అన్వేషించండి

Aa Okkati Adakku Release Date: ఆ ఒక్కటీ అడక్కు రిలీజ్ డేట్ ఫిక్స్ - నరేష్ కొత్త సినిమా థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడంటే?

Aa Okkati Adakku 2024 Movie: కామెడీ కింగ్ 'అల్లరి' నరేష్ హీరోగా ఆయన తండ్రి ఈవీవీ దర్శకత్వం వహించిన క్లాసిక్ ఫిల్మ్ 'ఆ ఒక్కటి అడక్కు' టైటిల్‌తో లేటెస్టుగా ఓ మూవీ తెరకెక్కుతోంది.

కామెడీ కింగ్ 'అల్లరి' నరేష్ (Allari Naresh) ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి రెడీ అయ్యారు. వినోదంతో విందు భోజనం పెట్టడానికి సిద్ధమయ్యారు. సీరియస్ సినిమాలు 'నాంది', 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం', 'ఉగ్రం'తో సోలో హీరోగా వరుస విజయాలు అందుకున్న ఆయన... మళ్లీ తన హోమ్ గ్రౌండ్ కామెడీకి వచ్చారు. 'నా సామి రంగ'లో వింటేజ్ నరేష్ సందడి చేశారు. ఇప్పుడు ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు'తో వేసవిలో వినోదం అందించడానికి వస్తున్నారు.

'ఆ ఒక్కటీ అడక్కు' విడుదల తేదీ ఫిక్స్!
'ఆ ఒక్కటీ అడక్కు' టైటిల్ వింటే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తుకు వచ్చేది రాజేంద్ర ప్రసాద్ హీరోగా నరేష్ తండ్రి, దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన సినిమా. అది క్లాసిక్ అయ్యింది. ఆ పేరుతో నరేష్ సినిమా చేస్తుండటం, అదీ పెళ్లి సమస్య నేపథ్యంలో కావడంతో అంచనాలు పెరిగాయి. ఈ సినిమాను మే 3న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అతి పెద్ద డిస్ట్రిబ్యూషన్ హౌస్‌లలో ఒకటైన ఆసియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్ఎల్పీ 'ఆ ఒక్కటీ అడక్కు' పంపిణీ హక్కులను సొంతం చేసుకుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఆ సంస్థ ద్వారా ఈ సినిమా విడుదల కానుంది.

Also Read: విశాఖ నడిరోడ్డు మీద అర్ధరాత్రి అమ్మాయిల పడిగాపులు... ఇంటర్ సిటీ స్మార్ట్ బస్ అరాచకాలకు నరకం చూసిన ప్రయాణికులు

'అల్లరి' నరేష్ సరసన ఫరియా అబ్దుల్లా!
హీరోగా 'అల్లరి' నరేష్ (Allari Naresh 61 Movie)కు 61వ చిత్రమిది. ఆల్రెడీ విడుదల చేసిన మూవీ గ్లింప్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. 'ఆ ఒక్కటీ అడక్కు' అంటే... ఏది అడక్కూడదు? అంటే... 'పెళ్లి ఎప్పుడు?' అని నరేష్ చెబుతున్నారు. ఈతరం యువత ఫేస్ చేస్తున్న పాన్ ఇండియా ప్రాబ్లమ్ పెళ్లి నేపథ్యంలో 'ఆ ఒక్కటీ అడక్కు' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో 'అల్లరి' నరేష్ సరసన 'జాతి రత్నాలు' ఫేమ్ ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) నటిస్తున్నారు.

Also Read: ఘనంగా దర్శకుడు శంకర్ కుమార్తె ఐశ్వర్య పెళ్లి - సీఎం స్టాలిన్ నుంచి సూపర్ స్టార్స్ వరకు సందడి చేసిన తారలు

'ఆ ఒక్కటీ అడక్కు' సినిమాతో మల్లి అంకం దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. చిలకా ప్రొడక్షన్స్ పతాకంపై రాజీవ్ చిలక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో లెజెండరీ కమెడియన్ జానీ లివర్ కుమార్తె జెమీ లివర్, 'వెన్నెల' కిశోర్, 'వైవా' హర్ష, అరియనా గ్లోరీ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Also Read: శరవేగంగా సాగుతోన్న రవితేజ మల్టిప్లెక్స్ నిర్మాణాలు - ఎక్క‌డో తెలుసా?


ఈ చిత్రానికి కళా దర్శకుడు: జేకే మూర్తి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అక్షిత అక్కి, కూర్పు: ఛోటా కె ప్రసాద్, ఛాయాగ్రహణం: సూర్య, రచన: అబ్బూరి రవి, సంగీతం: గోపి సుందర్, సహ నిర్మాత: భరత్ లక్ష్మీపతి, నిర్మాత: రాజీవ్ చిలక, దర్శకత్వం: మల్లి అంకం.

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget