Sreeleela: వాచ్‌మేన్‌తో డ్యాన్స్ అదరగొట్టిన శ్రీలీల... వైరల్ వీడియో
Sreeleela viral dance video: శ్రీ లీల డ్యాన్స్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. స్టార్ హీరోలతో కాదు... ఒక సాధారణ వ్యక్తితో ఆవిడ డ్యాన్స్ చేయడం గమనార్హం. ఇంతకీ, ఆ వీడియోలో ఏముంది? అంటే...

యంగ్ హీరోయిన్ శ్రీ లీల (Sreeleela) మంచి డాన్సర్. ప్రజెంట్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో సమానంగా డాన్స్ చేయగల హీరోయిన్ ఎవరు? అంటే... సాయి పల్లవి, శ్రీ లీల - ఈ ఇద్దరి పేర్లు వినపడతాయి. శ్రీ లీల కమర్షియల్ సాంగ్స్ ఎన్నో చేశారు. యంగ్ స్టార్ హీరోలతో చార్ట్ బస్టర్ సాంగ్స్ చేశారు. అయితే... సోషల్ మీడియాలో ఇప్పుడు శ్రీ లీల డాన్స్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అందులో స్టార్ హీరోలు ఎవరూ లేరు, ఒక సామాన్యుడితో శ్రీ లీల డాన్స్ చేశారు.
వాచ్‌మేన్‌తో శ్రీలీల డ్యాన్స్... వీడియో వైరల్!
అవును... శ్రీ లీల ఒక సామాన్య వ్యక్తితో డాన్స్ చేశారు. వాచ్‌మేన్‌తో కలిసి ఆవిడ స్టెప్పులు వేశారు. పబ్ నుంచి బయటకు వచ్చారో? లేదంటే షూటింగ్స్ స్పాట్ దగ్గర సెక్యూరిటీగా పని చేస్తున్న వ్యక్తితో డాన్స్ చేశారో? లేదా ఎక్కడైనా స్టూడియో దగ్గర ఉన్నారో? ఆ సెక్యూరిటీతో ఆవిడ చేసిన డాన్స్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ వీడియో బయటకు ఎలా వచ్చిందో తెలుసా? స్వయంగా శ్రీ లీల షేర్ చేశారు.
'వాచ్‌మేన్ బాబాయ్ రాక్స్' అంటూ శ్రీ లీల ఒంగోలు ఫ్యాన్స్ కామెంట్ చేస్తే... 'నైస్ వీడియో శ్రీ లీల గారు' అంటూ మరొక నెటిజన్ కామెంట్ చేశారు. 'శ్రీ లీల మేడం ఎక్కడ ఉంటే అక్కడ ఫన్ ఉంటుంది' అంటూ ఇంకొక నెటిజన్ కామెంట్ చేశారు. 'ఆ వాచ్‌మేన్ ఈ ప్రపంచంలోనే అదృష్టవంతుడు' అంటూ మరొకరు కామెంట్ చేయడం విశేషం. సోషల్ మీడియాలో శ్రీ లీల ఈ డాన్స్ వీడియో పోస్ట్ చేసిన గంటలో రెండున్నర లక్షల లైక్స్ రావడం విశేషం. ఇక వ్యూస్ సంగతి చెప్పనవసరం లేదు. ప్రతి నిమిషానికి పెరుగుతున్నాయి.
Also Read: ఏపీ సీఎం నారా చంద్రబాబు ఫామ్ హౌస్‌లో భారీ పార్టీ... పద్మ భూషణ్ నందమూరి బాలకృష్ణ కోసం, ఎప్పుడంటే?
View this post on Instagram
Sreeleela Upcoming Movies: శ్రీ లీల చేస్తున్న సినిమాల విషయానికి వస్తే... నితిన్ జంటగా ఆవిడ నటించిన 'రాబిన్ హుడ్' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమాను మార్చి 28న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అది కాకుండా మాస్ మహారాజా రవితేజ సరసన 'మాస్ జాతర' సినిమాలో ఆవిడ నటిస్తున్నారు. అలాగే, తమిళంలో శివ కార్తికేయన్ 25వ సినిమా 'పరాశక్తి'లోనూ శ్రీ లీల ఉన్నారు. ఇటీవల విడుదలైన టైటిల్ టీజర్ మంచి బజ్ తెచ్చింది. అందులో శ్రీ లీల లుక్ ప్రేక్షకులు అందరికీ నచ్చింది. అఖిల్ అక్కినేని కొత్త సినిమాలోనూ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలో కూడా శ్రీ లీల నటిస్తున్నారు.
Also Read: హీరోలను వెయిట్ చేయిస్తూ... నిర్మాతలను ఇబ్బంది పెడుతున్న శ్రీ లీల?





















