By: ABP Desam | Updated at : 20 Apr 2022 10:55 AM (IST)
'ఎఫ్ 3'లో వరుణ్ తేజ్, మెహరీన్, తమన్నా, వెంకటేష్
'ఎఫ్ 2'లో పాటలు గుర్తు ఉన్నాయా? అందులో 'గిర్రా గిర్రా గిర్రా... అరే తిరుగుతోంది బుర్ర' సాంగ్‌లో హీరోయిన్లు తమన్నా, మెహరీన్ చేసిన గ్లామర్ షో సినిమాకు హైలైట్ అయింది. 'ఎఫ్ 3' సినిమా (F3 Movie)కు వస్తే... అటువంటి సాంగ్ ఒకటి ప్లాన్ చేసినట్లు ఉన్నారు. ఆ పాటే 'ఊ ఆ ఆహా ఆహా'.
వెంకటేష్ సరసన తమన్నా (Tamannaah), వరుణ్ తేజ్‌కు జోడీగా మెహరీన్ కౌర్ (Mehreen Kaur Pirzada) నటిస్తున్న సినిమా 'ఎఫ్ 3'. ఇందులో సెకండ్ లిరికల్ సాంగ్ 'ఊ ఆ ఆహా ఆహా' శుక్రవారం విడుదల చేయనున్నారు. ఈ రోజు సాంగ్ ప్రోమో విడుదల చేశారు (F3 movie second lyrical song promo out now).
'ఊ ఆ ఆహా ఆహా' సాంగ్ (Woo Aaa Aha Aha Song) ప్రోమో చూస్తే... తమన్నా, మెహరీన్ కౌర్ గ్లామర్ మరోసారి హైలైట్ అయ్యేలా ఉంది. చీరలో, నైట్ డ్రస్‌లో, బీచ్ వేర్‌లో... గ్లామర్ షోకు ఏదీ అతీతం కాదన్నట్టు హీరోయిన్లు ఇద్దరూ ప్రేక్షకులకు కనువిందు చేశారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం (Devi Sri Prasad - F3 Songs) అందించిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ రాశారు. సునిధీ చౌహన్, లవితా లోబో, సాగర్, ఎస్పీ అభిషేక్ ఈ పాటను ఆలపించారు. ఆల్రెడీ విడుదలైన ప్రోమో హాట్ సాంగ్ అన్నట్టు ఉంది. ఫుల్ లిరికల్ విడుదలైతే... సాంగ్ ఎలా ఉంటుందో తెలుస్తుంది.
Also Read: మోడ్రన్ జిగేలు రాణి వచ్చేసింది - సమ్మర్ సోగ్గాళ్ళతో స్పైసీ డ్యాన్స్
'ఎఫ్ 3' సినిమాలో పూజా హెగ్డే ఓ స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. సోనాల్ చౌహన్ ప్రత్యేక కథానాయికగా నటించిన ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, సునీల్ ఇతర తారాగణం. అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై 'దిల్' రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. మే 27న సినిమా విడుదల కానుంది.
Also Read: మంగళ సూత్రం ఏది? నుదుట సింధూరం ఎక్కడ? - ఆలియాపై ట్రోలింగ్ షురూ
F3 Telugu Movie Woo Aa Aha Aha Song Promo Out Now - Watch It Here:
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.Η δημοσίευση κοινοποιήθηκε από το χρήστη Sri Venkateswara Creations (@srivenkateswaracreations)
Karate Kalyani: నన్ను చంపేందుకు నా కార్ టైర్లు కోసేశారు, పెద్ద ప్రమాదం తప్పింది: కరాటే కళ్యాణి
షారుక్‌తో నటించేందుకు ఆ పాక్ నటుడు రూ.1 మాత్రమే తీసుకున్నాడట!
Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం
Agent OTT release: 'ఏజెంట్' రీ-కట్ వెర్షన్ కూడా బాగోలేదా? ఓటీటీలో రిలీజ్ ఇప్పట్లో కష్టమేనా?
Adipurush: సినీ చరిత్రలో నిలిచిపోయే విధంగా ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు
KTR Mulugu Tour: ఈ 7న ములుగు జిల్లాలో కేటీఆర్ పర్యటన, కలెక్టరేట్ సహా పలు పనులకు శంకుస్థాపన
Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన
Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ
క్యూట్ స్మైల్ తో కట్టిపడేస్తున్న లావణ్య త్రిపాఠి