Sukumar Daughter: డైరెక్టర్ సుకుమార్ కూతురు అరుదైన ఘనత - అతిచిన్న వయసులోనే ఆమెకు 'దాదా సాహెబ్ ఫాల్కే'అవార్డు
Sukumar Daughter: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూతురు అరుదైన ఘనత సాధించింది. ఆమె నటించిన గాంధీ తాత చెట్టు మూవీకి గానూ ఉత్తమ నటిగా 'దాదా సాహెబ్ ఫాల్కే'అవార్డు అందుకుంది.
Sukumar Daughter Sukriti Veni Received Dadasaheb Phalke Award: క్రియేట్ డైరెక్టర్ సుకుమార్ ప్రౌడ్ మూమెంట్ ఎంజాయ్ చేస్తున్నారు. ఆయన కూతురు సుకృతి వేణి బండ్రెడ్డి అతిచిన్న వయసులోనే అరుదైన ఘనత సాధించింది. ఆమె ప్రధాన పాత్రలో 'గాంధీ తాత చెట్టు' అనే మెసేజ్ ఒరియెంటెడ్ మూవీ తెరకెక్కింది. ఇందులో సుకృతి వేణి తనదైన నటనతో ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో ఆమె నటనకు గానూ ఉత్తమ నటిగా "దాదా సాహెబ్ ఫాల్కె" అవార్డు వరించింది. మంగళవారం ఢీల్లిలో జరిగిన ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో సుకృతి వేణికి ఈ అవార్డును అందజేశారు. కాగా ప్రస్తుతం సుకృతి ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్‌లో గ్రేడ్ 8 అభ్యసిస్తుంది.
ఆమె నటించిన ఈ గాందీ తాత చెట్టు మూవీ గతంలోనూ పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడ్డాయి. ఈ తొలి చిత్రంతోనే తనదైన నటనతో అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు కూడా అందుకుంది. అలాగే అవార్డులు, రివార్డులు కూడా గెలుచుకుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, ఇండియన్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ తొలి సినిమా బాలనటిగా సుకృతిని అవార్డులు వరించాయి. న్యూఢిల్లి ఫిల్మ్ ఫెస్టివల్‌లో జ్యూరి బెస్ట్ ఫిలింగా, 11వ నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగానూ ఎన్నో అవార్డులు అందుకుంది.
View this post on Instagram
అలాగే జైపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ల్ తో పాటు 8వ ఇండియన్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బెస్ట్ జ్యూరీ ఫిలింగా 'గాంధీ తాత చెట్టు' చిత్రం ఎన్నో అవార్డులు అందుకోవడం విశేషం. ఇవి కాకుండా పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌కి కూడా ఈ సినిమాకు ఆహ్వానాలు అందుతున్నాయట. పర్యావరణ పరిరక్షణే ముఖ్య ఉద్దేశంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌తో పాటు గోపీ టాకీస్ సంస్థలు నిర్మించాయి. వై.రవిశంకర్, శేష సింధు రావు, నవీన్ ఎర్నేనిలు నిర్మాతలు. పద్మావతి మల్లాది దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి సుకుమార్ భార్య తబితా సుకుమార్ సమర్పించారు.
The next generation of terrific talent.#SukritiVeniBandreddi, daughter of maverick director @aryasukku wins 'The Dadasaheb Phalke Award' for the Best Child Artist for the performance in #GandhiThathaChettu.
— Mythri Movie Makers (@MythriOfficial) May 1, 2024
The film has already won accolades at many film festivals. It will be… pic.twitter.com/tXaAguYIU0