News
News
వీడియోలు ఆటలు
X

South Indian Actress: దక్షిణాదిలో బ్యూటిఫుల్ హీరోయిన్స్ వీరే - వైరల్ అవుతోన్న చాట్ జీపీటీ లిస్ట్

ప్రస్తుతం కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా వినిపిస్తోన్న పేరు చాట్ జీపీటీ. ఇది మొదలైనప్పటి నుంచి మిలియన్స్ లో యూజర్లు పెరిగిపోతూ ఉన్నారు.

FOLLOW US: 
Share:

South Indian Actress: ప్రస్తుతం కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా వినిపిస్తోన్న పేరు చాట్ జీపీటీ. ఇది మొదలైనప్పటి నుంచి మిలియన్స్ లో యూజర్లు పెరిగిపోతూ ఉన్నారు. దీంతో అందరి దృష్టి ఈ చాట్ జీపీటీ పైన పడింది. మనం ఏ విషయాన్ని అడిగినా దానికి సంబంధించి కచ్చితమైన సమాచారాన్ని అందిస్తుంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్. అందుకే దీని క్రేజ్ రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతుంది. ఈ చాట్ జీపీటీ అన్ని రంగాల్లోనూ సరికొత్త సేవలను అందిస్తోంది. అయితే ఇప్పుడు సినిమా రంగంలో కూడా ఈ చాట్ జీపీటీ అందరినీ ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ చాట్ జీపీటీ దక్షిణాది లో పది మోస్ట్ గ్లామర్ హీరోయిన్ ల జాబితాను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ తారల ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

శ్రీదేవి

ఈ చాట్ జీపీటీ విడుదల చేసిన జాబితాలో మొదటి స్థానంలో సౌత్, బాలీవుడ్ బ్యూటీ దివంగత నటి శ్రీదేవి నిలిచింది. శ్రీదేవికు సౌత్ లో మంచి గుర్తింపు ఉంది. తెలుగులో కూడా ఆమె ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికీ ఆమెను ఎంతో మంది అభిమానులు ‘అతిలోక సుందరి’గా ఆరాధిస్తుంటారు. దశాబ్దాల కాలం పాటు సినిమాల్లో నటించిన శ్రీదేవి బాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అనుష్క

సౌత్ ఇండియన్ నటి అనుష్క శెట్టి కూడా ఈ లిస్ట్ లో ఉంది. అనుష్క దశాబ్ద కాలం పైగానే సినిమాల్లో నటిస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది అనుష్క. అయితే అనుష్క ప్రస్తుతం సినిమాల్లో తక్కువ కనిపిస్తోంది. కానీ ఆమెకు దక్షిణ భారతదేశంలో మంచి క్రేజ్ ఉందనే చెప్పాలి. 

త్రిష కృష్ణన్

టాలీవుడ్ లో నటి త్రిషకు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమెకు కేవలం తెలుగులోనే కాకుండా ఇతర దక్షిణాది భాషల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఇటీవల తమిళ్ లో భారీ సక్సెస్ అయిన ‘పొన్నియిన్ సెల్వన్’ నటించి మంచి కమ్ బ్యాక్ ఇచ్చింది త్రిష. 

రేఖ

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దశాబ్దాల కాలం పాటు పనిచేసిన సీనియర్ హీరోయిన్ రేఖ. చాట్ జీపీటీ లో రేఖ కూడా స్థానం దక్కించుకోవడం విశేషం. ఈమెకు బాలీవుడ్ లో కాదు దక్షిణాది భాషల్లోనూ మంచి ఫాలోయింగ్ ఉందన్న విషయం తెలిసిందే. 

నయనతార

అందం గురించి మాట్లాడుతున్నప్పుడు లేడీ సూపర్ స్టార్ నయనతార పేరు ప్రస్తావించకపోతే ఎలా అనుకుందో ఏమో ఈ చాట్ జీపీటీ. నయనతార పేరును కూడా లిస్ట్ లో చేర్చింది. దక్షిణాదిన నయనతారకు ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. తెలుగు, తమిళ, మళయాళం ఇలా అన్ని భాషల్లోనూ నయనతారకు మంచి డిమాండ్ ఉంది. ఆమెకు ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ కూడా ఉంది. 

సమంత

ఈ మధ్య కాలంలో దక్షిణాదిన ఎక్కువగా వినిపిస్తోన్న పేరు సమంత. తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. లేడీ ఓరియెండెట్ చిత్రాలతో పాటు, వెబ్ సిరీస్ లలో కూడా బలమైన పాత్రలు చేస్తూ ఫ్యాన్ బేస్ ను పెంచుకుంది. ఓ వైపు గ్లామర్ మరోవైపు నటనతో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది సమంత. 

శ్రియ

నటి శ్రియకు తెలుగులో మంచి గుర్తింపు ఉంది. ఆమె ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. తెలుగుతో పాటు ఇతర దక్షిణాది సినిమాల్లో కూడా నటించి అభిమానుల్ని సొంతం చేసుకుంది. చాట్ జీపీటి విడుదల చేసిన లిస్ట్ లో ఈమె కూడా చోటు దక్కించుకుంది. 

అసిన్

తమిళ్, మళయాలం లో అసిన్ కు మంచి క్రేజ్ ఉంది. తెలుగులో ఈమె చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ అసిన్ అందం, అభినయంతో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించింది. అసిన్ కు ఇప్పటికీ అదే క్రేజ్ ఉంది. 

జెనీలియా

జెనీలియా లాంటి క్యూట్ హీరోయిన్ లను అభిమానించని వారు ఉంటారా. ఆమె అందం, అభినయంతో దక్షిణాదిన మంచి గుర్తింపు తెచ్చుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైనా మళ్లీ ఇప్పుడు వరుసగా సినిమాల్లో నటిస్తోంది. 

తమన్నా

నటి తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమెకు ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీ అని పేరు కూడా ఉంది. కన్నడ, తమిళ్, తెలుగు ఇలా అన్ని దక్షిణాది భాషల్లో తమన్నాకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 

శ్రద్దాకపూర్

బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ కు అక్కడ మంచి డిమాండ్ ఉంది. ఆమెకు బాలీవుడ్ లో ప్రత్యేక ఫ్యాన్ బేస్ కూడా ఉంది. పాన్ ఇండియా మూవీ ‘సాహో’తో శ్రద్దాకు దక్షిణాదిన కూడా మంచి ఫాలోయింగ్ పెరిగింది. దీంతో దక్షిణాది అందమైన హీరోయిన్ ల లిస్ట్ లో శ్రద్దా కూడా చేరింది. ప్రస్తుతం చాట్ జీపీటీ విడుదల చేసిన ఈ లిస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

Read Also: క్రికెటర్ ముత్తయ్యకు అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్, ‘800‘ మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్

Published at : 17 Apr 2023 12:04 PM (IST) Tags: Samantha Nayanthara Sreedevi South Indian Actress

సంబంధిత కథనాలు

శ్రీకాంత్ అడ్డాల సెన్సేషనల్ ప్రాజెక్ట్ 'పెదకాపు' - ఆసక్తికరంగా ఫస్ట్ లుక్!

శ్రీకాంత్ అడ్డాల సెన్సేషనల్ ప్రాజెక్ట్ 'పెదకాపు' - ఆసక్తికరంగా ఫస్ట్ లుక్!

మంచువారి రూ.100 కోట్ల సినిమా, మెగా ఇంట పెళ్లి భాజాలు - ఇంకా మరెన్నో సినీ విశేషాలు

మంచువారి రూ.100 కోట్ల సినిమా, మెగా ఇంట పెళ్లి భాజాలు - ఇంకా మరెన్నో సినీ విశేషాలు

Ram Charan: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం - రామ్ చరణ్ స్పెషల్ ట్వీట్

Ram Charan: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం - రామ్ చరణ్ స్పెషల్ ట్వీట్

Narasimha Naidu Re Release : బాలకృష్ణ బర్త్ డేకు 'నరసింహ నాయుడు' రీ రిలీజ్

Narasimha Naidu Re Release : బాలకృష్ణ బర్త్ డేకు 'నరసింహ నాయుడు' రీ రిలీజ్

Bhola Mania Song Promo : భోళా శంకరుడి మేనియా షురూ - ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే?

Bhola Mania Song Promo : భోళా శంకరుడి మేనియా షురూ - ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

YS Viveka Case : వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ - సీబీఐకి ఇచ్చిన ఆదేశాలు ఇవే !

YS Viveka Case  : వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ -  సీబీఐకి ఇచ్చిన ఆదేశాలు ఇవే   !

Top 5 160 CC Bikes: బెస్ట్ 160 సీసీ బైక్ కొనాలనుకుంటున్నారా - ఈ ఐదు ఆప్షన్లపై ఓ లుక్కేయండి!

Top 5 160 CC Bikes: బెస్ట్ 160 సీసీ బైక్ కొనాలనుకుంటున్నారా - ఈ ఐదు ఆప్షన్లపై ఓ లుక్కేయండి!

Hyderabad Accident: హైదరాబాద్ లో కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండేళ్ల పాప మృతి, డోర్ తీయడంతో విషాదం

Hyderabad Accident: హైదరాబాద్ లో కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండేళ్ల పాప మృతి, డోర్ తీయడంతో విషాదం