Spyder Re Release: మహేష్ బర్త్‌డే స్పెషల్... స్పైడర్ రీ రిలీజ్... ఇండియాలో కాదు, ఎక్కడో తెలుసా?
Mahesh Babu Birthday: మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా 'స్పైడర్' సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. అది కూడా ఇండియాలో కాదు... మరి ఎక్కడో తెలుసా? ఆ స్పెషల్ షో ఎక్కడ వేస్తున్నారో తెలుసా?

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) పుట్టినరోజు సందర్భంగా 'అతడు' (Athadu Re Release 2025)ను భారీ ఎత్తున రీ రిలీజ్ చేశారు. ఇండియాతో పాటు ఓవర్సీస్ మార్కెట్టులోనూ విడుదల చేశారు. అయితే... మహేష్ బర్త్ డే స్పెషల్ కింద 'స్పైడర్' సినిమానూ రీ రిలీజ్ అవుతోంది. అదీ ఇక్కడ కాదు... ఇండియాలో కాదు, మరి ఎక్కడో తెలుసా?
జపాన్‌లో 'స్పైడర్' రీ రిలీజ్!
Spyder special show on the occasion of Mahesh Babu Birthday: మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా జపాన్‌లో 'స్పైడర్' రీ రిలీజ్ చేస్తున్నారు. భారీ రిలీజ్ ఏం ప్లాన్ చేయలేదు. జస్ట్ ఒక్క స్పెషల్ షో వేస్తున్నారు. అది కూడా బర్త్ డే రోజు ఆగస్టు 9న కాదు... ఆగస్టు 10న.
జపాన్‌లోని కవాగుచి సిటీలో ఆగస్టు 10న మధ్యాహ్నం 4.15 గంటలకు 'స్పైడర్' షో వేస్తున్నారు. ఆల్రెడీ టికెట్స్ సేల్ మొదలైంది. అక్కడ ఫ్యాన్స్ నుంచి ఎటువంటి స్పందన లభిస్తుందో చూడాలి. ఇండియాలో 'స్పైడర్' ఆశించిన విజయం సాధించలేదు.
Also Read: మహేష్ బాబు పర్సనల్ లైఫ్ గురించి గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన ప్రశ్నలు... సమాధానాలు తెల్సా?
🎉マヘーシュ・バーブ誕生日記念上映会!🎉
— indo_eiga (@indo_eiga) August 5, 2025
8月10日(日)、マヘーシュ・バーブ誕生日記念上映会のお知らせです💫
2025年のお誕生日会は川口スキップシティで、「Spyder」を上映いたします!… pic.twitter.com/GGzkpTq4LV
మహేష్ బాబు హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన 'స్పైడర్'లో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. ఎస్.జె. సూర్య విలన్ రోల్ చేశారు. తెలుగు, తమిళ భాషల్లో సినిమా విడుదలైంది. 'ఠాగూర్' ఒరిజినల్ 'రమణ'తో పాటు తెలుగులో 'స్టాలిన్' వంటి సినిమాలు మురుగుదాస్ తీసి ఉండటం, 'తుపాకీ' వంటి డబ్బింగ్ ఫిలిమ్స్ తెలుగులోనూ విజయం సాధించడంతో 'స్పైడర్' మీద అంచనాలు ఏర్పడ్డాయి. వాటిని తల్లకిందులు చేస్తూ మూవీ ఫ్లాప్ అయ్యింది. ఇటీవల జపాన్ దేశంలో మన తెలుగు హీరోల సినిమాలను స్పెషల్ షోస్ వేస్తున్నారు. ఆ లిస్టులో ఈ సినిమా కూడా చేరింది.
రాజమౌళి సినిమాతో మహేష్ బిజీ!
ప్రస్తుతం మహేష్ బాబు చేస్తున్న సినిమాల విషయానికి వస్తే... దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో చేస్తున్న SSMb29తో బిజీగా ఉన్నారు. పాన్ వరల్డ్ స్థాయిలో ఆ సినిమా తెరకెక్కుతోంది. అది పూర్తి అయ్యే వరకు మరో సినిమా చేసే ఆలోచన మహేష్ బాబుకు లేదు.
Also Read: రాఖీ స్పెషల్: బ్రదర్ & సిస్టర్ సెంటిమెంట్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన 10 బెస్ట్ తెలుగు ఫిలిమ్స్
ట్రెండింగ్ వార్తలు






















