిన వాస్తవ సంఘటలను తీసుకుని సినిమా చేయాలి? నటీనటులుగా ఎవరిని తీసుకోవాలి? కంటెంట్ ఏం ఉండాలి? వంటి అంశాల గురించి నాకు క్లారిటీ వచ్చిన తర్వాత మరింత మాట్లాడతాను. అయితే, ఒక్కటి మాత్రం చెప్పగలను... 'యాత్ర 2', నేను చెప్పాలి అనుకున్న కథ! తప్పకుండా చెప్పి తీరుతా'' అని పేర్కొన్నారు. 

ఎన్నికలకు ముందు 'యాత్ర 2'!ఏపీలో రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ముందు 'యాత్ర 2' విడుదల చేయాలనే సంకల్పంతో మహి వి రాఘవ్ ఉన్నారట. సో... త్వరలో సెట్స్ మీదకు వెళ్లే ఛాన్సులు ఉన్నాయి. దీని కంటే ముందు ఆయన నుంచి మరో సినిమా వచ్చే అవకాశం ఉంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ కోసం 'సైతాన్' అని ఒక వెబ్ సిరీస్ చేశారు. మరో సినిమా కూడా కంప్లీట్ చేసినట్లు టాక్. 

Also Read 'పలాస' దర్శకుడితో వరుణ్ తేజ్ సినిమా - పీరియడ్ క్రైమ్ డ్రామా!

Published at : 04 May 2023 03:43 PM (IST) Tags: YS Jagan Mohan Reddy Mahi V Raghav YS Jagan biopic Yatra 2 Movie Jiiva

సంబంధిత కథనాలు

Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?

Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?

Chiranjeevi Cancer : నేనూ క్యాన్సర్ బారిన పడ్డాను - మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు 

Chiranjeevi Cancer : నేనూ క్యాన్సర్ బారిన పడ్డాను - మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు 

ఒడిశా రైలు ప్రమాదంపై టాలీవుడ్ సినీ ప్రముఖుల దిగ్భ్రాంతి - రక్తదానం చేయాలని అభిమానులకు చిరు పిలుపు 

ఒడిశా రైలు ప్రమాదంపై టాలీవుడ్ సినీ ప్రముఖుల దిగ్భ్రాంతి - రక్తదానం చేయాలని అభిమానులకు చిరు పిలుపు 

Unstoppable Trailer : ఆవారాలా? పోలీసులా? 25 లక్షల కోసం వాడ్ని పట్టించారా? 'అన్‌స్టాపబుల్' ట్రైలర్ ఎలా ఉందంటే?

Unstoppable Trailer : ఆవారాలా? పోలీసులా? 25 లక్షల కోసం వాడ్ని పట్టించారా? 'అన్‌స్టాపబుల్' ట్రైలర్ ఎలా ఉందంటే?

Bimbisara-2: ‘బింబిసార 2’ నుంచి తప్పుకున్న వశిష్ఠ్, కొత్త దర్శకుడు ఎవరో తెలుసా?

Bimbisara-2: ‘బింబిసార 2’ నుంచి తప్పుకున్న వశిష్ఠ్, కొత్త దర్శకుడు ఎవరో తెలుసా?

టాప్ స్టోరీస్

Coromandel Express Accident: రాంగ్‌ ట్రాక్‌లోకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, అందుకే ఘోర ప్రమాదం - ప్రాథమిక రిపోర్ట్

Coromandel Express Accident: రాంగ్‌ ట్రాక్‌లోకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, అందుకే ఘోర ప్రమాదం - ప్రాథమిక రిపోర్ట్

Avinash Reddy To CBI : అవినాష్ రెడ్డిని 6 గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ - వాట్సాప్ కాల్స్ పైనే సమాచారం సేకరించారా ?

Avinash Reddy To CBI : అవినాష్ రెడ్డిని 6 గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ -  వాట్సాప్ కాల్స్ పైనే సమాచారం సేకరించారా ?

Coromandel Train Accident: రైళ్లు పట్టాలు తప్పడానికి కారణాలేంటి? ఆ నిర్లక్ష్యమే ప్రాణాలు తీస్తోందా?

Coromandel Train Accident: రైళ్లు పట్టాలు తప్పడానికి కారణాలేంటి? ఆ నిర్లక్ష్యమే ప్రాణాలు తీస్తోందా?

BGMI Tips: బీజీఎంఐలో చికెన్ డిన్నర్ కొట్టాలనుకుంటున్నారా - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

BGMI Tips: బీజీఎంఐలో చికెన్ డిన్నర్ కొట్టాలనుకుంటున్నారా - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!