Manike Mage Hithe:హైదరాబాద్ లో యోహాని ప్రదర్శన... ‘మాణికే మాగే హితే’ను లైవ్ లో వినే ఛాన్స్
ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయిన ‘మాణికే మాగే హితే’పాట సింగర్ యోహాని హైదరాబాద్ ప్రదర్శన ఇవ్వబోతోంది.
ఇంటర్నెట్ షేక్ చేసిన సాంగ్ ‘మాణికే మాగే హితే’. ఎక్కడో శ్రీలంకలో పుట్టిన సాంగ్ ఖండాలు దాటి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించింది. అది కూడా అతి తక్కువ కాలంలోనే. ఇప్పుడు ఆ పాటను లైవ్ లో వినే అవకాశం వచ్చింది. ఆ పాట పాడిన సింగ్ యోహాని డిసిల్వ హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఉన్న ‘హార్ట్ కప్ కాఫీ’లో లైవ్ షో ఇవ్వబోతోంది. ఎప్పుడంటే... అక్టోబర్ 3న. ఆ కార్యక్రమంలో ‘మాణికే మాగే’తో పాటూ పలు పాటలను ఆలపించనుంది.
రాప్ ప్రిన్సెస్....
ఒక్క పాటతో సూపర్ సింగర్ గా ఎదిగిన యోహాని డిసిల్వది శ్రీలంకలోని కొలంబో. అక్కడ ఆమె సూపర్ ర్యాపర్. పాటలు రాయగలదు కూడా. ఆమె తండ్రి ఓ ఆర్మీ అధికారి. తల్లి ఎయిర్ హోస్టెస్. చిన్నప్పట్నించే యోహానికి సంగీతం అంటే ప్రాణం. ఆమె ఆసక్తిని గుర్తించిన తల్లి ప్రోత్సహించింది. యూట్యూబ్ ఛానెల్ మొదలుపెట్టి అందులో తన పాటను పోస్టు చేసేది. యూట్యూబ్ ద్వారానే గుర్తింపు పొందింది. ఈమె పాటకు మన బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ ఫిదా అయిపోయారు. ఆ పాట ఎంతగానో నచ్చిందని, ఒక రాత్రంతా వింటూనే ఉన్నానని చెప్పారు.
ఈ ఏడాది మే22న ఆమె మాణికే మాగే హితే పాటను తన యూట్యూబ్ ఛానెల్ లో పోస్టు చేసింది. అంతే యోహాని దశ తిరిగింది. శ్రీలంకతో పాటూ ఇండియా, మరికొన్ని దేశాల్లో పాట సూపర్ హిట్ అయ్యింది. ఆ పదాలకు అర్థాలు తెలియకపోయినా... కేవలం సంగీతానికి, ఆమె స్వరానికే అందరూ ముగ్ధులైపోయారు. ప్రస్తుతం ఆ పాటకు 119 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అంతేకాదు ఇప్పటికే సింహళ భాషలో ఉన్న ఆ పాట తమిళం, బెంగాళీ, తెలుగు భాషల్లోకి కూడా రీమేక్ అయ్యింది. తెలుగు పాట లింకు కింద ఇచ్చాం. ఆసక్తి ఉన్నవారు వినచ్చు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Also read: నెలసరి నొప్పి భరించలేకపోతున్నారా... ఆయుర్వేదం ఏం చెబుతోంది?
Also read: అమ్మాయిని వేధించినందుకు వింత శిక్ష... ఊళ్లో ఆడవాళ్లందరి దుస్తులు ఉతకమన్న జడ్జి... అదే షరతుపై బెయిల్
Also read: ‘మా’ ఎన్నికలు: ప్రకాష్ రాజ్‌తో మంచు విష్ణు ‘ఢీ’.. ప్యానెల్ ప్రకటన
Also read: ఇరవై మూడేళ్లకే ఆరు సార్లు క్యాన్సర్ ను జయించిన విజేత... ఇప్పుడు అతడో స్పూర్తిప్రదాత