Sonakshi Sinha: పెళ్లి పోస్ట్‌పై అలాంటి కామెంట్స్ - ట్రోలర్స్‌కి సోనాక్షి సిన్హా స్ట్రాంగ్ కౌంటర్
Sonakshi Sinha Reacts on Trolls: తన పెళ్లి పోస్ట్‌పై ట్రోల్ చేసిన నెటిజన్లకు సోనాక్షి సిన్హా ఇచ్చిపడేసింది. ప్రియుడి జహీర్ ఇక్బాల్‌తో ఇటీవల ఆమె ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే. అయితే..
Sonakshi Sinha Strong Counter to Trollers Who criticising Her Marriage: కొత్త పెళ్లి కూతురు, బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ట్రోల్స్‌పై స్పందించింది. ఆమె షేర్ చేసిన పెళ్లి ఫోటోలపై దారుణమైన ట్రోల్స్ రావడంతో ఏకంగా కామెంట్స్ సెక్షన్ డిసేబుల్ చేసింది. ఆ తర్వాత తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ట్రోలర్స్‌కి స్మూత్‌గా చురక అట్టించింది. ఇంతకి ఏమైందంటే.. నటి సోనాక్షి సిన్హా ఇటీవల తన ప్రియుడు, నటుడు జహీర్ ఇక్బాల్‌తో ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే. ఏడేళ్లు ప్రేమించుకుంటున్న వీరిద్దరు ఆదివారం జూన్ 23న మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
ఇరుకుటుంబ సభ్యులు, కొద్దిమంది బంధుమిత్రుల మధ్య వీరి పెళ్లి సింపుల్‌గా జరిగింది. పెళ్లి అనంతరం సోనాక్షి పెళ్లి ఫోటోలు షేర్ చేస్తూ ఎమోషనలైన సంగతి తెలిసిందే. సరిగ్గా ఇదే రోజు ఏడేళ్ల క్రితం ఒకరి కళ్లలో ఒకరం నిజమైన ప్రేమను చూశామని, మేం ఎప్పటికి ఒక్కటే అని అప్పుడే స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యామంటూ క్యాప్షన్ ఇచ్చింది. అయితే ఈ పోస్ట్‌పై కొందరు పాజిటివ్‌గా స్పందిస్తూ ఈ జంటకు శుభకాంక్షలు తెలిపారు. అయితే మరికొందరు మాత్రం ఈ జంటను టార్గెట్ చేస్తూ ట్రోల్ చేశారు. ముఖ్యంగా వీరిద్దరి మతాలు వేరు కావడంతో ఓ వర్గం నుంచి తీవ్రమైన విమర్శలు వచ్చాయి. కామెంట్స్‌లో ఇవి మరి ఎక్కువ కావడంతో.. తమ ఆనందానికి ఇవి అడ్డుకావద్దనుకుంది ఈ జంట.
View this post on Instagram
దీంతో తమ పోస్ట్ కామెంట్ సెక్షన్ డిసేబుల్ చేశారు. అయితే ఇది జరిగిన రెండు రోజులకు సోనాక్షి ట్రోల్స్‌పై స్పందించింది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్‌ను రీషేర్ చేసింది. ఇద్దరు మతాలు వేరైన తమ ప్రేమను స్వాగతిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఈ జంటను విష్ చేస్తూ ప్రసాద్ భరత్ఆర్ట్ అనే యూజర్ 'ప్రేమ అనేది సార్వత్రిక మతం' అంటూ ఇద్దరు ఫోటోతో పోస్ట్ షేర్ చేశాడు. దీనికి సోనాక్షి షేర్ చేస్తూ "ట్రూ వర్డ్స్' మీ విషెష్ థ్యాంక్యూ" అంటూ కామెంట్ చేసింది. ఇలా సోనాక్షి ట్రోలర్స్‌కి గట్టి కౌంటర్ ఇచ్చిందని, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అంటూ విమర్శలు చేసిన వారికి గట్టి కౌంటర్ అని ఆమె ప్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం సోనాక్షి పోస్ట్ హాట్‌టాపిక్‌గా మారింది. కాగా ఇద్దరు(సోనాక్షి సిన్హా-జహీర్ ఇక్బాల్)మతాలు వేరు అయినందుకు మొదట సోనాక్షి కుటుంబం కూడా ఈ పెళ్లికి నిరాకరించినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. సోనాక్షి పెళ్లి అంటూ వార్తలు రాగానే మీడియా శత్రుఘ్న సిన్హాను ప్రశ్నించగా.. దీనికి ఆయన స్పందిస్తూ "నా కూతురు పెళ్లా? నాకు తెలియదు" అంటూ ఊహించని రిప్లై ఇచ్చారు. దీంతో సోనాక్షి పెళ్లిప రకరకాల పుకార్లు వచ్చాయి. తన కుటుంబానికి వ్యతిరేకంగా ఆమె ఈ పెళ్లి చేసుకుంటుందంటూ రూమర్స్ క్రియేట్ చేశారు.
Also Read: భార్యకు స్టార్ హీరో 'జయం' రవి విడాకులు? - ఇలా హింట్ ఇచ్చిన ఆయన భార్య ఆర్తి..!
అంతేకాదు తన తల్లి, సోదరుడు సోనాక్షిని సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేశారంటూ కూడా ప్రచారం జరిగింది. ఈ నెగిటివ్ ప్రచారంపై స్వయంగా శత్రుఘ్న సిన్హా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. నా కూతురి పెళ్లికి వెళ్తున్నానంటూ వెల్లడించారు. అంతేకాదు తన కూతురి పెళ్లి గురించి తప్పుడు ప్రచారం చేస్తున్న ట్రోలర్స్‌ని ఉద్దేశిస్తూ.. "పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన వ్యక్తిగత నిర్ణయం. ఈ విషయంలో జోక్యం చేసుకునే హక్కు ఎవరికి లేదు. కాబట్టి ఇక మీరు వెళ్లి మీకు పనికొచ్చే పని ఏదైనా చేసుకోండి!" అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.