తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ సోషల్ మీడియా చూస్తే తను యూత్‌కు ఫ్యాషన్ ఐకాన్ అని అనిపించక తప్పదు. ఎంగేజ్‌మెంట్స్‌కు ఎలాంటి హెయిర్ స్టైల్ బాగుంటుందో తెలియక కన్‌ఫ్యూజన్‌లో ఉంటే శోభిత హెయిర్ స్టైల్స్‌పై ఓ లుక్కేయండి. సింపుల్‌గా జడ, మధ్యలో పాపిడిబిల్ల.. ఔట్‌డేటెడ్‌గా అనిపించినా క్లాసిక్ లుక్ ఇస్తుంది. లూజ్ హెయిర్ ఇష్టం లేనివారు ఇలా క్లిప్ పెట్టి వదిలేస్తే సరిపోతుంది. ఇలాంటి లూజ్ పోనీటెయిల్స్ మీకు వింటేజ్ లుక్‌ను ఇస్తాయి. మామూలుగా కొప్పుకడితే సింపుల్‌గా ఉంటుంది అనిపిస్తే.. ఇలాంటి డిఫరెంట్ కొప్పును కూడా ట్రై చేయవచ్చు. కొప్పు కట్టేసి, దానిని ఇలాంటి డిఫరెంట్ ఫ్లవర్స్‌తో అలంకరిస్తే అందరిలో మీరు డిఫరెంట్‌గా కనిపిస్తారు. మధ్య పాపిడి, లూజ్ హెయిర్.. మీరూ క్లాస్సీగా కనిపించేలా చేస్తుంది. ఈవెంట్స్‌లో హై పోనీటెయిల్ బాగుంటుందని చెప్పడానికి ఈ శోభిత లుక్కే ఉదాహరణ. All Images Credit: Sobhita Dhulipala/Instagram