Sobhita Dhulipala: ఎంగేజ్మెంట్ ఎఫెక్ట్? ఆ విషయంలో అక్షయ్, జాన్వీలను మించిపోయిన శోభిత దూళిపాళ
Sobhita Dhulipala: ఇటీవల అక్కినేని వారసుడు నాగచైతన్యతో ఎంగేజ్‌మెంట్ చేసుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది శోభిత ధూళిపాళ. నిశ్చితార్థం తర్వాత తను ఒక్కసారిగా చాలా పాపులర్ అయిపోయింది.

Sobhita Dhulipala In IMDb's Popular Indian Celebrities List: ఇప్పటివరకు ఒక నటిగా ప్రేక్షకులను మెప్పించింది శోభిత ధూళిపాళ. తన ఆన్ స్క్రీన్ పర్ఫార్మెన్స్ గురించి ఆడియన్స్ మాట్లాడుకున్నా కూడా పర్సనల్‌గా తన లైఫ్ గురించి ఎప్పుడూ పెద్దగా చర్చలు జరగలేదు. కానీ ఒక్కసారిగా నాగచైతన్యతో జరిగిన నిశ్చితార్థం.. శోభిత పర్సనల్ లైఫ్‌పై ప్రేక్షకులు ఫోకస్ చేసేలా చేసింది. అక్కినేని కుటుంబానికి కాబోయే కోడలిగా ప్రస్తుతం తన పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. ప్రస్తుతం ఎక్కడ చూసిన తన పేరే వినిపిస్తోంది. ఇంతలోనే నిశ్చితార్థం జరిగిన కొన్నిరోజుల్లోనే మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది శోభిత ధూళిపాళ.
ముందుకు దూసుకొచ్చింది..
ఐఎమ్‌డీబీ.. ఎప్పటికప్పుడు సినీ పరిశ్రమలో పాపులర్ సెలబ్రిటీలు ఎవరు అనే విషయాన్ని ప్రకటిస్తూనే ఉంటుంది. ఈరోజు టాప్ స్థానంలో ఉన్న సెలబ్రిటీలు.. రేపు రెండో స్థానానికి వెళ్లిపోవచ్చు. అలా ఐఎమ్‌డీబీ మోస్ట్ పాపులర్ సెలబ్రిటీల లిస్ట్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంది. ఇప్పటివరకు శోభిత ధూళిపాళ కూడా తన స్క్రిప్ట్ సెలక్షన్, యాక్టింగ్‌తో ఐఎమ్‌డీబీ మోస్ట్ పాపులర్ సెలబ్రిటీల లిస్ట్‌లో స్థానం సంపాదించుకుంది. కానీ నాగచైతన్యతో వివాహం తర్వాత ఎంతోమంది స్టార్ నటీనటులను వెనక్కి నెట్టి ఐఎమ్‌డీబీలో టాప్ 2 స్థానాన్ని దక్కించుకొని అందరినీ ఆశ్చర్యపరుస్తోంది శోభిత ధూళిపాళ.
ఆ హీరోయిన్ తర్వాతే..
ప్రస్తుతం ఐఎమ్‌డీబీ మోస్ట్ పాపులర్ సెలబ్రిటీల లిస్ట్‌లో టాప్ 1 స్థానంలో బాలీవుడ్ హీరోయిన్ షర్వరీ ఉంది. ‘ముంజ్య ’, ‘మహారాజ్’ లాంటి రెండు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్‌లో కనిపించింది అందరినీ ఆకట్టుకుంది ఈ భామ. అంతే కాకుండా ఐఎమ్‌డీబీ బ్రేక్ అవుట్ స్టార్ స్టార్‌మీటర్ అవార్డ్ కూడా దక్కించుకుంది. దీంతో ఒక్కసారిగా ప్రేక్షకులంతా తనపై ఫోకస్ పెట్టారు. దీంతో తనకు ఐఎమ్‌డీబీలో ఏకంగా టాప్ ర్యాంక్ దక్కింది. వరుసగా రెండో వారం కూడా తనే టాప్‌లో ఉండి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పుడు తన తరువాతి స్థానంలోకి అంటే టాప్ 2 ర్యాంక్‌ను శోభిత దక్కించుకుంది. ఐఎమ్‌డీబీ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీల లిస్ట్‌లో టాప్ 5 స్థానంలో జాన్వీ కపూర్ నిలిచింది.
పాపులర్ సెలబ్రిటీస్..
‘ఖేల్ ఖేల్ మే’, ‘ఫిర్ ఆయి హసీన్ దిల్‌రుబా’ లాంటి సినిమాలు తన ఖాతాలో ఉండడంతో తాప్సీ.. ఐఎమ్‌డీబీ పాపులర్ సెలబ్రిటీల లిస్ట్‌లో టాప్ 15 స్థానాన్ని దక్కించుకుంది. తాప్సీ తరువాతి స్థానంలో.. అంటే టాప్ 16లో అక్షయ్ కుమార్ ఉన్నాడు. ‘12త్ ఫెయిల్’ ఫేమ్ విక్రాంత్ మాస్సేకు 35వ ర్యాంక్ దక్కింది. ప్రపంచవ్యాప్తంగా నెలకు 200 మిలియన్ల యూజర్లు ఐఎమ్‌డీబీ వెబ్‌సైట్‌ను ఉపయోగిస్తుంటారు. అందులో వారు ఇచ్చే క్లిక్స్‌ను బట్టి పాపులర్ సెలబ్రిటీల లిస్ట్ రెడీ అవుతుంది. అలా నాగచైతన్యతో నిశ్చితార్థం తర్వాత శోభిత ధూళిపాళ గురించి తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపించి తనకు ఈ లిస్ట్‌లో 2వ స్థానం దక్కేలా చేశారు.
Also Read: చైతూ, శోభితాపై కామెంట్స్ - వేణు స్వామికి మంచు విష్ణు వార్నింగ్? పోలీసు కేసు నమోదు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

