టెంపరేచర్ పెరుగుతున్నకొద్ది డీ హైడ్రేట్ అవుతాం. దానివల్ల జీర్ణం సరిగ్గా అవ్వదు. గట్ హెల్త్ కోసం టిప్స్. పెరుగు, కెఫిర్, కిమ్చీ, మజ్జిగ ప్రొబయాటిక్ ఫుడ్. కడుపు నొప్పి తగ్గేందుకు, విరోచనాలు తగ్గేందుకు ఇవి తింటారు. ఫైబర్ మైక్రోన్యూట్రియంట్. అది తీసుకోవడం వల్ల.. బోవెల్ మూమెంట్ రెగ్యులేట్ అవుతుంది. ఆహారం ఈజీగా జీర్ణం అవుతుంది. పండ్లు, కూరగాయలు, గింజలు, క్యారెట్, చెరకు లాంటి వాటిల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కెఫైన్ తీసుకోకూడదు. కెఫైన్ ఎక్కువగా తీసుకుంటే ఇరిటేషన్ వస్తుంది. కెఫైన్ జీర్ణం అవ్వకుండా చేస్తుంది. ఎండాకాలంలో టీ, కాఫీలకు బదులుగా బ్లాక్ టీ, మట్కా టీ, గ్రీన్ టీ లాంటివి తీసుకుంటే మంచిది. హైడ్రేటెడ్ గా ఉండాలి. అది డైజెస్టివ్ సిస్టమ్ ని యాక్టివ్ చేస్తుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా గట్ ఫ్రీ అవుతుంది. కీరదోస, పుచ్చకాయ, కమల పండ్లు, కొబ్బరినీళ్లు, హెర్బల్ టీ లాంటివి వేసవికాలంలో హైడ్రేటెడ్ గా ఉంచుతాయి. పసుపు యాంటీ ఇన్ ఫ్లమేటరీ స్పైస్. అది ఇర్రిటబుల్ బోవెల్ సిండ్రోమ్ ని తగ్గిస్తుంది. పుసుపును ప్రతి రోజు కూరల్లో, పాలలో, స్మూథీల్లో వేసుకుని తీసుకుంటే మంచిది.