అన్వేషించండి
Director Shankar Daughter Wedding: ఘనంగా దర్శకుడు శంకర్ కుమార్తె ఐశ్వర్య పెళ్లి - సీఎం స్టాలిన్ నుంచి సూపర్ స్టార్స్ వరకు సందడి చేసిన తారలు
Shankar Daughter Aishwarya Wedding Photos: స్టార్ డైరెక్టర్ శంకర్ కుమార్తె ఐశ్వర్య వివాహం తరుణ్ కార్తికేయతో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు తమిళనాడు సీఎం స్టాలిన్ సహా కోలీవుడ్ స్టార్ హీరోలు అటెండ్ అయ్యారు.

శంకర్ కుమార్తె ఐశ్వర్య, తరుణ్ కార్తికేయ వివాహంలో సందడి చేసిన తారలు
1/8

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్, భాషలకు అతీతంగా దేశవ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్న లెజెండరీ ఫిల్మ్ మేకర్ శంకర్. ఆయన తీసిన సినిమాలు ఇతర భాషల్లో అనువాదమై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రజెంట్ కమల్ హాసన్ హీరోగా 'ఇండియన్ 2', మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా 'గేమ్ ఛేంజర్' తీస్తున్నారు శంకర్. ఒకవైపు సినిమా పనులతో బిజీగా ఉన్నప్పటికీ... మరో వైపు పెళ్లి పనులు కూడా పూర్తి చేశారు. శంకర్ పెద్ద కుమార్తె ఐశ్వర్య వివాహం తరుణ్ కార్తికేయతో ఈ రోజు చెన్నైలో జరిగింది. అంగరంగవైభవంగా జరిగిన ఈ వేడుకకు తమిళనాడు సీఎం స్టాలిన్ సహా పలువురు స్టార్ హీరోలు, దర్శకులు అటెండ్ అయ్యారు. ఆ ఫోటోలు చూడండి.
2/8

నూతన వధూవరులు ఐశ్వర్య శంకర్, తరుణ్ కార్తికేయతో పాటు వధువు తల్లిదండ్రులు శంకర్, ఈశ్వరితో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్
3/8

సూపర్ స్టార్ రజనీకాంత్, శంకర్ మధ్య మంచి అనుబంధం ఉంది. రజని హీరోగా శంకర్ తీసిన 'శివాజీ', 'రోబో', '2.ఓ' సూపర్ హిట్స్ అయ్యాయి. శంకర్ కుమార్తె ఐశ్వర్య వివాహానికి విచ్చేసి కొత్త దంపతులను ఆశీర్వదించిన రజనీకాంత్
4/8

శంకర్ ప్రతిభను తొలినాళ్లలో గుర్తించిన లోక నాయకుడు కమల్ హాసన్, ఆయనతో 'భారతీయుడు' చేశారు. ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ 'ఇండియన్ 2' చేస్తున్నారు. పెళ్లిలో ఆయన కూడా సందడి చేశారు.
5/8

ఐశ్వర్య శంకర్, తరుణ్ కార్తికేయ పెళ్లిలో సందడి చేసిన కోలీవుడ్ స్టార్ బి బ్రదర్స్ సూర్య అండ్ కార్తీ
6/8

శంకర్ అభిమానుల్లో ఒకరైన దర్శకుడు విఘ్నేష్ శివన్, లేడీ సూపర్ స్టార్ నయనతార దంపతులు సైతం పెళ్లికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
7/8

ఐశ్వర్య శంకర్ వివాహంలో శంకర్ తీసిన 'అపరిచితుడు' సినిమాలో హీరో, స్టార్ హీరో చియాన్ విక్రమ్... దర్శకుడు మణిరత్నం, సుహాసిని దంపతులు
8/8

నూతన దంపతులతో శంకర్ కుటుంబ సభ్యులు... ఫోటోలో శంకర్ రెండో కుమార్తె అదితిని చూడొచ్చు. ఆమె కథానాయికగా నటిస్తున్నారు.
Published at : 15 Apr 2024 04:18 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
హైదరాబాద్
ఐపీఎల్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion