Majaka First Look: సంక్రాంతి బరిలోకి సందీప్ కిషన్ 'మజాకా'... ఫస్ట్ లుక్‌తోనే పండగ వైబ్ వచ్చేశాయ్ కదూ
Majaka Movie Release Date: యంగ్ హీరో సందీప్ కిషన్ కొత్త సినిమా టైటిల్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. అలాగే ఈ మూవీని సంక్రాంతి బరిలో దింపడానికి ప్లాన్ చేస్తున్నారు.
Sundeep Kishan's Majaka Movie First Look And Release Date: సంక్రాంతి 2025 బరిలోకి సందీప్ కిషన్ తన కొత్త సినిమాతో అడుగు పెట్టబోతున్నాడు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయడంతో పాటు మేకర్స్ మూవీ రిలీజ్ డేట్ ని కూడా అధికారికంగా అనౌన్స్ చేశారు.
సంక్రాంతి బరిలోకి సందీప్ కిషన్ 'మజాకా'
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ గత కొంత కాలంగా బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. రీసెంట్ గా 'ఊరు పేరు భైరవకోన' అనే సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్న సందీప్, తాజాగా 'రాయన్' అనే సినిమాలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ధనుష్ హీరోగా నటించిన ఈ సినిమాలో సందీప్ కిషన్ ఆయనకు సోదరుడిగా కనిపించాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీపై ఫోకస్ చేసిన సందీప్ కిషన్ #sk30 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నాడు.
సందీప్ కిషన్ హీరోగా, త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతోంది ఈ మూవీ. ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను రాజేష్ దండా, బాలాజీ గుప్తా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రసన్న కుమార్ ఈ సినిమాకు డైలాగ్స్, స్క్రీన్ ప్లే రాస్తున్నారు. ఇందులో సీనియర్ నటుడు రావు రమేష్ కీలకపాత్రను పోషిస్తుండగా, లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. మూవీ టైటిల్ ని అనౌన్స్ చేయగా, ఫస్ట్ లుక్ పోస్టర్ లో 2025 సంక్రాంతికి మూవీని రిలీజ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు.
ఫస్ట్ లుక్ తోనే పండగ వైబ్
పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ ల్యాండ్ మార్క్ 30వ సినిమా 'మజాకా'. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ కూడా సినిమా ఎంటర్టైనింగ్ గా ఉండబోతోంది అనే నమ్మకాన్ని కలిగిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్లో సందీప్ కిషన్ నిజమైన సంక్రాంతి వైబ్ క్రియేట్ చేశారు. సాంప్రదాయ పంచ కట్టులో షేడ్స్ ధరించి, భుజంపై టేప్ రికార్డర్ తో పెద్ద కూర్చిపై కూర్చుని కనిపించిన సందీప్ కిషన్ అప్పుడే పండగ వాతావరణాన్ని కళ్ళ ముందు కనిపించేలా చేశాడు. సందీప్ కిషన్ చుట్టూ సంగీత వాయిద్యాలు, పువ్వులు, పండ్లు ఉండడం ఆసక్తిని పెంచేస్తోంది. మొత్తం మీద ఫస్ట్ లుక్ కలర్ ఫుల్ గా ఉంది. అయితే ఈ మూవీ సంక్రాంతి బరిలో నిలవడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే 2025 సంక్రాంతి పోటీలో సీనియర్ హీరోలు ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర'తో సంక్రాంతికి రాబోతున్నాం అని ఇప్పటికే ప్రకటించారు. మరి 2024 లాగే డేట్స్ క్లాష్ వస్తుందా ? అనేది ఆసక్తికరంగా మారింది. చివరిసారి లాగే హీరోల మధ్య వచ్చినట్టుగా విభేధాలు వస్తాయా? డేట్స్ ను ఈసారి ఎలా అడ్జస్ట్ చేసుకుంటారో చూడాలి.
Also Read: గిన్నిస్ రికార్డుల్లో అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి పేరు... తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంబురం