Sukumar: సుకుమార్ క్యాంపు నుంచి లేడీ డైరెక్టర్... ఆ సినిమాలో హీరో ఎవరంటే?
Sukumar Assistant Directors: దర్శకులుగా మారుతున్న సుకుమార్ అసిస్టెంట్ల లిస్టులో మరో ఇద్దరు చేరబోతున్నారు. ఆయా సినిమాల్లో హీరోలు ఎవరు? ఆ దర్శకులు ఎవరు? అనేది చూస్తే...

'ఉప్పెన' దర్శకుడు బుచ్చి బాబు సానా ఉన్నారుగా! ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా 'పెద్ది' సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన సుకుమార్ శిష్యుడు. న్యాచురల్ స్టార్ నాని హీరోగా 'దసరా' తీసిన దర్శకుడు తెలుసుగా... శ్రీకాంత్ ఓదెల. ప్రస్తుతం 'ది ప్యారడైజ్' తీస్తున్నారు. ఆయన కూడా సుకుమార్ శిష్యుడే. ఈ జాబితాలో ఇంకొందరు దర్శకులు ఉన్నారు. ఇప్పుడు సుకుమార్ శిష్యుల ప్రస్తావన ఎందుకు అంటే... ఆయన క్యాంపు నుంచి మరో ఇద్దరు దర్శకులు వస్తున్నారు.
సుక్కు క్యాంపులో లేడీ డైరెక్టర్!
సుకుమార్ దగ్గర సుమారు 15 మంది అసిస్టెంట్ డైరెక్టర్లు ఉన్నారు. వారిలో మాధురి అని ఓ లేడీ ఉన్నారు. త్వరలో ఆవిడ దర్శకురాలిగా మారబోతున్నారు. సుకుమార్ ఆ కథ విని ఓకే చేశారు. ఆ కథకు తనదైన మార్పులు, చేర్పులు వంటివి సైతం సూచించారట.
మాధురి దర్శకురాలిగా పరిచయం కానున్న సినిమాలో 'మేం ఫేమస్' ఫేమ్ సుమంత్ ప్రభాస్ హీరోగా నటించనున్నట్లు తెలిసింది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన వివరాలను అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు.
Also Read: హైదరాబాద్‌లో మహేష్ - రాజమౌళి టైటిల్ లాంచ్ ప్రోగ్రామ్... మరి కామెరూన్ వస్తారా?
View this post on Instagram
కిరణ్ అబ్బవరం సినిమాతో వీర!
దీపావళి బరిలో 'కే ర్యాంప్' సినిమాతో హిట్టు కొట్టారు యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం. ఇప్పుడు సుకుమార్ క్యాంపు నుంచి రాబోతున్న దర్శకుడితో ఆయన ఓ సినిమా చేయబోతున్నారు.
సుకుమార్ దగ్గర 'పుష్ప' రెండు భాగాలతో పాటు కొన్ని సినిమాలకు వీర అని ఓ జర్నలిస్ట్ వర్క్ చేశారు. స్క్రిప్ట్ పరమైన వర్క్ మాత్రమే కాదు... యాస, భాషలపై మంచి పట్టు ఉండటంతో ఆ పరంగానూ వీర సేవలను సుకుమార్ చాలా వరకు ఉపయోగించుకున్నారు. ఇప్పుడు ఆయన్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ కిరణ్ అబ్బవరం హీరోగా ఓ సినిమా చేసేందుకు సుకుమార్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా వివరాలను సైతం త్వరలో అనౌన్స్ చేయనున్నారు.
View this post on Instagram
'పెద్ది' పూర్తి అయ్యాక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా చేసేందుకు సుకుమార్ రెడీ అవుతున్నారు. ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి కొంత టైం పట్టేట్టు ఉండటంతో మధ్యలో శిష్యుల సినిమాల కథలపై కూర్చున్నారు. ఆ స్క్రిప్ట్ వర్క్స్ కంప్లీట్ అయ్యాయని టాక్. త్వరలో ఆయా సినిమాలను పట్టాలు ఎక్కించనున్నారు.





















