Sita Kalyana Vaibhogame Movie: రామాయణం ఆధారంగా 'సీతా కళ్యాణ వైభోగమే' - కొత్త హీరోతో రిస్క్ చేసిన నిర్మాత!
సుమన్ తేజ్, గరీమా చౌహన్ జంటగా సతీష్ పరమవేద దర్శకత్వంలో రాచాల యుగంధర్ నిర్మించిన 'సీతా కళ్యాణ వైభోగమే' ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు.
''రామాయణం ఆధారంగా తీసిన చిత్రమిది. మన విలువలు, సంప్రదాయాలను మళ్లీ ప్రేక్షకులు అందరికీ చూపించాలానే ఉద్దేశంతో చేసిన చిత్రమిది. మనం మర్చిపోతున్న విలువలను అందరికీ గుర్తు చేసేలా ఉంటుంది'' అని దర్శకుడు సతీష్ పరమవేద అన్నారు. ఆయన దర్శకత్వంలో డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై రాచాల యుగంధర్ నిర్మించిన సినిమా 'సీతా కళ్యాణ వైభోగమే'. సుమన్ తేజ్, గరీమా చౌహన్ జంటగా నటించారు. ఈ నెల 26న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం విలేకరుల సమావేశం నిర్వహించింది.
కొత్త హీరోతో సినిమా తీయడం అంత ఈజీ కాదు: సుమన్ తేజ్
''ఒక కొత్త హీరోని నమ్మి సినిమా తీయడం అంత ఈజీగా కాదు. మా మీద నమ్మకంతో ఖర్చుకు వెనుకాడకుండా తీసిన రాచాల యుగంధర్ గారికి థాంక్స్'' అని హీరో సుమన్ తేజ్ తెలిపారు. దర్శకుడు సతీష్ పరమవేద మంచి కమర్షియల్ సినిమా తీశారని చెప్పుకొచ్చారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''హీరోయిన్ గరీమా చౌహన్ చక్కగా నటించింది. గగన్ విహారి గారు పాత్రకు తగ్గట్టు వైల్డ్‌గా నటించారు. కెమెరా వర్క్, మ్యూజిక్ బావుంటాయి'' అని అన్నారు.
Also Read: సూపర్ యోధగా నయా సూపర్ హీరో తేజ సజ్జా - 18న రివీల్ చేసే టైటిల్ అదేనా?
ఈ సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకుంటుంది: నిర్మాత రాచాల యుగంధర్
యాక్షన్, లవ్, ఫ్యామిలీ వేల్యూస్... అన్నీ కలగలిపి ఈ సినిమా తీశామని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని నిర్మాత రాచాల యుగంధర్ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''దర్శకుడు సతీష్ ఎంతో అద్భుతంగా సినిమా తీశారు. హీరో హీరోయిన్లు సుమన్ తేజ్, గరిమ చౌహాన్ కొత్త వాళ్లైనా చాలా అద్భుతంగా నటించారు. 'ధర్మపురి' హీరో గగన్ విహారి విలన్ పాత్రలో చక్కగా ఒదిగిపోయారు. వందల మందితో 'సీతా కళ్యాణ వైభోగమే'లో పాటలు, ఫైట్లు భారీ ఎత్తున తీశాం. ప్రేక్షకులు అందరూ థియేటర్లలో సినిమా చూడాలని కోరుతున్నా'' అని చెప్పారు. తమ సినిమాతో నీరుస్ యాజమాన్యం పార్ట్నర్ కావడం ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు.
Also Read: ఆ ఒక్కటీ అడక్కు రిలీజ్ డేట్ ఫిక్స్ - నరేష్ కొత్త సినిమా థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడంటే?
దర్శకుడిగా తన తొలి సినిమా 'ఊరికి ఉత్తరాన'కు రాచాల యుగంధర్ సహ నిర్మాత అని, తన రెండో సినిమా ఆయన నిర్మాణంలో చేయడం సంతోషంగా ఉందని సతీష్ పరమవేద తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ గరీమ చౌహాన్, గగన్ విహారి తదితరులు పాల్గొన్నారు. సుమన్ తేజ్, గరీమా చౌహన్ జంటగా నటించిన 'సీతా కళ్యాణ వైభోగమే' చిత్రంలో గగన్ విహారి విలన్. నాగినీడు, శివాజీ రాజా, ప్రభావతి, వెంకీ మంకీ ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం: చరణ్ అర్జున్, కెమెరా: పరుశురామ్, ఎడిటింగ్: డి. వెంకట ప్రభు, నృత్య దర్శకత్వం: భాను మాస్టర్ - పోలకి విజయ్, నిర్మాణం: రాచాల యుగంధర్, దర్శకత్వం: సతీష్ పరమవేద.