Ravi Teja: శరవేగంగా సాగుతోన్న రవితేజ మల్టిప్లెక్స్ నిర్మాణాలు - ఎక్కడో తెలుసా?
Ravi Teja: టాలీవుడ్ అమితాబ్ బచ్చన్ రవితేజ కొత్త బిజినెస్ లోకి అడుగుపెట్టబోతున్నారు. మహేశ్ బాబు, బన్నీ, విజయ్ దేవరకొండ బాటలో అడుగులు వేయబోతున్నాడు. మరి ఏంటా బిజినెస్?

Ravi Teja Entering In to New Business: టాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకరు రవితేజ. ఎన్నో హిట్ సినిమాలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు రవితేజ. ఇప్పుడు కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు ఆయన. అయితే యువ హీరోలు మహేశ్ బాబు, బన్నీ, విజయ్ దేవరకొండ బాటలో పయనిస్తున్నాడు అంట రవితేజ. అది కూడా సినిమాల విషయంలో కాదు. బిజినెస్ విషయంలో. అవును రవితేజ.. మల్టీ ప్లెక్స్ థియేటర్ నిర్మిస్తున్నాడు. ఆ థియేటర్ దాదాపు రెడీ అయిపోయింది కూడా.
ఏషియన్‌తో కలిసి..
ఏషియన్ రవితేజ పేరుతో హైదరాబాద్‌లో మల్టీప్లెక్స్ థియేటర్ నిర్మిస్తున్నాడు రవితేజ. థియేటర్ నిర్మాణం దాదాపు పూర్తైంది. ఎల్ బీనగర్ దగ్గర్లోని వనస్థిపురం, హస్తినాపురం ఏరియాలో ఈ థియేటర్‌ను నిర్మిస్తున్నారు. ఏషియన్ సంస్థతో కలిసి రవితేజ ఈ మల్టీప్లెక్స్ థియేటర్‌ను నిర్మిస్తున్నారు. దీంతో ఈ థియేటర్ కి 'ఏఆర్‌టీ’ సినిమాస్ అని నామకరణం చేశారు. దీనికి సంబంధించిన ఫొటో ట్విట్టర్‌లో తెగ వైరల్ అవుతోంది. మొత్తం ఆరు స్క్రీన్స్‌తో ఈ మల్టీప్లెక్స్ థియేటర్‌ను నిర్మిస్తున్నారట. ఈ ఏడాదిలోనే ఏషియన్ రవితేజ ప్రారంభం కానున్నట్లు సమాచారం. అయితే, దీని గురించి మాస్ మహారాజ రవితేజ త్వరలోనే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అభిమానులతో షేర్ చేసుకుంటారని సన్నిహితులు చెప్తున్నారు.
Asian Raviteja Multiplex with 6 Screen Dolby Atmos 💥🔊 📽
— Filmy Bowl (@FilmyBowl) April 15, 2024
NearBy Areas : Dilshuknagar, Lb nagar, Vanasthalipuram, Hastinapuram.. 🤩 pic.twitter.com/29FB6MVJbM
ఇప్పటికే ఉన్న థియేటర్లు..
ఏషియన్స్ సినిమా ఇప్పటికే ముగ్గురు హీరోలతో కలిసి థియేటర్లు రూపొందించింది. మొదట 'ఏఎంబీ' సినిమాస్ పేరుతో మహేశ్ బాబు, ఏషియన్ థియేటర్స్ కలిసి శరత్ సిటీ క్యాపిటల్ మాల్ లో థియేటర్ ప్రారంభించారు. ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'ఏఏఏ' పేరుతో థియేటర్లు ఓపెన్ చేయగా.. విజయ్ దేవరకొండ మహబూబ్ నగర్ లో 'ఏవీడీ' పేరుతో థియేటర్ ఓపెన్ చేశారు. ఇక ఇప్పుడు రవితేజ. 'ఏఆర్‌టీ' పేరుతో కొత్త థియేటర్ ఓపెన్ చేయనున్నారు. దీంతో మాస్ మహారాజ ట్రెండ్ ని ఫాలో అయితున్నాడన్నమాట అంటున్నారు ఆయన అభిమానులు.
ఈ మధ్యే ప్రొడ్యూసర్‌గా..
ఒకవైపు సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న రవితేజ్.. ఈ మధ్యే ప్రొడ్యూసర్‌గా ఎంట్రీ ఇచ్చారు. చిన్న చిన్ని సినిమాలను ప్రొడ్యూస్ చేస్తున్నారు ఆయన. దాంట్లో భాగంగానే వైవా హర్ష నటించిన 'సుందరం మాస్టారు' సినిమాకి మాస్ మహారాజ ప్రొడ్యూస్ గా వ్యవహించారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. ఈ మధ్యకాలంలో రవితేజ నటించిన సినిమాలు అనుకున్నంతగా రానించలేదు. అయితే, ప్రస్తుతం రవితేజ 'బచ్చన్ సాబ్' సినిమా చేస్తున్నారు రవితేజ. హరీష్ శంకర్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఆ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు. అది ఈ ఏడాది థియేటర్లలోకి రానుంది. ఆ తర్వాత సంక్రాంతికి ఇప్పుడే డేట్స్ లాక్ చేసుకున్నాడు రవితేజ. రవితేజ, భాను భోగవరపు కలయికలో సినిమా చేస్తున్నట్లు నిర్మాణ సంస్థలు వెల్లడించాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపాయి. త్వరలో షూటింగ్ కూడా ప్రారంభం కానుంది.
Also Read: ‘అదుర్స్-2’ పాన్ వరల్డ్ సినిమా - ఎన్టీఆర్ చేయను అంటే.. వాళ్ల పిల్లలతో చేస్తా
Before You Go
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















