అన్వేషించండి

Swara Bhaskar: ఆడాళ్ళేమీ అందాల బొమ్మలు కాదు... డెలివరీ తర్వాత బాడీ షేమింగ్‌పై స్వరా భాస్కర్ స్ట్రాంగ్ రిప్లై

Swara Bhaskar On Trolls: ప్రసవం తర్వాత తన శరీరంలో వచ్చిన మార్పులపై ట్రోలింగ్ చేశారని స్వరా భాస్కర్ తెలిపారు. తన శరీరం వాళ్లకు వ్యాపారం కాదని ఆవిడ ఘాటుగా స్పందించారు.

బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ తెలుసా? కంగనా రనౌత్ 'తను వెడ్స్ మను', ధనుష్ 'రాంజనా', అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియో సిరీస్ 'రసభరి'లో నటించారు. ఆమె మూడేళ్ళ క్రితం పెళ్లి చేసుకున్నారు. ఓ బిడ్డకు జన్మ ఇచ్చారు. అయితే డెలివరీ తర్వాత బరువు పెరిగడం మీద సోషల్ మీడియాలో తనను ట్రోలింగ్ చేశారని తెలిపారు. తనపై వస్తున్న విమర్శలకు, బాడీ షేమింగ్‌కు ఆమె స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే...

డెలివరీకి ముందు, తర్వాత...
స్వరా భాస్కర్ ఫోటోలపై ట్రోల్స్!
కుమార్తె రాబియాకు 2023లో స్వరా భాస్కర్ జన్మనిచ్చారు. ఇటీవల తాను 2018లో దిగిన ఫోటోను, ప్రజెంట్ ఫోటోను కలిపి సోషల్ మీడియాలో ఒక కొలాజ్‌ను షేర్ చేశారు. ఆ పోస్ట్ మీద కొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు. స్వరా భాస్కర్ కెరీర్ నుంచి మొదలు పెడితే... ప్రజెంట్ బాడీ గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆమె తీవ్రంగా స్పందించారు. మహిళల మీద డెలివరీ తర్వాత మునుపటి శరీర ఆకృతిలోకి త్వరగా రావాలనే ఒత్తిడి చేయడకూడదని, అటువంటి ధోరణి తప్పు అని ఆమె తీవ్రంగా ఖండించారు. 

మళ్ళీ మునుపటి శరీర ఆకృతి ఎందుకు?
డెలివరీ తర్వాత మళ్ళీ మునుపటి శరీర ఆకృతిని పొందాలని తాను అనుకోలేదని స్వరా భాస్కర్ స్పష్టం చేశారు. ఒక్కసారి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత జీవితం మొత్తం మారిపోతుందని, మళ్ళీ మునుపటి స్థితికి వెళ్లడం సాధ్యం కాదని, బిడ్డ పుట్టిన తర్వాత మహిళలు జీవితాంతం తల్లిగా ఉంటారని ఆమె పేర్కొన్నారు.

Also Read: Jailer 2 - రజనీకాంత్ సినిమాలో చిరంజీవి భార్య... ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్

మహిళలు ఏమీ అందాల బొమ్మలు కాదు!
మహిళల బాడీ అంటే కేవలం గ్లామర్ ప్రదర్శించడానికి, లైంగిక ఆకర్షణ కోసం మాత్రమే కాదని స్వరా భాస్కర్ అన్నారు. ఒకరికి ప్రాణం పోయడం, ఒక బిడ్డకు జన్మనివ్వడం, పెంచి పోషించడం వంటి గొప్ప ఉద్దేశ్యాలు మహిళల శరీరానికి ఉన్నాయని... అలాంటప్పుడు మహిళల శరీరంలో మార్పులు రావడం చాలా సహజం అని ఆమె వివరించారు. డెలివరీ తర్వాత మళ్ళీ మునుపటి శరీర ఆకృతిలోకి మారమని మహిళలను అడగటం క్రూరత్వం కిందకు వస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.

Also ReadPatriot Movie Review - మమ్ముట్టి 'పేట్రియాట్' రివ్యూ: ప్రత్యేక పాత్రలో మోహన్ లాల్ - మలయాళ మల్టీస్టారర్ ఎలా ఉందంటే?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Swara Bhasker (@reallyswara)

నటనకు అందానికి సంబంధం లేదు!
యాక్టింగ్ కెరీర్‌కి, బాడీకి ముడి పెడుతూ కామెంట్స్ చేసే వారి గురించి స్వరా భాస్కర్ స్పందిస్తూ... ''నటన అనేది ప్రతిభకు సంబంధించినది. దానికి యాక్ట్రెస్ బాడీ వెయిట్, గ్లామర్‌తో సంబంధం లేదు'' స్పష్టం చేశారు. ప్రస్తుత సమాజంలో మహిళలపై జరుగుతున్న బాడీ షేమింగ్ అసహ్యంగా ఉందన్నారు. మహిళలు తమ జీవితాలను తమకు నచ్చినట్లుగా జీవించాలని, ఈ మాట చెప్పడం ఫిట్‌నెస్‌కు వ్యతిరేకం కాదని కూడా ఆమె తెలిపారు.

Also ReadJetlee Review - 'జెట్లీ' రివ్యూ: 'మత్తు వదలరా' టైపులో నవ్వించారా? సత్య - రితేష్ సినిమా ఎలా ఉందంటే?

టాప్ హెడ్ లైన్స్

Vishwanath And Sons Review - విశ్వనాథ్ అండ్ సన్స్ రివ్యూ: సూర్య సినిమా హిట్టా? ఫట్టా? వెంకీ అట్లూరి ఎలా తీశారంటే?
విశ్వనాథ్ అండ్ సన్స్ రివ్యూ: సూర్య సినిమా హిట్టా? ఫట్టా? వెంకీ అట్లూరి ఎలా తీశారంటే?
The Court OTT : ఓటీటీలోకి సరికొత్త కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - తండ్రీ కూతుళ్ల మధ్య వార్... ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సరికొత్త కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - తండ్రీ కూతుళ్ల మధ్య వార్... ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
Friday OTT Movies : ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Telangana Free Sewing Machine Scheme: తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
Embed widget